Menu

Elahe Hiptoola

FTII & గజేంద్ర చౌహాన్ ఈ గొడవ మొదలైనపుడు లమాకాన్ లో ఒక discussion పెట్టారు,వంద కుర్చీలకి 25 మంది వచ్చారు. మా రైటర్ రోహిత్ కూడా stage మీద కూర్చుని discuss చేసిన వాళ్ళలో ఒకడు,అదే stage మీద elahe కూడా.పార్లమెంట్లో చర్చకు వచ్చిన protest మా సినిమాకి use అవుతుందని మేము ఎప్పుడూ అనుకోలేదు.

శీష్ మహల్లో ఉన్న నాలుగు కథల్లో ఒకటి Faisalది.ఈ కథ మొత్తం సినిమా లో deccani ఉర్దులోనే ఉంటుంది.Faisal వైఫ్ character కోసం వెతుకుతున్నాం.జ్ఞాన “గమ్యం సంధ్య” సూట్ అవొచ్చు అని number ఇస్తే వెళ్లి కలిసాను,కలవగానే perfect అని ఫిక్స్ అయిపోయి తనకి డేట్ చెప్పేసి షూట్ ప్లాన్ చేసుకున్నాం.మా దగ్గర ఎప్పుడూ డైలాగ్స్ ఉండవు,faisal character Ferozeతో కూర్చుని రోహిత్ డైలాగ్స్ రాస్తున్నాడు.సంధ్యకి ఉర్దూ కష్టం అనే విషయం లొకేషన్ కి వెళ్ళే దాక తెలియదు.ఏదో కష్టపడి అక్కడక్కడ తెలుగులో చెప్పించేసి షూట్ finish చేసాం.ఎడిటింగ్ లో చాలా కష్టపడుతున్నాం,deccani ఉర్దూలో dubbing  చెప్పే అమ్మాయి easyగా దొరికేస్తుందిలే అని నాకు ధైర్యం ఉండేది.కానీ ఎంత ట్రై చేసినా ఎవరూ దొరకలేదు.

లమాకాన్ లో protest discussion అయిపోయాక ఆ రాత్రి ఐడియా వచ్చింది,Elaheని dubbingకి అడిగితే అని? ఆమె number సంపాదించి రోహిత్ కి ఇచ్చి మాట్లాడమని చెప్పాను.మేము అడిగినపుడు ఆమె ముంబై లో ఉంది,హైదరాబాద్ వచ్చినపుడు చెప్తాను అని రిప్లై ఇచ్చింది.చెప్పినట్టుగానే వచ్చి dubbing ఫినిష్ చేసింది,గంటలో.ఆ character గురించి మాకున్నటెన్షన్ మొత్తం పోయింది.Thanks to Elahe.

HYDERABAD BLUES అనే సినిమా ఏ నమ్మకం తో నగేష్ తీయాలని అనుకున్నాడో,అతనికి టీం ఎలా దొరికిందో ఆ టైం లో ఇప్పటికి వండర్ నాకు.Elahe అందులో act చేసి production కూడా చూసుకుంది అంటే మామూలు విషయం కాదు.సినిమా పిచ్చితనం.

“IT’S THE MOST UNDERRATED AND THANKLESS JOB”

Elahe ఈ మాట అన్నది “people management “in films గురించి,ఇది ఎంత కష్టం అంటే చెప్పడం కష్టం.అది కూడా డబ్బులు లేని ఇండీ సినిమాల్లో మరీ కష్టం.ఫస్ట్ ఐడియా వినగానే చాలా సపోర్ట్ దొరుకుతుంది,తీసేవాడు కూడా వెతుక్కుని పనీపాట లేనోల్లని పెట్టుకుంటాడు కాబట్టి.ఆ తరువాత అసలు కథ మొదలవుతుంది,పని చేసేవాడు మనకి హెల్ప్ చేస్తున్నట్టు,నీ లైఫ్ ambition సినిమా నాది కాదు అన్నట్టు వాడు behave చేస్తుంటాడు.

ఏం చేయలేం డబ్బులు ఉండవు,ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు,అసలు ఈ సినిమా బయటకి వస్తుందా అనే డౌట్! ఉన్న వాళ్ళని బతిమాలి అడుక్కుని పని చేయించుకోవడం అంత వీజీ కాదు.నిన్ను ఎందుకు నమ్మాలి ఎవడైనా?ఎలాంటి పెద్ద డైరెక్టర్ దగ్గర పని చేయకుండా,”కమర్షియల్” కథ రాయకుండా నీకు నచ్చింది తీసుకునేవాణ్ని సపోర్ట్ చేయడమే ఎక్కువ.సినిమా మొదలైన కొత్తల్లో చాలా బాగుంటుంది,ఆ తరువాత నీ కాల్స్ కి రిప్లై ఉండదు,వాళ్ళు ఫ్రీగా ఉన్నపుడే చేస్తారు,నువ్వేమో ప్రొడ్యూసర్ & డైరెక్టర్ అయిపోయాము అనుకుంటావ్,మెల్లిగా అర్ధం అవుతుంది నువ్వేంటి అనేది.మనకి పెద్దగా INDIE cinema culture లేకపోవడం, కొత్తగా అంటే “తేడా” అనుకోవటం ఇవన్ని మన “సాంస్కృతిక” issues.నా చిన్నపుడు nighty వేసుకున్న స్త్రీల గురించి ఎన్ని ముచ్చట్లో.ప్రపంచ సినిమాలో కూడా ప్రతి  Indie స్టొరీ దరిద్రమే.వాళ్ళు ఎలా HYDERABAD BLUES చేసారో ఈసారి కలిసినపుడు అడగాలి.

“We met,made Hyderabad Blues, and I haven’t wanted to do anything else since”- Elahe

ఇది సినిమా ఇచ్చే ఆనందం,నువ్వు చేయాలని అనుకున్నది చేస్తున్నపుడు ఏదైనా లైఫ్ లో ఆనందమే. (సినిమాటిక్). సినిమా తప్ప ఇంకేం చేయక్కర్లేదు అనే నమ్మకం ఎలా? HIT తోనా?అసలు HB రిలీజ్ చాలా వింత,ఎక్కడో bombayలో ఒక షోతో రిలీజ్ అయ్యి ఆ తరువాత అది హైదరాబాద్కి వచ్చింది.అంత “uncertainty” తీస్తున్నపుడు అనుకుని ఉంటారా?సినిమా తీయడంలో ఉంది మజా అంతా,తీస్తున్నపుడే కంది పప్పు వ్యాపారం లాగ లెక్కలు వేసుకుంటే కష్టం.లెక్క వేయటంలో తప్పులేదు,నువ్వు ఎంతలో తీస్తున్నావ్ అనేది ముఖ్యం.

(ఇంకా ఉంది )