Menu

మా ఊరు

నేను చూసిన అతి తక్కువ తెలుగు documentaries లో “మా ఊరు” the best .బి.నర్సింగరావు గారు తీసిన ఈ documentary అప్పట్లో నన్ను చాలా inspire చేసింది, మా ఊరి మీద కూడా ఏదో ఒకటి తీద్దామని ఉండేది , కానీ కుదరలేదు. కనీసం ఏదో ఒకటి రాద్దామని కూర్చున్నపుడు ఏం రాయాలో అర్ధం కాదు… ఒక article కాదు పెద్ద పుస్తకమే రాయచ్ఛు . ఎవరు చదువుతారు అనేది తరువాత విషయం.

నౌరోజీ క్యాంప్ ఇదే మా ఊరు , మహబూబ్ నగర్ జిల్లా లో ఒక చిన్న ఊరు. నాయనమ్మ , అమ్మమ్మ & తాతలు మా చిన్నపుడు అదే ఊర్లో ఉండేవారు, నాయనమ్మ వాళ్ళు కొన్ని రోజుల తరువాత శాంతినగర్ కి షిఫ్ట్ అయిపోయారు. 50ఏళ్ల క్రితం నౌరోజీ అనే ఆయన ఆంధ్రా నుంచి వఛ్చి ఈ ఊర్లో పొలాలు కొన్నారు, ఆయనతో పాటు ఇంకొంత మంది కూడా వచ్చారు . ఇది నాకు గుర్తున్న మా ఊరి కథ. తరువాత అమ్మమ్మ తాత కూడా వఛ్చి settle అయ్యారు. ఊర్లో ఉన్న ఆంధ్రా వాళ్ళు అందరూ ఆల్మోస్ట్ చుట్టాలే.

IMG_0116

నేను పుట్టి పెరిగింది అంతా రాయలసీమ తెలంగాణా లోనే. గుంటకల్ లో 3rd క్లాస్ వరకు చదువుకున్నా . ప్రతి సెలవలకి క్యాంప్ వెళ్లిపోవడమే,విజయవాడ వెళ్తే ఏదన్నా పెళ్లికే . క్యాంప్ వెళ్తున్నాం అంటే చాలు పిచ్చ excitement వచ్చేసేది. తాత కి ముందే లెటర్ రాస్తే,బండి పంపించే వారు , మా ఊరి లోపలికి బస్ ఉండేది కాదు, of course ఇప్పటికి లేదు. మా ఊరికి nearest bus stand అయిజ , అక్కడ నుంచి ఒక ప్రైవేట్ బస్ ఊరి బయట దించేసి వెళ్లిపోయేది. అక్కడ నుంచి ఎద్దుల బండి మీద వెళ్ళాలి. రోడ్డు పక్కనే కాలవ , ఒక season లో నీళ్లు ఉండేవి, ఒకోసారి ఎండిపోయి ఉండేది.మా ఊర్లోంచి ఇంకా చాలా ఊర్లకి వెళ్ళేది. ఊరికి దగ్గరవుతున్న కొద్దీ excitement levels పెరిగిపోయేవి. ఊరి మొదట్లో ఒకే మొదలు నుంచి నాలుగు తాటి చెట్లు ఉండేవి , అవి ఎవరో పెట్టినట్టే ఉండేవి , తాటి దాకా వెళ్ళాము అంటే ఊరు మొదలైనట్టే… ఫస్ట్ ఇల్లు శ్యామలమ్మ వాళ్ళది అక్కడ నుంచి పలకరింపులు మొదలు… అలా చాలా ఇళ్ళు దాటాక తాత వాళ్ళ ఇల్లు , మా ఇల్లు తరువాత ఇంకో రెండు ఇళ్ళు , ఊరికి దూరం గా అప్పయ్య తాత ఇల్లు, అదొక మిస్టరీ ఇల్లు మాకు .

IMG_0117

అక్కడితో ఊరు అయిపోయేది. తాత వాళ్ళ ఇంటికి ఈతాకుల దడి ఉండేది.

నేను డైరెక్టర్ అవడానికి ఒక కారణం daddy film distributor అవటం,సినిమాలు చూడటం,సినిమా కబుర్లు ఇదే లోకం. రెండో కారణం మా ఊరు. రేడియో, పుస్తకాలు తప్ప వేరే entertainment ఏం ఉండేది కాదు,విన్నవి చదివినవి imagine చేసుకోవడం,మేము సొంతం గా కథలు చెప్పుకోవడం, రాత్రి పూట తాత పక్కన బయట పడుకుంటే ఆకాశం చూపిస్తూ ఏదో ఒకటి చెప్పేవారు. రేడియో పుస్తకాలు కాకుండా మా సొంత entertainment లు చాలా ఉండేవి, ఆడుకోవటం,పొలానికి వెళ్ళటం,చిన్న పందిరి వేసి అందులోనే రోజంతా గడిపేయటం, సెలవలకి వఛ్చిన పిల్లలు అందరూ mostly మా ఇంటికే వచ్చేవారు. తాత కి ఇది చిరాకు గా ఉండేది.

IMG_0125

మా ఇల్లు

బి.నర్సింగరావు గారికి నాకు ఫస్ట్ connection “పల్లెటూరి పిల్లగాడా” పాట, చాలా చిన్నపుడు ఊరికి వెళ్ళినపుడు రేడియోలో విన్నా , కానీ సినిమా పేరు తెలియదు. ఇలా ఉందేంటి ఈ పాట…బాగా నచ్చేసింది ,కానీ చాలా డిఫరెంట్ గా ఉంది. ఆ వాయిస్ నన్ను చాలా రోజులు వదలలేదు. నేను అజిత్ (S /O నర్సింగరావు గారు) దగ్గర చిత్రలేఖ స్టూడియో లో join అయినపుడు మా భూమి చూసాను, అప్పుడు clear అయింది ఆ పాట మిస్టరీ, అది ఏ సినిమాలో పాటో తెలిసింది. ఇంకో మర్చిపోలేని సంఘటన “మా భూమి” విడుదల అయి 35 ఏళ్ళు అయిన సందర్భంగా lamakaan లో screening అయింది. అప్పుడు సంధ్యక్క “పల్లెటూరి పిల్లగాడా” పాట పాడింది, రోమాలు నిక్కపొడుచుకున్నాయి, అదే వాయిస్,అదే intensity, కళ్ళలో నీళ్లు కారిపోతున్నాయి నాకు. మా ఊర్లో రేడియోలో విని, నన్ను చాలా రోజులు వెంటాడిన పాట పాడిన సింగర్ని చూడటం నిజంగా గొప్ప ఫీలింగ్, వెళ్లి మాట్లాడాలి అనుకున్న, కానీ ఏడ్చేస్తానేమో అని వెళ్ళలేదు. ( end of part 1)