Menu

పదకొండు రూపాయల పాట

శీష్ మహల్లో పాటలు ఉంటాయి అని నేను ఎపుడు అనుకోలేదు, ఉంటె ఒక థీమ్ సాంగ్ లాంటిది ఏమైనా ఉంటుందేమో అనుకున్న. కానీ ఇప్పుడు ఆరు పాటలు, మూడు హిందీ,ఒక తెలుగు,ఒక తమిళ్,ఒక ఇంగ్లీష్ పాట ఉన్నాయి.ఇవి కాక background లో ఒక బెంగాలీ పాట, ఒక సిట్యుయేషన్ లో ఇళయరాజా తమిళ్ పాట బిట్ ఉన్నాయి.

ఫస్ట్ అనుకున్న హిందీ పాట అంతరించిపోతున్న  “సింగిల్ స్క్రీన్స్” మీద. ఈ పాట “single screens “ గురించి అని మేము చెప్తే తప్ప ఎవరికీ అర్ధం కాదు. Scratch రికార్డింగ్ విన్నపుడు అది ఎలా ఉందొ  అర్ధం కాలేదు, బొత్తిగా మ్యూజిక్ సెన్స్ లేదు నాకు. పూర్తి ఐన పాట విని బాగుందో లేదో చెప్పగలను కానీ ట్యూన్ లెవెల్ లో ఏమి చెప్పలేను.

నాకు వివేక్ కి డిస్కషన్

వివేక్

“ ఈ పాట పీయూష్ మిశ్రా లాంటి లిరిసిస్ట్ రాయాలి”

నేను

“పీయూష్ మిశ్రా లాంటోడు ఎందుకు పీయూష్ నే అడుగుదాం”

అనురాగ్ కశ్యప్ సినిమాల్లో పీయూష్ పాటలు,సంగీతం,acting లాంటివి చూస్తూ అసలు ఎప్పటికైనా ఆయనతో పని చేస్తానా అని కలలు కంటూ బతికేస్తున్న నాకు, శీష్ మహల్ కి పాట రాయించేసుకుందాం అనేంత  నమ్మకం ఏంటి? ఆ నమ్మకం వెనక ఒక INDIE ఉన్నాడు, మామూలు ఇండీ కాదు, hardcore indie….రాజీవ్ రవి. మళ్ళీ same డైలాగ్  “అనురాగ్ కశ్యప్ సినిమాల్లో రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ చూసి భరించలేనంత కుళ్ళుగా ఉండేది”, ఇది ఇంకో కల, తీరదు లే అనుకున్నా ఏమో చెప్పలేం ఎప్పటికైనా రాజీవ్ తో ఒకసారైనా పని చేయాలి. అటువంటి రాజీవ్ రవి ని హైద్రాబాద్లో శ్రీనగర్ కాలనీలో కలిసే ఛాన్స్ వచ్చింది. ఇది ఎలా?

మళ్ళీ ఇంకో Indie , బాలు,పక్కా హైద్రాబాది. మా రెండో సినిమా “బంజారా సంగం” కెమరామెన్,Pune FTII లో సినిమాటోగ్రఫీ కోర్స్ ఫినిష్ చేసి హైదరాబాద్ వచ్చి మాతో పాటు ఉండేవాడు.ఓ వర్షం కురుస్తున్న సాయంత్రం  నేను టీ తాగి రూమ్ కి వచ్చాను, బాలు ఎక్కడికో బయలుదేరుతూ “రాజీవ్ ని కలవటానికి వెళ్తున్నా వస్తారా” అని అడిగాడు “ ఏ రాజీవ్ “ అన్నాను , “రాజీవ్ రవి” అన్నాడు బాలు, WTF… అంతకన్నా ఏం కావాలి, ఇద్దరం రాజీవ్ ఉంటున్న హోటల్ కి వెళ్ళాం, ఆల్రెడీ జయకృష్ణ గుమ్మడి(jk) ఉన్నాడు అక్కడ. మేము వెళ్లిన ఐదు నిమిషాలకి వాళ్లిద్దరూ weather బాగుందని రైడ్ కి వెళ్లారు. నేను బాలు రాజీవ్ అసిస్టెంట్ అన్సర్ తో మాట్లాడుతూ కూర్చున్నాం, అన్సర్ బాలు classmate. ఈ ftii వాళ్ళ friendship చాలా ఇంటరెస్టింగ్ గా ఉంటుంది, దాని గురించి మళ్ళీ రాస్తాను.

హెవీగా వర్షం మొదలైంది. రాజీవ్,jk వచ్చేసారు. అందరం రాజీవ్ రూంలోకి షిఫ్ట్ అయి మందు మొదలుపెట్టాము. నేనేం మాట్లాడటం లేదు, వాళ్ళందరూ institute కబుర్లు చెప్పుకుంటున్నారు. కాసేపటికి రాజీవ్ నాతో మాటలు మొదలుపెట్టాడు. అక్కడనుంచి మేమిద్దరమే ఎక్కువ గా మాట్లాడుకున్నాం, నా కక్కుర్తి నాది మళ్ళీ  రాజీవ్ ని కలిసే ఛాన్స్ ఎప్పుడు వస్తుందో. తెలుగు సినిమా గురించి,ఇక్కడ ఇండిపెండెంట్ సినిమా గురించి అడుగుతున్నాడు, నేను నా ఫ్రస్ట్రేషన్ మొత్తం బయటపెడుతున్నాను. మేమెళ్లిన రోజు saturday,ఏదో తెలుగు ఫిలిం కి ఆబ్లిగేషన్ మీద పనిచేయటానికి వచ్చాడు రాజీవ్,పొద్దునే ఓపెనింగ్ అయింది.సండే రోజు వర్క్ ఏమి లేదు ఏం చేద్దాం అని ప్లాన్ చేస్తుంటే,నేను బాలు దగ్గరకి వెళ్లి మన రూమ్ కి పార్టీ కి invite  చేయమని చెప్పాను. పార్టీ తో పాటు రోహిత్ తీసిన mockumentary కూడా స్క్రీనింగ్ చేస్తాము అని బాలు అడగగానే రాజీవ్ ఓకే అన్నాడు,నా ఆనందం పీక్  లెవెల్ కి వెళ్ళింది.

ఆ రోజు పొద్దున్న నిద్ర లేచిన దగ్గరనుంచి సాయంత్రం ప్లానింగ్ గురించి మా టెన్షన్, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు లేవు,రాజీవ్ కి ఎమన్నా costly  డ్రింక్ కొనాలా , ఫుడ్ ఏమి వండాలి?  దగ్గరున్న డబ్బులు సరిపోవు అనిపించింది, నేను ఒకటే చెప్పా అందరికి అవసరం అయితే రాజీవ్ నే అడుగుదాం అని. అలా ఫిక్స్ అయిపోయి వెయిటింగ్. బాలు పార్టీ సెటప్ కోసం చాలా కష్టపడుతున్నాడు. కాసేపటికి రాజీవ్ అన్సర్ వచ్చి కాల్ చేస్తే నేను వెళ్లి రూమ్ కి తీసుకొచ్చాను. వర్షం పడుతోంది. రాజీవ్ రాగానే ఫస్ట్ మాక్యుమెంటరీ చూద్దామా మందు మొదలుపెడదామా అని అడిగే లోపు కరెంటు పోయింది. హాల్లో  ప్రొజెక్టర్ పెట్టి గోడ మీద స్క్రీనింగ్.అందరం బాల్కనీ లోకి షిఫ్ట్ అయి పార్టీ మొదలుపెట్టాము, రాజీవ్ చాలా విషయాలు చెపుతున్నాడు, ఎవరి excitement లో వాళ్ళు ఏదేదో అడుగుతున్నారు. ఎవరిని particular గా పిలవలేదు, పిలిస్తే  రాజీవ్ తో పార్టీ అంటే మా double  bedroom ఫ్లాట్ కూడా సరిపోదు.

పార్టీ జరుగుతున్నపుడు రాజీవ్ ఒక ఇంటరెస్టింగ్ విషయం చెప్పాడు, కొంతమంది ఇండీ filmmakers కలిసి ఒక గ్రూప్ గా ఫామ్  అయి దేశం లో మిగతా ఇండీస్ తో కనెక్ట్ అయి ఏదోఒక రకంగా సహాయ సహకారాలు అందించుకోవటం.అద్భుతంగా అనిపించింది idea.

కరెంటు వచ్చాక మాక్యుమెంటరీ స్క్రీన్ చేసాం, చాలా నచ్చింది. శీష్ మహల్ లో సీన్స్ చూపిస్తే ఎంత ఎక్సైట్ అయ్యాడు అంటే రేపటికల్లా ఒక డీవీడీ చేసి తనకి ఇమ్మన్నాడు, ఎలాంటి స్టేజి లో ఉన్నా పర్లేదు అని. మేము ఫినిష్ ఫిలిం చూపించడానికి ఫిక్స్ అయి ఇవ్వలేదు.

పీయూష్ మిశ్రా తో పాట రాయించుకుందాం అనే నమ్మకం రాజీవ్ వాళ్ళ వచ్చింది. కాల్ చేసి విషయం చెప్పను, ఐదు నిమిషాల్లో నెంబర్ వచ్చింది. పీయూష్ దొరకటం ఇంత ఈజీ నా? అది రాజీవ్ గొప్పదనం.wonderful person.

పీయూష్ కి మెసేజ్ పెట్టాను,రెండు రోజుల తర్వాత రిప్లై వచ్చింది, షూటింగ్లో బిజీ గా ఉన్నాను రాత్రికి కాల్ చేస్తాను అని. రాత్రికి కాల్ వచ్చింది మంచి ఫ్రెండ్ లా మాట్లాడుతున్నాడు పీయూష్,నాకు ఇంకా నమ్మబుద్ధి కావటం లేదు. ఎలాగూ పీయూష్ దొరికాడు కదా రెండో పాట కూడా అడిగేద్దాం అని డిసైడ్ అయి ఉన్నాం మేము. రెండు సిట్యుయేషన్స్ చెప్పాను ,అప్పటికే వివేక్ ఒక రఫ్ ట్రాక్ చేసాడు. అంతా మాట్లాడక డబ్బులు ఎక్కువ ఇవ్వలేం అని చెప్తే, మా సినిమా బడ్జెట్ అడిగి మీరేం ఇస్తారు లే నాకు అని ఒక ఫిగర్ చెప్పాడు,నాకు ఫస్ట్ అర్ధం కాలేదు మళ్ళీ అడిగితే 11/- అన్నాడు,నేను కొంచెం ఎమోషనల్ అయి ఆయనకీ థాంక్స్ చెప్పాను.

పీయూష్ రోజూ ఎదో ఒకటి అడిగేవాడు పాట గురించి, అంటే నా నుంచి ఎదో ఒక ఇన్పుట్ కావాల్సిందే.నా దగ్గర చెప్పటానికి ఏమి లేక హైదరాబాద్ సిటీ లో కూల్చేసిన కూలుస్తున్న థియేటర్స్ పేర్లు పంపించాను,అవేమన్నా లిరిక్స్ లో వాడుతాడేమో అని.

“నేను అలా పేర్లు వాడి రాయను వేరే గా రాస్తాను” అని చెప్పి రాసిందే “భోలా సా మన్ తా”

11312962_1690991531170902_3487602656663203844_o