Menu

నేను – RGV-2

continued…

ఆమె నన్ను ఆపి ఆయన పేరు ఏదో శర్మ కదా అంది, కాదమ్మా ఆయన పేరు రామ్ గోపాల్ వర్మ, డైరెక్టర్ అని చెప్పాను,నాకు తెల్సు ఆయన డైరెక్టర్ అని, టీవీ లో చూసిన, మంచిగా మాట్లాడుతాడు అని పేరు చెప్పి తను కర్నూల్లో constableగా పని చేస్తున్నా అని పరిచయం చేసుకుంది.

Cut to

ఆర్జీవీ పార్క్ లో చెప్పిన షాట్ తీసిన తీయకపోయిన నేను మాత్రం తీయాలని డిసైడ్ అయిపోయా…నేను జాయిన్ అయిన టైంలో మమ్మీ US లో ఉంది చెల్లి దగ్గర,ప్రతి రోజు వచ్చే ఈవెనింగ్ రొటీన్ కాల్ లో చెప్పాను ఆర్జీవీ దగ్గర జాయిన్ అయ్యాను అని…ఆస్కార్ అంత కాకపోయినా నాకేదో పెద్ద అవార్డు వచ్చినంత ఆనందపడింది.ఈయనంటే జనాలకి అంత ఇష్టం ఎందుకో?ఆర్జీవీ వాళ్ళ అమ్మ interview చూసి నాకు దాని గురించి చెప్పటం, “నా ఇష్టం” బుక్ కొని తీసుకొచ్చేవరకు మమ్మీ గుర్తు చేయటం…అమ్మని ఎందుకు ప్రేమించాలో గౌరవించాలో మన సినిమాల్లో చాలా దిక్కుమాలిన పాటలు ఉంటాయి…మా మమ్మీ ని గౌరవించటానికి ఉన్న చాలా రీసన్స్ లో ఈ reason నచ్చింది నాకు… మాతృప్రేమ లో రీసన్స్ ఏంటి అని దిక్కుమాలిన ప్రశ్న వేయకండి ప్లీజ్….

Cut to

లంచ్ అయిపోయింది…JD కూడా వచ్చాడు…ఆఫీస్ హాల్లో అందరం నిలబడి ఉన్నాం ఆయనతో సహా…క్లైమాక్స్ ఏం చేస్తే బాగుంటుంది అని డిస్కషన్ పెట్టాడు దేవుడు.ఏదేదో మాట్లాడుతున్నారు,మధ్యలో sudden గా సత్య కబుర్లు మొదలు పెట్టాడాయన.ఎంత బాగా మాట్లాడతాడో?(మూఢ ఆరాధన అనుకోండి), వింటూనే ఉండొచ్చు,ఆ కళ్ళు…వామ్మో…చూస్తే ఫోన్ చూస్తాడు లేకపోతే నీ కళ్ళలోకి చూస్తాడు…చాలా ‘పొగరున్న’మనిషి…ఇదేదో అమ్మాయి రాస్తున్నట్టు ఉంది…పర్లేదు…ఆర్జీవీ  తీస్తున్న సినిమాల్ని తిట్టి అదేదో గొప్ప అన్నట్టు ఫీల్ అయ్యే ఎడ్డోళ్లందరికి ఆ పొగరు నచ్చదు…బానిస బతుకులు…తిరుగుబాటు నచ్చదు… ( తెలుసులే మీరందరు నన్ను ఎక్కడానికి రెడీ అవుతున్నారు)

మళ్ళీ క్లైమాక్స్ దగ్గరకి వచ్చింది టాపిక్…నాకేదో చెప్పాలని అనిపిస్తోంది కానీ ధైర్యం చాలటం లేదు…కానీ చెప్పేయాలి…నాకు నేను చాలా స్పెషల్…ఈయనేంటి ఉదయం నుంచి నన్ను పెద్దగా పట్టించుకోవటం లేదు… పట్టించుకునేంత నేనేం చేయలేదు కూడా…ఇదే opportunity అనిపించింది…నాకు అనిపించిన క్లైమాక్స్ చెప్పడం మొదలుపెట్టా…అందరూ నా వైపే చూస్తున్నారు…ఆ కళ్ళు కూడా…బానే చెప్పేసాను…ఆయనకి కూడా నచ్చింది…కానీ చిన్న చేంజ్…నేను పిచ్చ హ్యాప్పీస్…

Cut To

ఆర్జీవీ ముంబై వెళ్ళిపోయాడు,నా ఫోన్లో ఆర్జీవీ నెంబర్…ఈ ఫీలింగ్ చాలా గొప్పగా ఉంది(మళ్ళీ మూఢత్వం).ఆయన చీఫ్ అసోసియేట్ తో కమ్యూనికేషన్ నడుస్తోంది…నన్ను కూడా ఏదో ఒకటి రాసి పంపించమని చెప్పి వెళ్ళిపోయాడు…ఏం రాసిన ఆయనకి బాగా నచ్చేట్టు రాయాలి అని ఫిక్స్ అయి, ఫైనల్ గా ఒకటి రాసి పంపించాను.Terrence Mallick “BadLands” నుంచి కాపీ కొట్టి ఒక వెర్షన్ పంపించా…ఆయన రాసిన దానికి చిన్న ఫ్లాష్ back add చేసా అంతే…

BADLANDS trailer – https://www.youtube.com/watch?v=lcFx06cBmbk

Cut To

Flashback ఎందుకు వద్దో ఒక మెసేజ్…ok done…ఇలా కూల్గా నడిచిపోతోంది…నాది మోస్ట్ బేసిక్ ఫోన్ అపుడు…నేను తెలుగు one లైన్ ఆర్డర్ చేసి తెలుగులో ఆయనకి షేర్ చేసాను…అది ఓపెన్ అవలేదు…ఆయన దగ్గర పని చేయాలని ఉబలాట పడుతున్న వాళ్లందరికి ఒకటి చెప్తున్న “చాలా disciplined గా ఉంటాను” అనే నమ్మకం ఉంటేనే ఆర్జీవీ ని అప్రోచ్ అవండి…

పని ఈ టైంకి అవుతుంది అని ఒక టైం commit అయితే కరెక్ట్గా ఆ టైంకి ఒక మెసేజ్ వస్తుంది దేవుడి నుంచి…

download 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *