Menu

గుంతకల్ డేస్

నా మెమరీలోంచి fade out అయిపోతున్న 30ఏళ్ళ క్రితం జ్ఞాపకాలు,మీకు బోర్ కొట్టొచ్చు,మెలొ డ్రామా ఎక్కువ ఉండొచ్చు…ఓపికుంటే చదవండి…

Guntakal ఒకప్పుడు సీడెడ్ ఏరియాకి ఫిలిం distribution హెడ్ క్వార్టర్స్ లాంటిది.చాలా ఇంటరెస్టింగ్ టౌన్,రైల్వే జంక్షన్,ఆంగ్లో indians చాలా మంది ఉండేవారు,మార్వాడి & ముస్లిమ్స్ కూడా ఎక్కువే.డాడీ కూడా ఫిలిం డిస్ట్రిబ్యూటర్,ఇల్లు ఆఫీస్ కలిసే ఉండేవి.సో ఖాళీగా ఉన్నప్పుడల్లా ఫిలిం రీళ్లతో ఆడుకోవడం ఫిలిం magazinesలో హీరోల ఫోటోలు కట్ చేయడం ఈ రెండూ నా biggest hobbies.NTR combines ఆఫీస్ పేరు,డాడీ & ఇంకో ఇద్దరి ఫ్రెండ్స్ పేర్లు కలిసేట్టు పెట్టుకున్నారు,వీళ్ళందరూ ఎన్టీఆర్ ఫాన్స్ కూడా.అప్పట్లో NTR fans కాని వాళ్ళు ఎవరూ లేరు అన్నట్టు ఉండేది.ఎన్టీఆర్ ప్రభంజనమే ఎటు చూసినా.రాయలసీమ టూర్ వేస్తున్నపుడు guntakal కూడా వచ్చింది చైతన్య రధం,మా ఇల్లు మెయిన్ రోడ్ మీదే ఉండేది,ఆ రోడ్ మీదే వెళ్ళాలి, విపరీతమైన జనం,ఎక్కడి దాక వచ్చిందో,ఇంకేంతసేపట్లో గుంటకల్ రీచ్ అవుతుందో అని land line లో updates,నాకు గుర్తున్నంత వరకు మమ్మీ & ఫ్రెండ్స్ మా ఇంటి ముందు NTR కి హారతి ఇచ్చారు.అదే ఫస్ట్ టైం NTR ని చూడటం.ఈ backdrop లో సినిమా చేయాలని plan,Period కదా కాస్త డబ్బులు ఎక్కువ కావాలి. ట్రై చేస్తా.

గుంటకల్ అనగానే “నన్నారి” గుర్తొస్తుంది,రాయలసీమ స్పెషల్ డ్రింక్ అనుకునే వాణ్ణి,చాలా రోజుల తరువాత విజయవాడ వెళ్ళినపుడు తెల్సింది “సుగంధి సోడా” అంటే అదే అని.గుంతకల్ నన్నారి అంత కాకపోయినా ఇది కూడా ఓకే అనిపించింది.ఎపుడో rare గా నన్నారి  తాగటం ఒక excitement,తయారు చేయటం దగ్గరనుంచి తాగటం ఫినిష్ చేసి ఒక “బ్రేవ్” మనే దాక ఏదో ఆనందం,అసలు ఫస్ట్ సిప్ తగలగానే ఆహా అన్నట్టు ఉండేది.

డాడీ వాళ్ళ ఫ్రెండ్ circle చాలా పెద్దది,ఈ ఫ్రెండ్స్ లో రైల్వే employs కూడా ఉండేవాళ్ళు,నాకు గుర్తున్నది అనిల్ & రామచంద్ర అంకుల్.వీళ్ళలో ఒకళ్ళు నాకు చెల్లికి “మమ్మీ డాడీ” అని పిలవటం అలవాటు చేసారంట.వీళ్ళందరూ ఎప్పుడు ఏదో activity లో busy గా ఉండేవారు.క్రికెట్ tournament,డ్రామాలు,పొద్దున్నే రైల్వే ఆడిటోరియంలో shuttle,ప్రతి వారం సినిమా రిలీజ్,NTR కబుర్లు…

రోజు సాయంత్రం మమ్మీ & ఫ్రెండ్స్ కలిసేవాళ్ళు,ఇంటికి అటు ఇటు అన్ని ఫిలిం ఆఫిసులే.మా ఇంటి పక్కనే విక్రం అంకుల్ వాళ్ళ ఇల్లు,చాలా పెద్దది.బయట పెద్ద అరుగు ఉండేది.వాళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటే మేము ఆటల్లో బిజీ,మోస్ట్ exciting “తాతమ్మ కథలు”,అక్కడ కలిసినపుడల్లా ఫ్రెండ్ కాంతి వాళ్ళ తాతమ్మ మాకు కథలు చెప్పేది, వేరి ఓల్డ్ లేడీ.చాలా చార్మింగ్ గా ఉండేది.కథలన్నీ మన పురాణాలే,ఆవిడ చెప్పినపుడు వినటం తప్ప నేను పురాణాలు చదివింది చాల చాల తక్కువ.నాకున్న knowledge అంతా అప్పుడు విన్నవి గుర్తున్నవే,అంత బాగా చెప్పేది,mesmerizing.ఒక రకంగా కథ “చెప్పటం” అనేది ఆవిడ నుంచి inspire అయిందే,ఎప్పుడన్నా తాతమ్మ చెప్పకపోతే  ఫ్రెండ్స్ కి కథలు నేను చెప్పే వాణ్ని.

పెనకచెర్ల డాం ఇంకో unforgettable మెమరీ,ఎందుకంటే నేను చూసిన first ఫిలిం షూటింగ్ అక్కడే.విక్రం అంకుల్ వాళ్ళు మోహన్ బాబు,నరేష్ హీరోస్ గా ఫిలిం మొదలుపెట్టారు,దాని ఓపెనింగ్ కి families అందరం వెళ్ళాము.ముహూర్తం షాట్ మోహన్ బాబు మీద విలన్స్ కి వార్నింగ్ ఇచ్చే డైలాగ్,కౌబాయ్ టైపు getup,గుర్రం మీద కూర్చుని ఉంటాడు“పులి పేరు చెప్పుకుని తిరిగే పిల్లి వెధవల్లారా మీరు నా అనుచరులా” ఈ డైలాగ్ పిల్లలందరం practice చేసి గెస్ట్ హౌస్ దగ్గర చిన్న గేటు ఉంటే దాని మీద కూర్చుని అటు ఇటు ఊగుతూ డైలాగ్ “ఆట” ఆడుకున్నాం.ఈ సినిమా లో హీరోయిన్ ముచ్చెర్ల అరుణ,అప్పుడే సీతాకోక చిలక హిట్ ఐంది అనుకుంట,లేడీస్ & పిల్లల్ని పొద్దున్నే ఆమె రూంకి తీసుకెళ్ళారు,షూట్ కి రెడీ అయి టిఫిన్ చేస్తోంది,బయటనుంచి అరుపులు “సీతాకోక చిలక” బయటకు రావాలి అని,dam కి వచ్చిన టూరిస్ట్లు, చాలా మందే ఉన్నారు.Room ఫస్ట్ ఫ్లోర్ లో,అరుణ బయటకి వెళ్లి వాళ్ళందరికీ చేతులు ఊపగానే పిచ్చేక్కిపోయారు.

మా స్కూల్ రోటరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్,నాకు వచ్చిన కాస్త ఇంగ్లీష్ ఈ స్కూల్ వల్లే.4th క్లాసు వరకు ఇంగ్లీష్ మీడియం,టీచర్స్ చాలా బాగా చెప్పేవాళ్ళు.స్కూల్ నుంచి నాకు గుర్తున్న ఒకే ఒక ఫ్రెండ్ బృందా,క్లాసు ఫస్ట్ ఎప్పుడూ ఆ అమ్మాయే.నేనెలా చదివేవాణ్ణొ గుర్తు లేదు.కోన “శంకర భరణం” డైరెక్టర్ ఉదయ్ నేను రూం లో కలిసి ఉంటున్నపుడు ఒకసారి గుంటకల్ టాపిక్ వచ్చింది,ఉదయ్ చాలా excite అయ్యాడు,ఎందుకంటే ఉదయ్  కూడా అదే టైం లో గుంటకల్ లో వాళ్ళ మామయ్య వాళ్ళింట్లో ఉండి చదువుకుంటున్నాడు.వాళ్ళ మామయ్య కూడా ఫిలిం డిస్త్రిబ్యుటరె.

క్రౌన్,రీగల్,ప్రసాద్,వెంకటేశ్వర నాకు గుర్తున్న థియేటర్స్,చాలా సినిమాలు చూసేవాళ్ళం.ఫిల్మ్ distributor family అంటే అదొక advantage ప్రతి ధియేటర్ లో V I P treatment,టికెట్స్ దొరకకపోవడం ఉండదు,మంచి సీట్స్ దొరుకుతాయి.Houseful అవకపోతే ఫ్రీ గా చూసేయోచ్చు.వెంకటేశ్వర ధియేటర్ లో ఫిలిం మొదలవటానికి ముందు స్క్రీన్ చుట్టూ డిస్కో లైట్స్ ఆన్ అవగానే కర్టెన్ స్లో గా పైకి వెళ్ళేది,దానితో పాటు ఒక signature మ్యూజిక్,highlight.ఇది మిస్ అయితే చాలా disappointing గా అనిపించేది.ఆ music ట్రాక్ కోసం ఇంకా వెతుకుతున్నా.NEWS REEL almost ప్రతి ఫిలిం beginning లో ఉండేది,ఏం చూసానో గుర్తులేదు కానీ దాని మీద వచ్చే ఒక peculiar వాయిస్ ఓవర్ మాత్రం గుర్తు ఉంది.మా సినిమా శీష్ మహల్ single screens మీద వచ్చే sequence తో end అవుతుంది.ఇది single screens కి మా tribute.

నా ఫస్ట్ స్కూల్,సినిమా,షూటింగ్,స్టార్ ని కలవటం,NTR ని ఫస్ట్ టైం చూడటం…ఇంకా చాలా ఫస్ట్ లు ఉంటాయి రాసుకుంటూ పోతే,ఒక సీక్రెట్ “ఫస్ట్” థింగ్ కూడా ఉంది…కానీ సీక్రెట్…నేను కూడా అందరి directors లాగ టిపికల్ గా ఫస్ట్ సినిమా అయ్యాక గుంటకల్ Nostalgic Tour వెయ్యాలి నా సినిమా ఎలాగూ అక్కడ రిలీజ్ అవదు… డాడీ ఫ్రెండ్స్ & ఇంకా ఎవరినైనా నా టైం వాళ్ళని పట్టుకోగలిగితే  శీష్ మహల్ ఒక షో వేస్తా.