Menu

శంకర్ తుమ్మల

డబ్బులు లేకపోయినా మేము తీయాలనుకుంటున్న ఈ సినిమాలో ఎవరిని అగౌరవ పరిచే ఉద్దేశం లేదు,Just for fun…

నేను మా శీష్ మహల్ కుర్రకుంకలు వాళ్ళ మిత్రబృందం ఒక రోజు మధ్యాహ్నం కూర్చుని సరదాగా ఒక లైన్ తో ఈ కథ మొదలుపెట్టాము.USలో మంచి జాబ్ వదిలేసి సినిమా తియాలనుకున్న ఒక ఇంజనీర్  ఫస్ట్ ఫిలిం చేసినపుడు ఎం జరుగుంటుంది?ఇదే ఫిలిం అయితే ఎలా ఉంటుంది?అది కూడా subtle spoof అవ్వాలి…ఒక గంటలో తలా ఒకటి add చేస్తూ పోయారు ఫైనల్ గా ఇది తయారు అయింది…. పూర్తిగా అవలేదు…ఇదే ఫైనల్ కాదు…

శంకర్ తుమ్మల 29, అర్ధరాత్రి ఫ్లైట్ దిగుతాడు US నుంచి,చాలా luggage ఉంటుంది.బయటకి వస్తుంటే అతడి కళ్ళు దేనికోసమే వెతుకుతుంటాయి( కళ్ళ మీద Closeup).ఫ్రెండ్స్ కనిపిస్తారు శంకర్ కళ్ళలో ఆనందం,10-12 మంది ఫ్రెండ్స్ అందరూ మగాళ్లే. ఒకళ్ళు ఇద్దరు ఫ్లవర్ బొకేస్ కూడా తెచ్చారు.శంకర్ వాళ్ళ దగ్గరకి వచ్చాడు అందరూ hug  చేసుకుని, “welcome to ఇండియా మామా” ఎం రా సన్నగ అయిపొయినవ్ “ ఇలా అందరూ ఏదో ఒకటి ఖచ్చితంగా అనాలి అన్నట్టు అంటుంటారు,ఒకడు ఏదో లేకి బూతు జోకు వేస్తే శంకర్ నవ్వేసి వాడి భుజం మీద “ఆప్యాయంగా”కొట్టాడు.మూడు కార్లలో ఇంటికి బయలుదేరారు.ఈలోపే శంకర్ వాళ్ళ అమ్మ నాన్న ఫోన్ చేస్తే మాట్లాడాడు.శంకర్ వాళ్ళ నాన్న BHELలో employ, ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడినుంచే.చిన్నప్పటి నుంచి పెరిగిన BHEL township అంటే శంకర్ కి “పిచ్చ” ప్రేమ.

ఇంటికి చేరుకున్నారు,అమ్మ దిష్టి తీసింది.అందరూ లోపలికి వెళ్ళారు,గోల గోలగా ఉంది.శంకర్ వాళ్ళ అమ్మ,నాన్న  అందరికి పాయసం ఇస్తున్నారు,శంకర్ పెళ్లి మీద ఫ్రెండ్స్ మళ్ళీ కొన్ని లేకి జోక్స్ వేసారు.

పాయసం తినేసాక bikes scooties మీద BHEL రోడ్ల మీద పడ్డారు.అన్ని బళ్ళు బాబాయ్ చాయ్ కొట్టు దగ్గరకి వచ్చి ఆగాయి, శంకర్ & ఫ్రెండ్స్ ఫస్ట్ చాయ్ తాగింది అక్కడే,వాళ్ళేంటి BHEL లో యూత్ అంతా అక్కడే “తొలి చాయ్”.అలా బాబాయ్ తో అనుబంధం మాములుది కాదు.శంకర్ కి ఇంకొంచెం ఎక్కువ.బండి దిగగానే శంకర్ కొట్టులోకి వెళ్లి టీ పెడుతున్న బాబాయ్ ని చూసి “బాగున్నావా బాబాయ్” అన్నాడు,ఆయన తలెత్తి శంకర్ వైపు  రెండు సెకన్లు చూసి సడన్ గా మొహం మీద నవ్వుతో “బాగున్నాను బాబు” అని మళ్ళీ టీ కాయటం లో బిజీ అయిపోయాడు.

చాయ్ కొట్టు బయట కబుర్లు నడుస్తున్నాయి,శంకర్ మాత్రం ఎటో చూస్తున్నాడు,చెట్ల మీద నుంచి పూలు రాలుతున్నాయి, ఒక ఎండిన కర్రముక్క విరిగి శంకర్ టీ గ్లాస్ లో పడింది,తీసేసి దాని వైపు చూసి పక్కన పడేసి మళ్ళీ టీ తాగుతున్నాడు. గుడిలోంచి భగద్గీత వినిపిస్తోంది, అటు వైపు చూస్తున్నాడు,గుడి లోంచి ఒక చిన్న పాప పట్టు లంగా జాకెట్ వేసుకుని వాళ్ళ అమ్మతో బయటకు వస్తున్నారు . (శంకర్ లో ఏదో చిన్న ఫీలింగ్). ఇంకో రౌండ్ టీ మొదలైంది, ఒక ఫ్రెండ్ అడిగాడు “ఎప్పుడు రా మళ్ళీ వెళ్ళేది”? శంకర్ ఆన్సర్ చెప్పటానికి టైం తీసుకున్నాడు, రెండు సిప్పుల తరువాత చెప్పాడు “నేను వెనక్కి వెళ్ళటం లేదు” ఫ్రెండ్స్ అందరూ షాక్ & surprise… “బిజినెస్ చేస్తావా?” ఇక్కడేమైనా జాబు దొరికిందా”? “ఇక్కడ వేస్ట్ రా “ తలా ఒకటి చెపుతున్నారు… శంకర్ మళ్ళీ చాలా gap తీసుకున్నాడు,ఫ్రెండ్స్ అందరూ టెన్స్ గా వెయిట్ చేస్తున్నారు…అప్పుడు చెప్పాడు “ నేను ఇక్కడే ఉండి సినిమా తీద్దాం అనుకుంటున్నా” ఫ్రెండ్స్ ఇంకా షాక్ అయ్యారు…తెల్లవారిపోయింది… అందరూ బళ్ళ మీద వెనక్కి వెళ్లిపోతున్నారు. శంకర్ కాలనీ వైపు చూస్తూ calm గా కూర్చున్నాడు…  

తన fav డైరెక్టర్ పేరు తన పేరు చాలా దగ్గరగా ఉండటం శంకర్ కి చాలా HAPPY.అంత “అందమైన” సినిమాలు తీసే దర్శకుడి “టచ్” పోయిందని అతను కూడా భారీ సినిమాల వైపు వెళ్లిపోయాడని బాధపడుతుంటాడు.ఆ తపనతో US లో నలిగిపోతూ ఉద్యోగం  చేయలేకపోతుంటాడు. Society కి అటువంటి సినిమాలు చాలా అవసరమని శంకర్ నమ్మకం. ఎవరికైనా చెపితే ఎగతాళి చేస్తారేమో అని చెప్పని కోరిక ఒకటుంది శంకర్ కి…DIRECTOR అవాలని,పేర్లు మాత్రమే దగ్గరగా ఉండటం కాదు శంకర్ birthday కూడా “ఆ దర్శకుడి” birthday రెండు రోజుల తరువాత,ఇవన్ని coincidence లా అనిపించలేదు అతనికి.ఎవరికీ తెలియకుండా filmmaking పుస్తకాలు  తెచ్చుకుని చదివేస్తుంటాడు.ఎలాంటి సినిమా తీయాలి అని మళ్లి కొన్ని రోజులు మధన పడ్డాడు.Final గా తన అభిమాన దర్శకుడి HIT సినిమాని రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యి “ANANTH  కమ్మటి మజ్జిగలాంటి సినిమా” అనే టైటిల్ పెట్టి వర్క్ చేయడం మొదలుపెట్టాడు.రైట్స్ లేకపోయినా పర్లేదు,సినిమా తీసి ఆయనకి చూపించి ఒప్పించాలని ఫిక్స్ అయిపోయాడు.
మొదటి భాగం సమాప్తం