Menu

సంగం సిరీస్ – పార్ట్ -1

ఎవడి సినిమా వాడికి ultimate లాగే మాక్కూడా.2014 లో మా gang మొత్తం బంజారా హిల్స్ అమృత valley లో ఉండేవాళ్ళం. అప్పటికి శీష్ మహల్ మెల్లి మెల్లిగా జరుగుతోంది.నేను అపుడపుడు నిజాంపేట్ లో ఉన్న మా ఇంటికి వెళ్లి వచ్చేవాణ్ణి.అలా ఒక రోజు వెళ్ళినపుడు టీవీ లో న్యూస్ వస్తోంది,తెలంగాణా రాష్ట్రాన్ని సాధించి కేసీర్ హైద్రాబాద్ లో అడుగుపెడుతున్న రోజు. బేగంపేట్ airport నుంచి పెద్ద ఊరేగింపు ఉంది.రూం లో కెమెరా కెమెరామెన్లు పడున్నారు.ఏదో ఒకటి చేయాలి మళ్ళీ ఇలాంటి ఈవెంట్ దొరకదు,కానీ డాక్యూమెంటరీ చేయకూడదు, ఫిక్షన్ చేయాలి.ఇంకో నాలుగు గంటల్లో కేసీర్ flight land  అవుతుంది,fastగా రెడీ  అయిపోయి సిటీ బస్ లో బంజారా హిల్స్ బయలుదేరాను. ఏం చేయాలో idea రావటం లేదు.టీనేజ్ అమ్మాయి అబ్బాయి తో ఏమైనా చేస్తే? కష్టం…ఇప్పటికిపుడు అమ్మాయి దొరకదు,దొరికినా ఎలాంటి అమ్మాయి దొరుకుతుందో అని భయం,acting రాదేమో అని భయం.తెలుగు లో ఏమన్నా చేద్దాం అంటే అమ్మాయిలు దొరకటం ఎంత కష్టం అంటే ఆ కష్టాలు వర్ణనాతీతం.ఆల్రెడీ శీష్ మహల్ లో ఇద్దరు ముగ్గురు తప్ప అందరూ కొత్తవాళ్లే.మా అదృష్టం కొద్దీ దొరికినా దురదృష్టం కొద్దీ మా దగ్గర డబ్బులు ఉండవు. సో అమ్మాయి అబ్బాయి idea drop.నాతో పాటు ఈ సినిమా డైరెక్ట్ చేస్తున్న రోహిత్ ని bike మీద తిప్పుతూ ఏదో ఒకటి చేద్దాం fix అయిపోయా.వెళ్లి చెప్పగానే రోహిత్ & వ్యాస్ రెడీ కానీ చిన్న change నేను bike మీద ఊరేగింపు లో తిరగాలి.Done అనుకుని acting కి రెడీ అయిపోయా, at least నా మేనకోడలు నన్ను future లో సినిమాల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపించుకుంటుందిలే అనే ఒక reason excitingగా అనిపించింది.

                                                                                           బంజారా సంగం

                                                                 The Ultimate Road Movie from Telangana

https://www.youtube.com/watch?v=VwaS5gj5oD8

‘అల్ప జీవి’అని title fix, 40 ఏళ్ళు వస్తున్నా ‘సక్సెస్’ అవని ఒక దర్శకుడి కథ. Batteries ఛార్జ్ పెట్టి గంట తరువాత షూట్ కి బయలుదేరాం. బంజారా హిల్స్ నుంచి బేగంపేట్ కి రోడ్ ట్రిప్ started. Bike ride షాట్స్ తీసుకుంటూ బేగంపేట్ రీచ్ అయ్యాము.Shopper’s stop పక్కన బండి పెట్టి ఊరేగింపు లో షూటింగ్ మొదలుపెట్టాము.ఎటు చూసినా గులాబీ రంగే,ఎవర్ని చూసినా తెలంగాణా వచ్చిన ఆనందమే కనిపిస్తోంది. ఆపకుండా షూట్ చేస్తున్నాం,మధ్య లో ముగ్గురం తప్పి పోయాం. కేసీర్ ఊరేగింపు మొదలైంది, ఆ ఊరేగింపు ని follow  అవుతూ లైఫ్ style దాకా వెళ్లిపోయాం.అప్పటికే రాత్రి అయింది, అప్పటిదాకా మెల్లిగా కదిలిన ఊరేగింపు fast అయింది.అక్కడి తో వదిలేసి వెనక్కి నడిచి వచ్చి బైక్స్ తీసుకుని రూం కి వెళ్లిపోయాం.వెళ్లి footage చూసుకుని మహదానంద పడిపోయి, మమ్మల్ని మేము విపరీతం గా పొగిడేసుకుని,మందు కొట్టి పడుకున్నాం.అంతే ఆ footage అలా చాలా రోజులు హార్డ్ డిస్క్ లో పది ఉంది.కనీసం ఎడిట్ మొదలుపెట్టాలి అనే ఆలోచన కూడా చేయలేదు.

easy rider లో parade scene అంటే చాలా ఇష్టం నాకు, ఆ rangeలో కాకపోయినా ఏదో ఒకటి చేసాము లే అని రషెస్ చూసుకుని మురిసిపోవడం మాత్రం regular పని అయిపోయింది.

ఈజీ రైడర్( 1969)

https://www.youtube.com/watch?v=0YptNR7uq7s    

( ఇంకా ఉంది )