Menu

బొమ్మలోల్లు Trip

పొద్దున ఎనిమిదింటికి లేచి చాలా రోజులైంది.షూటింగ్ ఉంటె తప్ప ఆ టైంకి లేచి చేసే పనులేమి ఉండవు.నిన్న లేవాల్సి వచ్చింది,”బొమ్మలోల్లు” స్క్రీనింగ్ కోసం,అది కూడా RFC లో. ఆ ప్రయాణం ఊహించుకుంటేనే నిజంగానే “వెన్నులో వణుకు”…అంతులేని ప్రయాణం…మధ్య మధ్యలో మజిలీలు…అక్కడనుంచి విజయవాడ చాలా దగ్గర అనిపిస్తుంది.నిద్ర బద్దకంతో స్కిప్ కొడదాం అనిపించింది…ఆప్తుడు “అజిత్ సార్”, ఆప్త మిత్రుడు అమర్ ఈ డాక్యుమెంటరీ కోసం పడిన కష్టం చాలా దగ్గరగా చూస్తున్న.అమర్ చాలా  సార్లు చూద్దామని అడిగినా కుదరలేదు.మా రెండో సినిమా ‘బంజారా సంగం’  చేసిన బాలు,వ్యాస్ & ఇంకో కెమెరామన్ ఫ్రెండ్ శశి రచ్చ వర్క్ చేసారు.

ఇంటర్నేషనల్ ఈవెంట్లో స్క్రీన్ అవుతోంది,చూసేద్దాం అనిపించి కారెక్కేసాను. నేను,కిరణ్,బాలు,వ్యాస్,షబ్బీర్ బయలుదేరాం.నేను తప్ప మిగతా నలుగురు వాళ్ళ వాళ్ళ ‘స్థాయి’ లో కెమెరామెన్ లే.మాతో పాటు స్వాతి అనే రైటర్ కూడా రావాల్సింది,అనివార్య కారణాల వల్ల షో అయిపోయాక జాయిన్ అయింది.

రామోజీ సామ్రాజ్యం చేరేసరికి అనుకున్నట్టుగానే నా వెన్ను వణికింది…మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు…

చేరుకున్నాం…డాక్యుమెంటరీ మొదలైంది…నాకు ప్రివ్యూలు ప్రీమియర్లు అంటే భయం… ఎందుకంటే తీసినోల్లు పక్కనే ఉంటారు…అయిపోయాక నచ్చకపోతే ఏం చెప్పాలి?కానీ ఈ  సారి తెగించా ఏం అనిపిస్తే అది చెప్పేద్దాం అని fix. నేనొక్కసారి ఫిక్స్ అయితే ఫిక్సే. నా సైజ్ ప్రాబ్లెమ్ వల్ల డైరెక్టుగా వెళ్లి మొదటి వరసలో కూర్చున్నా…పొడుగోళ్ల తలలు కోసేయటానికి అదొక్కటే మార్గం…

అనుకున్నట్టుగానే డాక్యుమెంటరీ ‘మెల్లిగా’ మొదలైంది…మెల్లిగా వెళ్తోంది…75 నిమిషాలు అని తెల్సు…సిగరెట్  తాగటానికి కూడా బ్రేక్ ఉండదు…నడుస్తోంది నడుస్తోంది…నేను కూడా నడుస్తున్న బొమ్మల్లోల్లతో (బాగా డ్రామా కద…తప్పదు).అప్పటిదాకా కెమెరా వర్క్ కోసమో ఎడిటింగ్ లో దేని కోసమో వెతుకుతున్న నాకు అవన్నీ blur అయిపోయాయి…బొమ్మలోల్లు తప్ప నాకేం కనపడటం లేదు…ఎంత ఇష్టం లేకపోతే అంత కష్టం ఇష్టపడతారు?

నన్ను నేను చూసుకున్న…వీళ్ళు కూడా నాలాంటి ఇండీ గాళ్ళే…కాదు నేను కూడా వీళ్ళలాంటి ఇండీ గాన్నే…

కథలు వింటాం…కానీ కథల్ని చూపించటం…ఇది బొమ్మలోల్ల ప్రయత్నం…అసలు వీళ్ళు ఎవరు?వీళ్ళు ఎందుకు ఈ ‘పని’ చేస్తున్నారు? కాళ్ళు 50 ఏళ్లకే ‘నొప్పి పుట్టి’ నడవలేనంత స్థితిని కూడా పట్టించుకోని passion ఏంటి? వీళ్ళ కులం ఏంటి?

కులమెందుకు అని అనిపించొచ్చు…ఈ దేశం కుల మతాల ‘అనివార్యపు సంగమం’…

ఇదొక అంతరించిపోతున్న కళ…పోనీవండి…వృక్ష జంతు జాతుల్లాగే అంతరించిపోతోంది…

కానీ ‘కెమెరా’ అనేది ఈ అంతరించిపోతున్న కళ ని capture చేసింది…ఇదే నాకు ఆనందం…

‘మా ఊరు’  అంత కాకపోయినా మా ‘అజిత్ సార్’ మంచి ఫిలిం చేసిండు…

ఒక అంతరించిపోతున్న కళ అమరం అయింది…

ఇటువంటి డాక్యూమెంటరీలని డబ్బులు ఇచ్చి చూస్తే మన సొమ్మేం పోదు…

కానీ ఆ డబ్బులు ఇచ్చి చూసుకునే “సౌకర్యం” ఏది?

తెలంగాణ ప్రభుత్వం అటువంటి   “సౌకర్యం” కల్పిస్తే ఇంకా చాలా చేయటానికి మేము రెడీ…

2 Comments
  1. Jagadeeshprathap January 2, 2017 /
  2. Jagadeeshprathap January 2, 2017 /