Menu

రాంగ్ రూట్లో విశ్వనగరం

ఏదో ఘోరం జరిగేదాకా మనం నిద్రపోతాం, ఆ జరిగింది కూడా చిన్నపిల్లలకో ఆడవాళ్లకో  అయితేనే సోషల్ మీడియా లో చెలరేగిపోయి పోస్ట్లు పెట్టడం రొటీన్ అయిపోయింది.ప్రతిదానికి “నిషేధం” ఒకటే మన దగ్గర ఉన్న పరిష్కారం.ఇపుడు “మందు ban” కావాలంట, దీనివల్ల అన్ని ప్రమాదాలు ఆగిపోయి ప్రజలు ఆనందం గా ఉంటారు  అనే వెర్రి నమ్మకం  ఏంటో ? నిషేధిస్తే ఏం జరుగుతుంది? దొంగ దారి లో మందు అందించే యువ స్మగ్లర్స్ పుట్టుకొస్తారు,కల్తీ మందు తయారు చేసే ముఠాలు పెరుగుతాయి, ఆ అక్రమ సంపాదనతో మరింత క్రైమ్ పెరుగుతుంది.

జరిగింది ఒక accident, చేసిన వాళ్ళు కూడా పిల్లలే, మరి ఆ పిల్లలకి తాగి car నడపకండి అనే ఇంగిత జ్ఞానం నేర్పలేని పేరెంట్స్,టీచర్స్ ని చెట్టుకి కట్టేసి కొట్టాలి. పిల్లలతో వెర్రి సినిమా పాటలకి డాన్సులు వేయించి , పిచ్చి పగ  ప్రతీకారం డైలాగులు చెప్పించుకుని ఆనందపడే ఎడ్డి మనుషులు మూల్యం చెల్లించాల్సిందే.

నేను ఉండేది నిజాంపేట్ లో,పొద్దునే అందరూ ఆఫీసులకి పిల్లల్ని స్కూల్స్ కి తీసుకెళ్లే టైం లో నేను టీ తాగటానికి రోడ్డు మీదకి వస్తాను. మా కాలనీ నుంచి మెయిన్ రోడ్ కి వెళ్లాలంటే లెఫ్ట్ తీసుకుని 100-150 మీటర్ల దూరం లో U turn తీసుకోవాలి,కానీ 90% జనాలు అలా చేయరు. రాంగ్ రూట్లో కొంచెం దూరం వెళ్లి మెయిన్ రోడ్ కి వెళ్ళిపోతారు. ఈ మాత్రం చిన్న ట్రాఫిక్ సెన్స్ లేని ఇడియట్స్ ని ఏం చేయాలి? వీళ్ళలో అన్ని రకాల మనుషులు ఉంటారు, సిస్టమాటిక్ గా పని చేసి మన నగరం సంపాదన పెంచే software ఇంజినీర్స్ నుంచి సైకిల్ మీద పాత పేపర్లు కొనే వాళ్ళ వరకు. ఎంత సిగ్గులేకుండా రాంగ్ రూట్లో వెళ్తారంటే అసలు అది తప్పు కాదు, ట్రాఫిక్ పోలీసులే ఆ వెసులుబాటు కల్పించారేమో  అనిపిస్తుంది.

ఇంకా దారుణం ఏంటంటే పిల్లల్ని స్కూల్లో దింపే అమ్మా నాన్నలు, వీళ్ళు కూడా రాంగ్ రూటే. ఆ పిల్లల కి ఏం నేర్పిస్తున్నాం మనం? ట్రాఫిక్ రూల్స్ follow చేయకపోయినా పర్లేదు అని గట్టిగా వాళ్ళ లేత బ్రెయిన్స్ ని influence చేస్తున్నాం . ఇలా పెరిగిన పిల్లలు ఏం చేస్తారు? మందు తాగి accidents చేస్తారు, ఇక్కడ తప్పు మందుదా?మనుషులదా?

జస్ట్ రాంగ్ రూట్ మాత్రమే కాదు మనం గర్వంగా చెప్పుకునే “విశ్వ నగరం” ప్రజలు చాలా మంది ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోరు. ఇంకో అతి పెద్ద రోగం ఫోన్ మాట్లాడుతూ బండి తోలటం. మొన్న నిజాంపేట్ నుంచి ఆటోలో మెయిన్  రోడ్ కి వస్తున్నా,  ఒక బండ లేడీ ఇద్దరు పిల్లల్ని ఎక్కించుకుని activa మీద స్కూల్ నుంచి ఇంటికి తీసుకెళ్తోంది, తలకాయ మెడకాయ మధ్యలో ఫోన్, ముందు నిలబడిన పిల్లాడేమో continuous గా హార్న్ కొడుతున్నాడు,మెంటల్ ఎక్కుతోంది నాకు, మా ఆటో పక్కనే activa,ఆమెకి ఇదేమి పట్టడం లేదు. చాలా serious గా ఫోన్  మాట్లాడుతోంది. పొరపాటున ఆ ఫోన్ జారితే ఏమైనా జరగొచ్చు. మరి ఫోన్ ban చేద్దామా?

నేను ఖచ్చితంగా హైద్రాబాద్ రోడ్ accident లోనే పోతాను అని గట్టి నమ్మకం వచ్చేసింది నాకు. నిజాంపేట్ మెయిన్ రోడ్ నుంచి ameerpet కి almost ప్రతి రోజు తిరుగుతుంటా . డబ్బులున్నపుడు డైరెక్ట్ ఆటో ఎక్కితే అది గమ్యం చేరుకునే దాక టెన్షనే. Thanks to Metro. జనాల ట్రాఫిక్ సెన్స్ ని మరింత దిగజార్చింది మెట్రో నే నా దృష్టి లో. U టుర్న్ లు ఎక్కువైపోయి అంత ట్రాఫిక్ ఉండే హై వే లో చాలా మంది రాంగ్ రూట్ దారి పట్టారు. L & T లాంటి సంస్థ ఇంత బాధ్యతారాహిత్యం గా ఎలా ఉంటుంది? అన్నీ పోలీసులే చూసుకోవాలంటే కుదరదు. అంత పెద్ద ప్రాజెక్టు కడుతున్నపుడు వాలంటీర్స్ ని పెట్టి జనాలు రాంగ్ రూట్లో రాకుండా చేయలేరా? ఇలా రాంగ్ రూట్ కి అలవాటు అయిన మనుషులు మారటం కష్టం.

రోడ్ దాటే వాళ్ళ కోసం బండి ఆపడం సంగతి తరవాత slow అవటానికి కూడా ఎవరికీ ఓపిక లేదు. మనం ఎలాగూ సంకనాకిపోయాం పిల్లల్ని అయినా ఎడ్యుకేట్ చేయండి.ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే భవిష్యత్తు లో మరింత మంది పిల్లలు విశ్వనగరం రోడ్లకి బలి అవుతారు,లేదా అవిటివాళ్ళు గా జీవితాంతం బతుకుతారు.ఇలా ఒక accident కి స్పందించి గుండెలు బాదుకుని మందు ban చేస్తే ఏం జరగదు.