Menu

కుల పిచ్చి

నేను దళితుడిని కాదు,అగ్రవర్ణం వాణ్ని.నేను పెద్దగా చదువుకోలేదు,10th తరువాత పాలిటెక్నిక్ జాయిన్ అయి ఫైనల్ yearలో attendance లేక detain అయ్యాను.ఇది 91-95 మధ్య,మా కాలేజ్ లో ఎప్పుడూ కుల గొడవలు లేవు, ఉన్నా నాకు తెలియలేదేమో.మా ఫ్రెండ్స్ లో ఎవరికీ ఎవరి కులమెంటొ తెలియదు,పేరు వెనక TAG తప్ప.టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఉన్మాదం పెరిగిపోతోంది…అడ్డూ అదుపూ లేని ఉన్మాదం…రోజు రోజుకీ మనుషులు regressive అయిపోతున్నారు…ఎటు చూసిన కులం మాటలే…fb,watsap,twitter ఎక్కడ చూసిన కుల గొడవలే…మన గొప్ప సంస్కృతి మన గొప్ప దేశం అని ప్రతి “దినోత్సవానికి” గుండెలు బాదుకుంటాం గాని ఇదేమి దేశం ఇదేమి సంస్కృతి? ఇంకా మనుషుల్లో “పరాయి మనుషులు” ఉన్నారు,వాళ్ళని దూరంగానే పెట్టాలి అనే ఆలోచనే దుర్మార్గం.”దళిత గోవిందం” ఒక్కటి చాలు మనం ఎంత వెనకబడి ఉన్నామో చెప్పటానికి?అదేమి దిక్కుమాలిన కార్యక్రమం?

టెక్నాలజీతో ప్రోగ్రెస్ అవుతున్నాము అనే ఆనందం తప్ప,మనుషులుగా రోజు రోజుకీ కుచించుకుపోతున్నాము. ఎందుకింత ద్వేషం?ఏం సాధించటానికి?ఈ కులోన్మాదం మతోన్మాదం కన్నా డేంజరస్ అయిపొయింది.especially అగ్రవర్ణ పిల్లల్లో…ఇది ఖచ్చితంగా పేరెంట్స్ తప్పే…ఈ కులోన్మాదం మనందరం ప్రేమించే తల్లితండ్రులు ఎక్కిస్తున్నదే…

అసలు దీనికి పరిష్కారం ఉందా?కష్టమే…కులాలు మతాలు తెల్లోళ్ళు నల్లోళ్ళు ఇలాంటివి ఎప్పటికీ ఉంటాయి…పిచ్చి జనం పిచ్చెక్కిపొయిఉన్నారు…everyone ఇస్ restless…ప్రపంచం అంతా అట్టుడుకిపోతోంది.

పిల్లలే మార్చగలరు…వాళ్ళని ఎడ్డి కుల పిచోళ్ళలా పెంచకండి…ALL INDIANS ARE MY BROTHERS AND SISTERS అనే pledge మర్చిపోయారా?పిజ్జాలు తినిపించుకోండి,పెప్సీలు ఇప్పించండి,మీ పిల్లలు మీ ఇష్టం. దయచేసి కులపిచ్చిని మాత్రం ఎక్కించకండి.ఈ ఉన్మాదం మీ పిల్లల్ని కూడా నాశనం చేస్తుంది.

నేను సినిమా వాణ్ని…మన తెలుగు సినిమా మొత్తం కుల పిచ్చితో నిండిపోయింది.ఒక రకంగా మన youthకి పట్టిన కుల పిచ్చికి కారణం సినిమా ఒకటి.మరీ ఇంత దరిద్రమా?”కుల”హీరోల సినిమాల రిలీజ్ తో కొట్టుకోవడమేనా తెలుగు సినిమా అంటే?ఎంత దిగజారిపోయాం…సినిమా is influential,కానీ ఇలానా?కుల పిచ్చి తప్పితే తెలుగు సినిమాకి వేరే agenda లేదు అనిపిస్తుంది…

తెలంగాణా వచ్చినాక అయిన ప్రాంతీయ సినిమాకి ఏదో ఒక్క వరం అయినా వస్తుంది అని ఎదురుచూస్తున్న… రెండేళ్ళు అవుతోంది…నేనెప్పటికీ ఆశతోనే బతుకత…

సినిమాతో ఇలాంటి చావు రాతల “రొమాంటిక్ ఆత్మహత్యలు” ఆపడానికి ట్రై చేస్త

One Response
  1. Murthuja Pattan June 6, 2016 /