Menu

Monthly Archive:: November 2017

అర్జున్‌రెడ్డి నాకెందుకు నచ్చిందంటే..! – 1 (తనను తాను ధ్వసం చేసుకున్న వీరుడు)

నేనెప్పుడూ మందు ముట్టుకున్నది లేదు, లిటరల్‌గా చేత్తో కూడా ముట్టుకోలేదు. పదుల మంది తాగుతున్న చోట కావచ్చు, స్నేహితులు బలవంతపెట్టిన సమయాల్లో కావచ్చు, నేనెప్పుడూ నేనుగానే ఉన్నాను. పాసివ్ స్మోకింగ్ చేయడం కూడా నాకు నచ్చదు. మా అమ్మ అమ్మాయిలతో ఎలా నడుచుకోవాలో నేర్పింది, నేర్పుతూనేవుంటుంది, స్నేహితులే కావచ్చు, పరిచయం లేనివారే కావచ్చు, నేనెప్పుడూ అమ్మాయిల్ని ఇబ్బందిపెట్టేలా ప్రవర్తించలేదు. నాకన్నా వయసు, అధికారం, హోదా ఉన్నవారితో గొడవపడింది, గొంతు పెంచి మాట్లాడింది ఉంటే ఉండొచ్చు కానీ, నాకన్నా