Menu

Geography లేని తెలుగు సినిమా

నాకు బాగా ఇష్టమైన పండగ సంక్రాంతి ఎందుకంటే కొన్ని లక్షల మంది city నుంచి వెళ్ళిపోతారు.ఈ 3-4 రోజులు హైదరాబాద్ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే,వర్ణించడం కష్టం.ఎప్పటికీ ఇలానే ఉండి పోతే ఎంత బాగుంటుందో,వెళ్ళినవాళ్ళు అందరూ వెనక్కి రాకపోతే అని ప్రతి సంవత్సరం అనిపిస్తుంది.దురాశ,దుర్మార్గారపు కోరిక.ఎవరి సిటీ వాళ్లకి ముద్దు,నా సిటీ నాకు ముద్దు.సంక్రాంతి రోజుల్లో పని ఎం లేకపోయినా బైకో,డబ్బులు ఉంటె ఆటోలో,లేకపోతే సిటీ బస్లో తిరుగుతుంటే చెప్పలేని ఆనందం.ఖాళీ రోడ్ల మీద తిరుగుతుంటే సిటీని కొత్త గా చూసినట్టు ఉంటుంది.ఇలాంటి సిటీ ఎక్కడైనా ఉంటుందా?ఉండదు,మళ్ళీ monday అందరూ వచ్చేస్తారు,అదే రచ్చ.

ఇంత cultural economical political historical background ఉన్న సిటీ మన సినిమాల్లో చాలా దరిద్రం గా ఉంటుంది.జీవితాంతం హైదరాబాద్ కథల మీదే సినిమా లు తియొచ్చు.Secunderabad ఎప్పుడైనా చూసారా మన సినిమాల్లో,ఒక్క రైల్వే స్టేషన్ బోర్డు తప్ప.మా భూమి సినిమాలో అప్పటి  హైదరాబాద్ని చూడొచ్చు.మళ్ళీ నగేష్ కుకునూర్ హైదరాబాద్ బ్లూస్ లో,శేఖర్ కమ్ముల Dollar Dreamsలో కూడా,ఆ తరువాత శేఖర్ సినిమాల్లో హైదరాబాద్ అదో రకంగా ఉంటుంది.Deccani సినిమాల్లో ఓల్డ్ సిటీని మాత్రం చాలా బాగా exploit చేసారు.అది ఇండీ సినిమా desperation,రిచ్ లొకేషన్స్ దొరకనపుడు రిచ్ సిటీని వాడుకోవాలి,కానీ అలా జరగలేదు,జరగటం లేదు.

తమిళ్ సినిమాలు చూసి,అన్నీ కాకపోవచ్చు,low  budget ఇండిపెండెంట్ సినిమాలు చూసి చెన్నైని చూస్తే సినిమాలో ఉన్నట్టే ఉంటుంది.వాళ్ళ కల్చర్,food habits,dressing అన్నీ reflect అవుతాయి.French New wave,european New wave సినిమాల్లో జరిగిందే ఇది,కెమెరా రోడ్ల మీదకి రావటం,నిజ జీవితం కూడా సినిమా కథగా స్క్రీన్ మీద translate అవటం.అసలు సిటీనే పట్టించుకోని మనం సిటీ జీవితాల మీద సినిమాలు ఎలా తీస్తాం?

హీరోల సినిమాలు రోడ్ల మీద తీయటం కష్టం కానీ స్వతంత్ర సినిమా ఆ పని చేయగలదు,పర్మిషన్ లేకపోయినా షూటింగ్ చేస్తున్నట్టు హడావిడి లేకుండా తీయొచ్చు.ఎందుకంటే మన actors ని ఎవరూ పట్టించుకోరు, చిన్న కెమెరాలు కనపడిన అదేదో news చానలో short ఫిల్మో అనుకుని వెళ్ళిపోతారు.ఈ advantage ని తెలుగు new age filmmakers అసలు వాడుకోవటం లేదు. ప్రతోడికి Horror comedy తీసి హిట్ కొట్టి నెక్స్ట్ సినిమాకి కోటి తీసుకుందామనే ప్లాన్,నేను కూడా try చేసా workout అవలేదు అందుకే రోడ్ల మీద పడి ఒక సినిమా తీసేసా.

2009 లో “బెజవాడ బాబ్జీలు” అనే సినిమా తీయాలి 25లక్షల budgetలో అనే ప్లాన్ తో  పది రోజులు అక్కడ ఉన్నా, నేను  చిన్నప్పటి నుంచి చూసినా నాకు బెజవాడ గురించి పెద్దగా తెలియదు,very exciting TOWNసిటీ.డిసెంబర్ లో అక్కడ climate అంత beautiful గా ఉంటుందని అప్పుడే తెల్సింది,ఎప్పుడూ సమ్మర్ లో వెళ్ళటం climate ని తిట్టుకోవటమే.రోజూ రిక్షాలో ఆటోలో తిరిగేవాణ్ణి,అలాంటి బెజవాడ ని నేనెప్పుడూ సినిమాలో చూడలేదు.కృష్ణ జిల్లా నుంచి చాలా పెద్ద పెద్ద హీరోలు ప్రొడ్యూసర్స్ వచ్చారు,కానీ బెజవాడ గుడివాడ బందరు ఎప్పుడు సినిమాల్లో కనపడవు.లాఠీ సినిమాలో బానే ట్రై చేసాడు గుణశేఖర్,మళ్ళీ ఫస్ట్ సినిమా desperation,ఏదో కొత్తగా చేయాలనే తాపత్రయం.కృష్ణా బారేజ్ కట్ to interior,,,ఇంతే బెజవాడ సినిమాల్లో…ఎన్ని ఇంటరెస్టింగ్ లొకేషన్స్,ఎవర్ని చూసినా ఒక కొత్త character రాయొచ్చు.It’s నాట్ happening.

గోదావరి జిల్లాలు మాత్రం కాస్త మన సినిమాల్లో కనిపిస్తాయి,అక్కడి మనుషులు కనిపిస్తారు,పొలాలు,కొబ్బరి తోటలు…అక్కడి men & women…thanks to  వంశీ ఈవీవీ జంధ్యాల.మన సినిమాలో దర్శకులు ఎక్కువమంది అక్కడి నుంచే కావటం వల్ల ఇదన్నా చూసాం.ఇప్పుడు అక్కడి నుంచి వచ్చే దర్శకులు కూడా గోదావరి అంటే పొల్లాచ్చి వెళ్ళిపోతున్నారు.T Krishna సినిమాలు చాలా వరకు రోడ్ల మీదే,ఇప్పటికీ ఆ సినిమా visuals గుర్తుంటాయి, ఆర్.నారయణ మూర్తి మనకున్న ఒకే ఒక్క ఇండీ filmmaker,ఊర్లు అడవులు అక్కడి మనుషులు ఇవే ఆయన సినిమాలు,సినిమా తీయాలి అనే desperation తోనే ఇదంతా జరుగుతుంది.

నేను పుట్టి పెరిగింది అంతా రాయలసీమ తెలంగాణా…మన socalled faction సినిమాల్లో రాయలసీమ చాలా అన్యాయం గా ఉంటుంది…ఒట్టి  మెయిన్ లొకేషన్స్ & వీధులు మిగతా అంతా దరిద్రపు భావజాలమే…లేకపోతే యాస మీద కామెడీ రాయటం…

వైజాగ్ కొంతవరకు బెటర్… అది కూడా అందమైన బీచ్ సైడ్ మాత్రమే… నేను చూసిన గాజువాక పూరీ సినిమాల్లో కూడా లేదు.అన్నిటికంటే అన్యాయం పూరీ తీసిన ‘నేనింతే’ లో కృష్ణ నగర్….పొరపాటున కూడా అలా ఉండదు…

శ్రీకాకుళం,విజయనగరం ఉన్నట్టు కూడా మన filmmakers కి తెలియదు అనిపిస్తుంది.ఉత్తరఆంధ్ర అంటే వైజాగ్ అరకు వరకే…అటు పక్క వాళ్ళు అందరూ కామెడీ గాళ్ళే…

“భారీ” సినిమాలు రోడ్ల మీద ఊళ్లలో తీయటం కష్టమే…crowd problem…మరి చిన్న సినిమాకి ఏం ప్రాబ్లం?

REGIONAL CINEMA చాలా అవసరం…ఇరానియన్ సినిమా చూసి కూడా మనం ఏం చేయలేకపోతే అది క్రైమ్…మీరా నాయర్ చెప్పినట్టు “మన కథలు మనం కాకపోతే ఎవడు తీస్తాడు?”

2 Comments
  1. Teluguwap January 17, 2016 /
  2. చందు తులసి January 13, 2017 /