Menu

సహకార సినిమా

శీష్ మహల్ టీం కాకుండా  కథ విన్న ఫస్ట్ బయటి వ్యక్తి వేద కుమార్ గారు,ఫ్రెండ్ అజిత్ వాళ్ళ బాబాయి. Nov 14th ఫెస్టివల్ ఓపెనింగ్ లో మా షూట్ మొదలవాలి,13th evening ఆయన్ని కలవటం కుదిరింది. ఫెస్టివల్ లో షూట్ చేయడానికి మాకు permission or passes ఆయన ఇప్పించగలరు అని నేను చాలా నమ్మకం పెట్టుకుని ఉన్న,కానీ బాగా లేట్ అయిపొయింది. చాలా busy గా ఉన్నారు,ఏదో మీటింగ్ అయిపోగానే కలిసాం.అజిత్ నన్ను introduce చేసాక డైరెక్ట్ గా ఐడియా చెప్పి కథ చెప్పటం మొదలుపెట్టేసా,కొంచెం టైం పట్టింది.ఆయన చాలా ఓపికగా విన్నారు,కథ అయిపోయాక “చాలా బాగుంది ఐడియా ఇంత లేట్ చేసారేంటి ”అని immediateగా PAని పిలిచి మమ్మల్ని venue దగ్గరకు తీసుకెళ్ళి secretary అక్కడే ఉంటారు,పర్మిషన్ సంగతి చూడమని పంపించారు.నేను చాలా excite అయిపోయాను ఒకటి కథ ఆయనకి నచ్చింది రెండు పాసులు వచ్చేస్తున్నాయి , షూటింగ్ అయితే ఆగదు.Venue దగ్గరకి వెళ్తే పని అవలేదు,next day FDCకి వెళ్తే వేదకుమార్ గారి PA  వచ్చి మాకు పది వర్క్ పాసులు ఇప్పించారు.ఈ పాసులు ఉన్నాయి అనే ధైర్యం తో ఫెస్టివల్ జరుగుతున్న అన్ని రోజులు event లోనే కాదు సిటీలో ఎక్కడ పడితే అక్కడ షూట్ చేసేవాళ్ళం.ఆ తరువాత అలా షూట్ చేయడం అలవాటు అయిపొయింది.First day shoot day was grand success.

vlcsnap-2015-08-03-20h06m41s827

రెండో రోజు షూట్ చేయటానికి మా దగ్గర actors లేరు,ఫస్ట్ డే act చేసిన వాళ్ళందరూ మా unit & ఫ్రెండ్స్.నాలుగు కథల్లో మేమందరం కొంచెం ఎక్కువ ప్రేమించే కథ “ఫకీర్”,ఇది ఒక rag picker  స్టొరీ.కథ విన్న రెండో బయటి వ్యక్తి Philips గారు,దివ్య దిశ ఫౌండేషన్ Head.ఫస్ట్ టైం కలవటం ఆయన్ని.నాకు తెలుగు బాల నటులు అంటే చాలా భయం.”సలాం బాంబే” కి మీరా నాయర్ ఎం చేసిందో same ప్లాన్,అటువంటి background ఉన్న అబ్బాయినే సెలెక్ట్ చేసుకుందామని rescue homes కోసం వెతుకుతుంటే ఈ ఫౌండేషన్ నెంబర్ దొరికింది.నేను మా AD జిగ్గి ఇద్దరం ఆయన్ని కలవటానికి వెళ్ళాం,వేద కుమార్ గారికి చెప్పాక చాలా ధైర్యం వచ్చింది. సింపుల్ గా క్లియర్ గా కథ చెప్పేసా,same reaction,ఆయనకి కూడా కథ నచ్చింది వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్న చేస్తాము అని,ఉప్పల్ లో ఉన్న hostelకి వెళ్లి మీ character కి సరిపోయే కిడ్స్ ని సెలెక్ట్ చేసుకోమన్నారు.ఈ హాస్టల్ లోనే మా “ఫకీర్” సాయి దొరికింది,వాణ్ని చూడగానే అనిపించింది వీడే మన actor అని.

act Sai

next day షూట్ లో జ్ఞాన ఫకీర్ మీద టైట్ close up పెట్టాడు,వెనక్కి తిరిగి కెమెరా లోకి చూడాలి,ఫస్ట్ షాట్ లోనే perfect లుక్ ఇచ్చాడు, “వీడు సూపర్ స్టార్ శశి” జ్ఞాన reaction.ఆ తరువాత ప్రతి సీన్లో ఫకీర్ సాయి మాకు surprises ఇస్తూనే ఉన్నాడు.ఈ పాత్రకి సినిమాలో ఒక్క డయలాగ్ ఉండదు.ఏది చెప్పిన ప్రొఫెషనల్ లాగా అర్ధం చేసుకునేవాడు,పెద్దగా మాట్లాడే వాడు కాదు.అదే హాస్టల్ నుంచి ఇంకో ముగ్గురు పిల్లలు కూడా act చేసారు సినిమా లో.ఆ రోజు తరువాత సంవత్సరం పట్టింది షూట్ పూర్తి చేయడానికి, ఎప్పుడు అడిగిన దివ్య దిశ wardens నుంచి ఎలాంటి  objection ఉండేది కాదు.మా లాస్ట్ డే షూట్ కూడా ఫకీర్ తోనే END అయింది. మీరా నాయర్ ని ఫాలో అయినందుకు మాకు మంచే జరిగింది.

vlcsnap-2015-08-03-20h08m35s366

మా ఇంకో బిగ్గెస్ట్ సపోర్ట్ DIGI POST,equipment రెంటల్ & పోస్ట్ production స్టూడియో.సాయి,రఘు & కళ్యాణ్ వీళ్ళు  ముగ్గురు నాకు ఎప్పటినుంచో క్లోజ్ ఫ్రెండ్స్.వీళ్ళు నన్ను కథ కూడా అడగలేదు,మీరు ఏదో ప్రయత్నిస్తున్నారు చేయగలిగిన సపోర్ట్ చేస్తాము అని ఏ రోజు ఏం అడిగినా నో అనే  వాళ్ళు కాదు వీలైనంత ట్రై చేసేవాళ్ళు.ఫస్ట్ షెడ్యూల్ అంత స్మూత్ గా జరిగిపోయింది అంటే దానికి వీళ్ళు ఒక బిగ్ reason.ఎప్పుడు డబ్బులు ఇస్తే అప్పుడే తీసుకున్నారు కాని pressure పెట్టేవాళ్ళు కాదు.సినిమా ఎప్పుడు చూపిస్తారు శశి గారు అని మాత్రం ఇంకా అడుగుతుంటారు.ఇంకా బాకీ ఉన్నాము.

ఇలా మాకు మద్దతు ఇచ్చిన ఎంతో మంది ఉన్నారు,ఇంతకుముందు స్టోరీస్ లో కొంతమంది గురించి రాసాను.ఇంకా చాలా మంది గురించి రాయాలి.ఈ సినిమా తీస్తున్న 26 నెలలలో ఎంతో మంది కొత్త వాళ్ళని కలిసాము,మా రీచ్ పెరిగింది.త్వరలో “crowd funding campaign” లాంచ్ చేయబోతున్నాము,ఇంకో 5లక్షలు ఉంటె మా సినిమా అయిపోతుంది.మాకు సపోర్ట్ చేయండి చేయించండి…

“NEW WAVE తెలంగాణా CINEMA” మా కల…మా తాపత్రయం…