Menu

దిక్కుమాలిన ప్రేమకథ

5 ఏళ్ల కింద నేను అనుకున్న love స్టోరీ, అప్పుడు రాయలేదు.ఇప్పుడు గుర్తున్నంత వరకు రాద్దామని మొదలెట్టాను.నా సినిమా టైటిల్ D P K

రాజు, 18 ఏళ్ల జాలీ గా తిరిగే కుర్రాడు, average స్టూడెంట్, మధ్యతరగతి కుటుంబం.  బాగా చదివే  చెల్లి,simple  నాన్న, ఆర్డినరీ అమ్మ . ఇది వాడి కుటుంబం.

రాజు ఫ్రెండ్స్ అందరూ కూడా జాలీ టైపే. సాయంత్రం అయేసరికి పునుగుల బండి దగ్గర కలవటం,ఉన్న డబ్బులతో వీలైనన్ని పునుగులు బజ్జీలు తిని, అప్పు చేసి సిగరెట్లు కాల్చి, వాళ్ళ కులం హీరో రాబోయే సినిమా గురించి కబుర్లు చెప్పుకుని ఇళ్ళకి వెళ్ళిపోతారు. రాజు కి చిన్నప్పటి  నుంచి ఒక హీరో అంటే ఇష్టం, సినిమా release అయితే banner కట్టాల్సిందే , morning షో చూడాల్సిందే. ఈ హీరో సినిమాలు అన్నీ ప్రేమ చుట్టూనే. అభిమానులు ఈ ప్రేమ హీరోని  ప్రేమగా “LOVE STAR “ అని పిల్చుకుంటారు.

రొటీన్ గా ఈ శుక్రవారం కూడా 7-8 టుమ్రీ  సినిమాలు & LOVE STAR  సినిమా “మొలకెత్తిన ప్రేమ” భారీ విడుదల. రాజు  పొద్దున్నే లేచి రెడీ అయి  ఫ్రెండ్స్ తో థియేటర్ కి వెళ్లి banner  కట్టేసి  టికెట్స్ సంపాదించి సినిమా చూసేసాడు. సినిమా అయిపోయింది,సూపర్ హిట్ టాక్. రాజు ఫ్రెండ్స్ తో ఏం మాట్లాడకుండ ఇంటికి వెళ్ళిపోయాడు. “మొలకెత్తిన ప్రేమ” రాజు ని అతలాకుతలం చేసింది, ఎన్నో ప్రేమ సినిమాలు చూసాడు కానీ ఇలా ఏ సినిమా అనిపించలేదు. లోపల తెలియని అలజడి. ఆ సినిమా లో ఉన్నట్టు ప్రపంచం అంతా అందం గా ఉంటే ఎంత బాగుంటుంది…

ఇంటికి వెళ్లి system  ముందు కూర్చుని “M P” సినిమా లో పాటలు చూస్తున్నాడు, వాళ్ళ అమ్మ భోజనానికి రమ్మంది. వాళ్ళ అమ్మ వడ్డిస్తోంది, ఆమెని చూసాడు. రేగిపోయిన జుట్టు,ఎప్పుడూ కట్టే పాత  చీర, పని చేసి అలసిపోయిన నీరసపు మొహం. రాజు కి ఇక్కడ మొదలైంది చిరాకు ప్రపంచం మీద.  అమ్మ ఎందుకు ఇలా ఉంది, MP సినిమాలో హీరో అమ్మ వంట చేస్తున్న పట్టు చీరలే , ఏ టైం లో అయినా నవ నవ లాడిపోతుంది,నిద్రలో కూడా చిరునవ్వు మొహం ,సినిమా లో హీరో కి అన్నం వడ్డించే సీన్లో ఎంత ప్రేమ గా నటించింది  …అమ్మంటే అలా ఉండాలి. భోజనం చేసి నిద్రపోయాడు.కలలో అంత మొలకెత్తిన ప్రేమే.నిద్ర లేచి మొహం కడుక్కుని బయటకు వచ్చాడు,వరండా లో చెల్లి చదువుకుంటోంది, ఆమెని చూసాడు, దీనికి ఎప్పుడూ చదువు గోలే,మొలకెత్తిన ప్రేమ లో హీరో చెల్లి క్యూట్ గా ఉంటుంది , ఎప్పుడూ సరదాగా ఉంటుంది,జోక్స్ వేస్తుంటుంది, అసలు చదువు ధ్యాస ఉండదు, అసలేం చదువుతుందో కూడా చూపించరు. రాజు కి తన చెల్లి చాలా బోరింగ్ అనిపించింది .

కాలనీ  రోడ్డు మీద నడుస్తున్నాడు,నాన్న గుర్తొచ్చాడు. ఆఫీస్ కి వెళ్ళటం, రావటం,స్నానం చేసి బనీను లుంగి లోకి మారిపోయి TV చూడటం తప్ప ఆయన పెద్ద గొప్ప పనులు చేసినట్టు రాజు కి గుర్తు లేదు. సినిమా లో హీరో father ఎంత మోడెర్న్ గా ఉన్నాడు, వేల కోట్ల business చేస్తాడు, hero కి ఏది కావాలంటే అది కొనిస్తాడు. రాజు నాన్న మాత్రం ప్రతి దానికి లెక్కలు వేసుకుంటాడు.

రెండు రోజుల తరువాత మొలకెత్తిన  ప్రేమ దర్శకుడు love star ఇంకో సినిమా announce చేశారు, “ప్రేమ విత్తనాలు” ఇది M P కి prequel… రాజు  fix అయిపోయాడు ఆ సినిమా వచ్చేలోపు ప్రేమలో పడిపోయి తన అందమైన తెల్ల ప్రేమికురాలు తో ఆ సినిమా చూడాలి,తెల్లగా ఉన్న అమ్మాయినే ప్రేమించాలి, ఎంత తెల్లగా ఉండాలంటే కళ్ళు బైర్లు కమ్మాలి ఆ తెలుపుకి…అసలు నల్లగా ఎందుకుంటారు కొంత మంది అమ్మాయిలు? వాళ్ళ వైపు   కన్నెత్తి కూడా చూడకూడదు…  ఈ రోజు నుంచి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని “అందం” గా మార్చేయాలి… ఇదే “HERO GOAL”…