Menu

అరుణ్ సాగర్

ఒకే ఒక్కసారి కలిసాను తనని.బాహుబలి సినిమా మీద అరుణ్ రాసిన ఆర్టికల్ చదివి,అప్పటికప్పుడు ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి తన నెంబర్ పట్టుకుని కాల్ చేసి మాట్లాడాను.ఫోన్ ఎత్తగానే “మీ వయసు ఎంతో తెలియదు,నేను మిమ్మల్ని అరుణ్ గారు సారు అనను,మీరు రాసింది చదివాక ప్రపంచంలో బాహుబలి నచ్చే మంచోల్లే కాదు మీలాంటి పిచ్చోళ్ళు కూడా ఉన్నారు అని ఆనందంగా ఉంది అరుణ్,ఎందుకంటే నేను కూడా మంచోన్ని కాదు …”ఇలా ఏదేదో వాగేసాను,తను చాలా soft గా మాట్లాడాడు.తన మెయిల్ ID తీసుకుని మా శీష్ మహల్ pitch trailer ఒకటి పంపించాను next day.చూసి చాలా excite అయి రిప్లై ఇచ్చాడు, full compliments.ఆ ఆనందంలో  మేము తీస్తున్న ఇంకో రెండు సినిమాల ట్రైలర్స్ కూడా పంపాను,ఖచ్చితంగా మళ్లీ compliments వస్తాయని తెల్సు,అదే జరిగింది.ఒక లైన్ ఏదో పెట్టాడు,నా పాత ఫోన్ తో పాటు అది కూడా పోయింది.ఆ లైన్ చదివి నా ఇగో బాహుబలి కలెక్షన్స్ దాటిపోయింది.ఎందుకంటే ఎటువంటి “inhibitions” లేని రాత అది…

బాహుబిల్డప్

ప్రైడ్ ఆఫ్ ఇండియా అనో ఇండియాస్ ప్రైడ్ అనో టాగ్‌లైన్ పెట్టారు కదా….అది తీసేయండి. సీరియస్‌లీ!

కానీ అలాంటి సినిమాని ఇండియాస్ ప్రైడ్ అని ప్రకటిస్తే మాత్రం మండుద్ది.

సినిమాని హైప్ చేస్తే తప్ప అమ్ముకోలేని దుస్థితి మనకే ఎందుకు గురూ. టాక్ స్ప్రెడ్ కాకముందే థియేటర్లను నింపేసి, కలెక్షన్లు దోచేసి, ఆపై మెల్లగా మనసుల్లోంచి ఫేడయిపోయే సినిమాలా చివరకు మనవి?

పండోరా ఉపగ్రహం నుంచి నావీ జాతి వీరులు తమ వనరులను దోచుకోడానికి వచ్చిన వాళ్లను తరిమితరిమి కొడితే నా ఇగో చల్లారినట్టు.అలాంటిదేమీ లేనపుడు,నేను నీ `సృష్టిత`పాత్రలతో ఎందుకని ఎంపథైజ్ కావాలి?

జీవం లేని పరిసరాలూ శరీరం తప్ప అత్మలేని కధాక్రమమూ మొఖం మీద విసిరికొట్టి `డబ్బుల్ తియ్, నేను ఖర్చుపెట్టిందంతా నువ్వు కక్కు…`అనడం ఏమన్నా న్యాయమా బాబయ్యా.వేరె ఉద్దేశం ఏమీలేదు.జస్ట్ ఫుడ్ ఫర్ థాట్! అంతే.

అసలు రెండుగంటల టీజర్ ఏనాడూ చూడలేదు.

మీరు నెగటివ్ థింకింగ్ అనొచ్చేమో గానీ,నూటికి డెబ్బయి శాతం ఫిలిమ్‌మేకర్లకు సెన్సిబిలిటీస్ తక్కువ.అటువంటివి ఉండాలని కూడా తెలీదు.పాపం వారు పెరిగిన పెరుగుతున్న వాతావరణం అటువంటిది,నేర్చుకున్న నేర్చుకుంటున్న సినిమా అటువంటిది.

అన్నిటికీ మించి దుష్టులెప్పుడూ నల్లగా కురూపులై బండోళ్లయి ఉంటారు.లేదా వైస్ వెర్సా.నల్లగా కురూపులై బండోళ్లయి ఉన్నవారు దుష్టులై ఉంటారు.వారి రాజ్యం పేరుకూడా నేలబారుగా ఉంటుంది.

ప్రతి వాక్యం తెలుగు “సినిమా సంస్కృతి” కింద ఒక LAND MINE…తెలుగు సినిమా “భూస్వామ్య /రాచరిక/వారసత్వ ” సంస్కృతి మీద తిరుగుబాటు ఇదిఎవరితను?ఇంత ధైర్యం ఏంటి?తెలుగు సినిమా మీద కామెంట్ చేయడానికి ధైర్యం కావాలా అని మీరు అనుకోవచ్చు,ఇలా రాసినోన్ని చూడలేదు ఇంతవరకు.”మన సినిమా” మీద ఇంత తాపత్రయం ఉన్నోడికి నా ట్రైలర్ నచ్చింది,చాలు బెంచోత్.  

అంతకు ముందు మేల్ కొలుపు పుస్తకం ఒక ఫ్రెండ్ ఇంట్లో చూసి చదవటం మొదలుపెట్టాక పూర్తి అయ్యేవరకు ఆపలేదు.ఎవరో ఈయన చాలా  బాగా రాసాడే అనుకున్న గాని కలవాలి కలవొచ్చు అనే ఆలోచన రాలేదు.

అరుణ్ తో మాట్లాడాక ఇతనితో ఏదో ఒకటి చేయాలి,శీష్ మహల్లో ఒక పాట అయిన రాయిన్చుకుందాం అని ఫిక్స్ అయి TV5 కి వెళ్లి నేను రోహిత్ కలిసాం.first & last meeting with arun.చాలా busy గా ఉన్నాడు,నేను నిన్ను సారు గారు అనను అన్నాక కలుస్తున్న,వీలైనంతవరకు ఆ రెండు “బానిస మాటలు” రాకుండ మాట్లాడుతున్న,తన రూం లో ఉన్న tv చూస్తున్నాడు,మధ్యలో ఎవరికో కాల్ చేసి “మనమెందుకు ఆ న్యూస్ ఇంకా బ్రేక్ చేయలేదు” ఇలాంటి ఏవేవో మాట్లాడుతూ మాతో కూడా మాట్లాడుతున్నాడు.నాకు చాలా interesting గా అనిపించింది తన వర్క్.ఫైనల్ గా చెప్పాడు “ లేదు శశి నేను సినిమా పాట రాయలేను,చూస్తున్నారు గా నా వర్క్ ఇలా ఉంటుంది. నాకు అనిపించినపుడు ఏదో ఒకటి రాస్తుంట,నాకు తెల్సిన చాలా మంది young writers ఉన్నారు,వాళ్ళు చాలా బాగా రాస్తున్నారు” అని వాళ్ళ FB IDs చెప్పాడు.నా కక్కుర్తి నాది,”మా ఫిల్మ్ కి మీడియా సపోర్ట్ కావాలి,support చేయండి” అనగానే “anytime sasi” అని అరుణ్ అనగానే tv5 నా చేతిలో ఉంది అనే ధైర్యం వచ్చేసింది.అంతెందుకు నిన్న కూడా ఎవరికో చెప్పా tv5 మా సినిమాకి ఫుల్ సపోర్ట్ చేస్తుంది అని,ఇది కేవలం అరుణ్ మీద నమ్మకం.

రెండు రోజుల క్రితం మోహన్ గారిని కలవటానికి వెళ్తే పోలవరం నిర్వాసితుల మీద అరుణ్ రాసిన ఒక కవిత గురించి చెపుతూ అతన్ని పొగుడుతుంటే ఎంత ఆనంద పడిపోయాను,అటువంటి “ఆర్టిస్ట్” నాకు తెల్సు అనే గర్వం.

ఈరోజో రేపో కలవాల్సింది,మా సినిమా క్రౌడ్ ఫండింగ్ campaign ఎల్లుండి స్టార్ట్ చేస్తున్నాం,అరుణ్ ని కలిసి tv5 లో ఒక ప్రోగ్రాం మా సినిమా గురించి చేయండి అని అడుగుదాం అనేది ప్లాన్.నెంబర్ పోయింది,FB లో msg పెడదాం అని ఓపెన్ చేయగానే చూసిన news ఇది.

LIFE IS FUCKING UNCERTAIN

అరుణ్ చచ్చిపోయినందుకు బాధేం లేదు,కొద్దిగా ఉంది.అందరం పోతాం గా.

“ఆయన మరణం మానవాళి కి తీరని లోటు” అని చాలా మంది గురించి statements ఇస్తుంటారు,అరుణ్ సాగర్ మరణం మాత్రం లోటే… ఏదో ఒకటిలే comrade బతికినప్పుడు కనీసం ఏదో ప్రయత్నించావు…