Menu

సినిమా లాంగ్వేజు – గ్రామరు – రూల్సు – గాడిద గుడ్డు …. పార్టు వన్

హెచ్చరిక : ఫిలిం స్కూల్లో చదివిన,చదువుతున్న,చదవాలని అనుకుంటున్న వాళ్ళు ఇది చదివితే ‘హర్ట్’  అయే అవకాశం ఉంది…

లాంగ్వేజు – గ్రామరు – రూల్సు ఈ మూడు పదాలు స్కూల్, కాలేజ్ తరువాత విన్నది ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చాకే. నేను cameraman అవుదామని సినిమాల్లోకి వచ్చాను,వ్యూ ఫైండర్ బొక్కలోంచి చూసి తీసేస్తే చాలు అనుకున్న నాకు దాని వెనక ఉన్న “కెమికల్” కెమిస్ట్రీ ఫిజిక్సు మేథమెటిక్స్ చూసి భయమేసింది;మళ్ళీ ఇవన్నీ చదవాలా? అనే ఆలోచనే నన్ను వణికించింది, ఎందుకంటే అంతా “ఫిలిం” మీద కాబట్టి అంత సైన్సు…షిఫ్ట్ to direction…ఇది వీజీ…కథ చెప్పగలిగితే చాలు…మళ్ళీ ఈ గ్రామరు ఏంటి?ఇంకా అప్పటికి ఎవరి దగ్గర జాయిన్ అవలేదు… అప్పుడే ఇంటర్నెట్ విచ్చుకుంటున్న సమయం,సినిమా లాంగ్వేజు – గ్రామరు – రూల్సు-ఇవేంటో తెలుసుకుందామని సర్చ్ మొదలుపెట్టాను.అప్పుడప్పుడే VCD లు వస్తున్నాయి,నా చుట్టూ ఉన్న సినిమా ఫ్రెండ్స్ ఈ పదాలు ఎక్కువగా వాడుతున్నారు.అడిగితే లోకువ అయిపోతాం అని నా ఓన్ సర్చ్ మొదలెట్టా. చాలా చదివా…Printouts తీసుకుని మరీ చదివా…కొంచెం అర్ధం అయింది…కొంచెమంటే కొంచమే… మరి ఈ అర్ధమైన వాటిని ప్రాక్టికల్ గా ఎలా ప్రయత్నించాలి? తెలియదు…ఉన్నదొక్కటే ఆప్షన్ మేము తీసే యాడ్స్ కార్ప్ ఫిలిమ్స్ లో ప్రయత్నించాలి… అవేమో ఇంకోరకం…మరి ఎలా ? అంటే నాకు సినిమా గ్రామరు రాదా?నేను సినిమా తీయలేనా? ఇలా నాలో నేను మధన పడుతూ పంజగుట్ట రోడ్ల మీద తిరుగుతున్న టైంలో ఇంటర్నెట్ మరింత విచ్చుకుంది…amazingindians టైం అది…ఇండిపెండెంట్ దర్శకుల గురించి వాళ్ళ అప్రోచ్ గురించి ఆర్టికల్స్ దొరుకుతున్నాయి…వీళ్లేంటి ఉన్న సో కాల్డ్ రూల్సు అన్నీ బ్రేక్ చేసారంట,మంటలు పుట్టించారు అంట,కొత్త సినిమా లాంగువేజ్ మొదలైపోయింది…ఇలా ఉండేవి అవి… పర్లేదు రూల్సు ఏమి ఫాలో అవాల్సిన అవసరం లేకుండా కూడా సినిమా తీయొచ్చు అనే ధైర్యం వచ్చింది… అప్పటికే శివ క్షణ క్షణం లాంటివి చూసి “inspire” అయి ఉన్న నాకు మరింత శక్తిని ఇచ్చాయి ఆ ఆర్టికల్స్ …

180 డిగ్రీ యాక్సెస్… ఇది తెలిస్తే చాలు సినిమా తీసేయొచ్చు అని జయంత్ సి పరాన్జీ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు…అప్పటికే అసలు అదేంటో తెలుసుకునే ప్రయత్నం లో ఉన్నా…అసలు అది తెలియనోడు షాట్ పెట్టలేడు…ఇది అందరిలో గట్టి నమ్మకం..5Cs of cinematography చదివితే సినిమా తీయటం తెల్సిపోతుంది అని ఎవడో “సినీ మేధావి” చెప్పాడు అని అందరూ ఆ బుక్ తెప్పించుకుని,లేకపోతే జిరాక్స్ కాపీలు తీయించుకుని చదివేస్తున్నారు,వామ్మో….అది ఎంత పెద్ద బుక్ అంటే…చాలా పెద్దది…దిండు లా వాడుకోవచ్చు… చదవటానికి ప్రయత్నించా… కష్టం…

Objective subjective …ఈ రెండు పదాలు నన్ను ఇప్పటికి ఇబ్బంది పెడుతూనే ఉంటాయి… మళ్ళీ దీంట్లో కెమెరా Objective subjective ,డైరెక్టోరియల్ Objective subjective…ఇవి కూడా అర్ధం కాలేదు…

సినిమాని ఇంత complicate చేయడం వెనక “డబ్బున్న academicians” కుట్రలా అనిపించింది… అయుండకపోవచ్చు కూడా…ఏమి తెలియకుండా సినిమా తీయడం ఎలా ?

వీజీగా తీసేయొచ్చు అనే నమ్మకం ఎప్పటినుంచో ఉన్నా …DIGITAL వచ్చాక అది వెరీ సింపుల్ అనేంత ఫ్రీడమ్ వచ్చేసింది…

వాడేవి స్మార్ట్ ఫోన్లు తీసేవి లత్తుకోరు సినిమాలు… smartness ఏది రా తెలుగు సినిమాలోని?

ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో సినిమా తీయడం జుజుబీ…రిలీజు గురించి వర్రీలు ఆపి తీయటం మొదలెట్టండి…కక్కొచ్చినా షిట్ వచ్చినా సినిమా రిలీజుకొచ్చినా ఆగదు…

(ఇంకా చాలా షిట్ ఉంది)

 

 

 

One Response
  1. Vittal Chakravarthyr January 22, 2017 /