Menu

సంగం సిరీస్ – పార్ట్ -2

 

తెలంగాణ రాష్ట్ర తొలి పంద్రాగస్టు వేడుకలు గోల్కొండలో చేయాలన్న కేసీర్ నిర్ణయం మీద చాలా చర్చ జరిగింది.ఆ టైంలో నేను రోహిత్ ఒక idea డిస్కస్ చేస్తున్నాము,నలుగురు కుర్రాళ్ళు సిటీ ట్రిప్ వేయటం, ఇదే idea. తరువాత సిటీ కుర్రాళ్ళు కాకుండా OUTSIDERS అయితే ఇంకా interesting గా చేయొచ్చు అనిపించింది.ఆగస్ట్ 10th రాత్రి రోహిత్ కి కథ చెప్పాను.

నలుగురు లంబాడి boys గోల్కొండలో జరుగుతున్న Independence day eventని చూడటానికి సిటీకి వస్తారు,వాళ్ళ ఫ్రెండ్ ఒకడు తెలంగాణ కోసం suicide చేసుకుని ఉంటాడు,వాడు ఎలాగు చూడలేకపోయాడు వాడి ఆత్మ  శాంతి కోసం అనేది కూడా ఒక కారణం.సిటీ లో వాళ్ళకి హెల్ప్ చేసి ఈవెంట్ కి తీసుకెళ్లాల్సిన వ్యక్తి ఫోన్ ఆఫ్ వస్తుంది.ఇమ్లిబన్ bus stand నుంచి గోల్కొండకి ఎలా చేరుకుంటారు? Event తరువాత “city tour”.  

ఇంతే కథ. మా నమ్మకం ఏంటంటే నలుగురు outsiders సిటీని explore చేయడం ఒక interesting ఫిల్మ్ ఎందుకు అవదు అని. లంబాడీ భాషలోనే చేయాలి అంటే వాళ్లనే actors గా తీసుకోవాలి.నాకు మురళి అని ఒక లంబాడి ఫ్రెండ్ ఉన్నాడు,వైరా దగ్గర వాత్స్యా నాయక్ తండా వాళ్ళ ఊరు.మురళి కి ఫోన్ చేసి idea చెప్పి రోహిత్ ని పంపించాను కాస్టింగ్ కి.రోహిత్ వెళ్లి ఆడిషన్స్ చేసి ఇమేజెస్ వాట్సాప్ చేసాడు,నలుగురు confirmed.14 రాత్రి బయలుదేరి రావాలి వాళ్ళు,మేము డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి.

Banjara Boys

10612798_1467475366845049_4209718396678752401_n

రోహిత్ వచ్చేసాడు,చాలా excited గా ఉన్నాం.ఇంకో excitement లంబాడి భాష లో సినిమా చేస్తున్నాం,తీసేటప్పుడు మాక్కూడా ఏం అర్ధం కాదు.వాళ్ళకి situation చెప్పి ఏం అనిపిస్తే అది మాట్లాడమని చెప్పటం మా ప్లాన్.మా యాక్టర్స్ ప్రొఫెషనల్స్ కాదు, డబ్బింగ్ impossible.Sync సౌండ్ చేయాలి, రోజుకి 30,000/-.డబ్బులు తరువాత ఇవొచ్చు అనే ధైర్యంతో బుక్ చేసేసాము.

మేము తీసిన తీస్తున్న సినిమాల్లో కథ-స్క్రీన్ ప్లే -మాటలు కన్నా cameraman చాలా important.రోహిత్ FTII కి వెళ్ళినపుడు బాలు ఫ్రెండ్ అయ్యాడు,బాలు is from Hyderabad & FTII లో సినిమాటోగ్రఫీ కోర్సు ఫినిష్ చేసాడు.తను,వ్యాస్ ఇద్దరు కెమెరామెన్లు అనుకున్నాం.

బంజారా సంగం అనే title పెట్టడానికి reason RGV.ఆయనకేం సంబంధం లేదు ఈ సినిమాతో.అప్పట్లో తెలుగు సినిమాని విప్లవీకరించే పనిలో ఆయన ఒక announcement చేసాడు, సంఘాలు గా ఫార్మ్ అయి  సినిమాలు చేయొచ్చు అని. సినిమాలు తీస్తామో లేదో తెలియదు కానీ “బంజారా సంగం” అని మా అపార్ట్మెంట్ కి నామకరణం చేసాం.నేనొక పిచ్చి పోస్టర్ కూడా డిజైన్ చేసాను.

10460740_1462284417364144_2307885442032803950_n

చాలా కష్టపడి మురళి వాళ్ళకి డబ్బులు పంపించాం, 15th పొద్దున్నే వచ్చేసారు వాళ్ళు.Sync Sound వాళ్ళు లాస్ట్ మినిట్ లో ఏదో problem వచ్చి రాలేదు,ఫస్ట్ షూట్ రోజు పొద్దున్నే అది పెద్ద disappointment. అప్పటికే శీష్ మహల్ చేస్తుండటంతో ఇలాంటి షాకులు సర్ప్రైజులు అలవాటు అయిపోయాయి. బాలు దగ్గర జూమ్ రికార్డర్ ఉంది దానితో కానిచ్చేద్దాం ఈ రోజుకి అని decide అయిపోయాం.  

జస్ట్ మా టీం మాత్రమే కాకుండా ఇంకో ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా మాకు హెల్ప్ చేయడానికి షూట్ కి వచ్చారు.స్వతంత్ర సినిమా బలం డబ్బులు కాదు మనుషులు.  

నలుగురు actors,రోహిత్ & టీం గోల్కొండకి వెళ్లిపోయారు.రోహిత్ అప్పట్లో దేనికైనా రెడీ అన్నట్టు చాకులా ఉండేవాడు,ఇప్పుడు కాస్త మొద్దుబారిపోయాడు,maturity అంటే ఇదేనేమో.నేను lateగా జాయిన్ అయ్యాను.ఈ సినిమాని రెండు రోజుల్లో ఫినిష్ చేయాలనేది నా ప్లాన్.ఇలాంటి పిచ్చి ప్లాన్లు రోజుకి ఒకటి వేస్తుంట నేను.నా దెబ్బకి మా టీంకి నేనంటే ఒక రకమైన విరక్తి భయం వచ్చేసాయి ఇపుడు.

నేను వెళ్లేసరికి ఈవెంట్ మొదలైపోయింది,రోహిత్ వాళ్ళు బయట ఉన్నారు.షూట్ చేస్తున్నారా లేదా?అనుకున్నట్టు షాట్స్ వస్తాయో రావో అని doubt.Cameraman బాలు&actors లోపలికి వెళ్లిపోయారు,వీళ్ళు బయట ఉండిపోయారు.లోపల ఏం ఘాట్ చేస్తున్నారో తెలియదు.

10300303_1467481313511121_5202991135917021020_n