విషయ సూచిక

Site Feeds

Pages

Categories

Monthly Archives

Tags

All Articles

"టింగ్యా"-ప్రాంతీయ పరిమళం

“టింగ్యా”-ప్రాంతీయ పరిమళం

వాడికి చికెన్ అంటే చాలా ఇష్టమండి…అస్సలు వాడ్ని మర్చిపోలేకపోతున్నాం…ఎప్పుడూ మా వెనకే తిరిగేవాడు.అంటూ ఒక్కసారిగా గొల్లుమంది ఆవిడ. టీవీ పెట్టుకుని వేరే పని చేసుకుంటున్న నేను ఆ సౌండ్ కి ఉలిక్కిపడి అటు చూసా..ఆవిడ కళ్ళల్లో నీళ్ళు..ప్రక్కనే ఓ ఫొటో,అగరొత్తులు వగైరా. పాపం ఏ కొడుకో చిన్న వయిస్సులోనే చచ్చిపోయింటాడు అనుకుని ఎలర్టయి చూస్తే…ఫొటోలో క్లోజప్ లో దర్జాగా ఓ కుక్క నిలబడి ఉంది. షాకయ్యా…మనిషికి జంతువులంటే ఎంత ప్రేమ.కన్న బిడ్డలను సాకినట్లే సాకుతారు అనుకుంటూంటే [...]

డిజిటల్ సినిమా- కేవలం మాధ్యమంలో మార్పా లేక విధానంలోనా !

డిజిటల్ సినిమా- కేవలం మాధ్యమంలో మార్పా లేక విధానంలోనా !

గత పదేళ్ళుగా “డిజిటల్ సినిమా వచ్చేసింది ! వచ్చేసింది!!” అని వినడమేగానీ నిజంగా ప్రధానస్రవంతి చిత్రాలను అది ఎంతగా ప్రభావితం చేసింది అనేది ప్రశ్నార్థకమే.
ఎడిటింగ్, సౌండ్ మిక్సింగ్, రీరికార్డింగ్, కలరింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో డిజిటల్ టెక్నాలజీ ఉపయోగం విరివిగా పెరిగినా అది కేవలం సాంకేతిక పరిజ్ఞానానికి పరిమితమే తప్ప  మన సినిమా కంటెన్ట్ (కథాకథనం)లో తెచ్చిన మార్పు పెద్దగా కనిపించదు.ఈ మధ్యకాలంలో డిజిటల్ ప్రొజెక్షన్ ఉన్న [...]

It's a wonderful life

It’s a wonderful life

మనిషి జీవితం ఎంతో ఉన్నతమయినది. పది మందికీ ఉపయోగపడేది, పడాల్సినది.
కానీ మనం కాలక్రమంలో అప్పుడప్పుడూ మన జీవితం మీద ఆసక్తి కోల్పోతుంటాము. మన జీవితం యొక్క పరమార్థం గ్రహించకుండా ఉంటాము.
అసలు మీరు లేని ప్రపంచాన్ని ఒక్కసారి ఊహించుకోండి. దాని వల్ల మీ చుట్టుపక్కల వారికి ఏదయినా మార్పు ఉందా ? లేకపోయినట్లయితే మీ జీవితానికి అర్థం లేదేమో ?
ఇలాంటి ప్రశ్నలు, వాటికి సమాధానాలుగా ఒక మంచి సినిమా “It’s a wonderful life” .
ఇందులో స్థూలంగా కథ [...]

అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తొలి భారతీయ సినిమా - 'నీచా నగర్'

అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన తొలి భారతీయ సినిమా – ‘నీచా నగర్’

భారతీయ చిత్రరంగానికి అంతర్జాతీయ స్థాయిలో మొదటిసారి గుర్తింపు తెచ్చిన  సినిమా ఏది అని అడిగితే, చాలామంది తడుముకోకుండా చెప్పే పేరు సత్యజిత్ రాయ్  ‘పథేర్ పాంచాలి’ అనే. కాని మనకు ఆ ఖ్యాతిని ఆర్జించి పెట్టిన మొదటి సినిమా ‘పథేర్ పాంచాలి’ కాదు. అది ‘నీచా నగర్‘ అనే హిందీ చిత్రం. ఆ గౌరవాన్ని దక్కించుకున్న దర్శకుడు చేతన్ ఆనంద్ (1915-1997). ‘పథేర్ పాంచాలి’ కంటే దాదాపు ఒక దశాబ్దం ముందే 1946 లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో గొప్ప సామాజిక స్పృహ కలిగిన చిత్రంగా Grand Prix (Grand [...]

రన్నింగ్ కామెంట్రీ-మార్చి 9 2010-Digital Projection

రన్నింగ్ కామెంట్రీ-మార్చి 9 2010-Digital Projection

విడుదల కాకుండా ఆగిపోయిన సినిమా ఒకటి ఎలాగోలా రిలీజ్ చేసిపెట్టాలని ఒక తెలిసినాయన వస్తే నాకు తెలిసినంతలో సహాయం చేస్తున్నాను. ఆ process లో నేనూ చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇందులో ముఖ్యంగా నాకు బాగా తెలిసొచ్చిన, బహుశా భవిష్యత్తులో ఉపయోగపడే ఒక విషయం ఏంటంటే డిజిటిల్ ప్రొజెక్షన్.
మన రాష్ట్రంలో డిజిటిల్ ప్రొజెక్షన్ సదుపాయం కలిగిఉన్న సినిమా థియేటర్లు ఉన్నాయని తెలుసుకానీ ఆ థియేటర్లు ఎక్కడున్నాయి? అసలా థియేటర్లలో సినిమాలు ప్రదర్శించాలంటే procedure ఏంటి? అసలు డిజిటల్ [...]

రన్నింగ్ కామెంట్రీ-మార్చి 8 2010-Movie Endings

రన్నింగ్ కామెంట్రీ-మార్చి 8 2010-Movie Endings

Movie Endings
ఒక సినిమా చూసి బయటకొచ్చేటప్పుడు మనకి బాగా గుర్తుండిపోయేది ఆ సినిమా క్లైమాక్స్ సీన్. అంతకు కొద్ది సేపటిముందే చూడడం ఇందుకు ఒక కారణమైనప్పటికీ దానికంటే ముఖ్య కారణం మనం సినిమా అంతా చూసేది చివరికి ఏమవుతుందో అనే ఆసక్తితోనే కాబట్టి ఏ సినిమాకైనా క్లైమాక్స్ సీన్ అనేది కీలకం. ఆయా సినిమా ఎలా end అయిందన్న దాన్ని బట్టే ఏదైనా సినిమాను ఆదరించడం/తిరస్కరించబడడం జరుగుతుంది. ఉదాహరణకు ఎంతో పేలవంగా నడిచే ’లీడర్’ సెకండ్ [...]

రోడ్ టు సంగం

రోడ్ టు సంగం

ఈ సినిమా పేరు నేనింతకు ముందు వినలేదు. డివిడి కవర్ డిజైన్ చూడగానే అట్రాక్ట్ అయ్యాను. యాక్టర్స్ ఎవ్వరన్నది పట్టించుకోకుండానే కొనేశాను. రాత్రి వంటి గంటకు మొదలు పెట్టాను. ఇక ఆపటం నా తరం గాలేదు పూర్తయ్యేవరకు.
పరేష్ రావెల్, ఓంపురి ప్రధాన పాత్రధారులు. కొన్ని సీన్లలో గాంధీ గారి మనవడు తుషార్ గాంధీ ని చూడచ్చు. తప్ప మిగతా నటులెవ్వర్ని చూడలేదు. కాని ప్రతీ పాత్ర తీర్చి దిద్దినట్లున్నాయి ఓ ఇంగ్లీష్ సినిమా లోలాగా.
పరేష్ హష్మత్ భాయ్ [...]

82 వ ఆస్కార్ అవార్డులు

82 వ ఆస్కార్ అవార్డులు

ఇప్పుడే 82 వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ముగిసింది.  అవార్డు గ్రహీతలకు నవతరంగం అభినందనలు.

//

Best Picture

The Hurt Locker
Kathryn Bigelow, Mark Boal, Nicolas Chartier and Greg Shapiro

Actor in a Leading Role

Jeff Bridges
Crazy Heart

Actor in a Supporting Role

Christoph Waltz
Inglourious Basterds

Actress in a Leading Role

Sandra Bullock
The Blind Side

Actress in a Supporting Role

Mo’Nique
Precious: Based on the Novel ‘Push’ by [...]

నెలవంక (1983)

నెలవంక (1983)

నాకు బాగా నచ్చే సినిమాల్లో, జంధ్యాల తీసిన ’నెలవంక’ ఒకటి. ఇన్నాళ్టికి మొదటిసారి ఈసినిమాని మోసర్బేర్ పుణ్యమా అని పూర్తిగా చూడగలిగాను. ఎప్పట్లాగే – I am still in love with it.
చాలామంది జంధ్యాల సినిమాలంటే – ’ఆహ నా పెళ్లంట’, ’వివాహభోజనంబు’, ’చూపులు కలసిన శుభవేళ’ – ఇలా కామెడీలనే గుర్తుపెట్టుకుంటారు. నేను మాట్లాడిన వాళ్ళలో తొంభై శాతం మంది ’నెలవంక’ అన్న ఒక సినిమా ఉంది అంటేనే తెలీదన్నవారు! ఇది జంధ్యాలకి [...]

రన్నింగ్ కామెంట్రీ-మార్చి 7 2010-Independent Cinema

రన్నింగ్ కామెంట్రీ-మార్చి 7 2010-Independent Cinema

ఇండిపెండెంట్ సినిమా
ఇండీ ఫిల్మ్ మేకరవుదామని కలలు కంటున్న ఒక ఔత్సాహిక ఫిల్మ్ మేకర్ విషాద గీతం, “ఇండిపెండెంట్ ఇండియా లో ఇండిపెండెంట్ సినిమా కరువాయనే….”
అసలు ఇండిపెండెంట్ సినిమా గురించి మాట్లాడం మొదలుపెడతేనే మనం చలన చిత్ర చరిత్ర లోతుల్లోకి వెళ్ళాలి. అందరికంటే ముందు మనందరికీ తెలిసిన ఒకాయన గురించి మాట్లాడాలి. ఆయన పేరు థామస్ ఎడిసన్. ఔను మనందరం చిన్నప్పుడు సైన్స్ పుస్తకాల్లో ఈయన గురించి చదివి ఆయన మీద చాలా గౌరవం పెంచేసుకున్నాం కూడా. కదా? [...]

మొదటి సినిమా - కె. విశ్వనాథ్

మొదటి సినిమా – కె. విశ్వనాథ్

నవతరంగం పాఠకులకు నమస్కారం. ఈ వారం నుంచి నవతరంగంలో ’మొదటి సినిమా’ అనే మరో కొత్త శీర్షిక ప్రవేశ పెట్టబోతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రముఖ వెబ్ పత్రిక కౌముది సౌజన్యంతో నడిచే ఈ శీర్షిక మన రాష్ట్రంలోని వివిధ దర్శకులు తాము రూపొందించిన మొదటి సినిమా గురించి, అప్పటి వరకూ జరిగిన జీవనప్రయాణం గురించి తెలియచేస్తారు. ఈ వ్యాసాలు ఔత్సాహిక దర్శకులకు ఎంతో ఉపయోగకరంగానూ, సాధారణ పాఠకులకు ఆసక్తికరంగానూ ఉంటాయని ఆశిస్తున్నాము. ఈ వ్యాసాలు ఇక్కడ ప్రచురించే [...]

Page 1 of 10412345...Last »