Menu

నిర్మాతలే పూనుకోవాలి

“film ప్రొడ్యూసర్ అంటే ఎక్కువ వడ్డీలకి అప్పులు తెచ్చేవాడు,film making తో ఏం సంబంధం లేదు, డబ్బులు తేవాలి అవి వెనక్కి రావాలి,ఈ రెండు targets మధ్యలో నలిగిపోయే వాడే నిర్మాత“ ఒక సీనియర్ TFI ఫ్రెండ్ చెప్పిన మాట ఇది.

“రెమ్యునరేషన్ తీసుకునే వాళ్ళందరూ సేఫ్” ఇంకో Tfi

నిర్మాత తప్ప అందరూ సేఫే

నేను నా ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ని అడుగుతుంటా “ఏంటి బాసు త్రివిక్రమ్ కి పది కోట్లు అని ఒక website లో రాశాడు,అసలు అంత డబ్బు ఎలా ఇస్తారు?అంతా వైట్ మనీ ఇస్తారా?దీంట్లో ఎమన్నా బ్లాక్ ఉంటుందా?” తెలుగు సినిమా budgets అన్ని వింటే 60% remunerationsకి మిగతా productionకి స్పెండ్ చేస్తున్నట్టు ఉంటుంది.సో కాల్డ్ కమర్షియల్ సినిమా అన్నిట్లో ఇదే జరుగుతుంది అనుకోండి.  

Hyderabad లో కూర్చుని తమిళ్ సినిమా ఎంత అద్భుతంగా ఉంది అనుకుంటున్న నాకు ఈ మధ్య నిర్మాత SP CHARANతో ఒక ఇంటర్వ్యూ చేసినాక  భ్రమలు అన్ని పోయాయి.నిర్మాత పరిస్థితి ఎక్కడా బాలేదు అంటాడు ఆయన.మరి ఇన్ని సినిమాల మీద డబ్బులు పెడుతున్న పిచ్చోళ్ళు ఎవరు? అది సినిమా తీద్దామనే పిచ్చా?డబ్బుల కోసమా?stars తో తిరగడం కోసమా?పేకాట లాంటి బిజినెస్ లో ఎందుకు invest చేస్తున్నారు?నో డౌట్ ఇది ఒక flamboyant బిజినెస్…సినిమా వాడు ఫేమస్ అవటం ఈజీ…అది ఏ డిపార్ట్మెంట్ అయినా కావచ్చు…

ఇన్ని కోట్ల రెమ్యునరేషన్స్ కి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తున్నారు?ఎంతో కొంత “బ్లాక్” ఉండే ఉంటుంది? నిర్మాతకి తప్పదు…అన్ని కోట్లు పెట్టి తీసాక అది ఆడుతుందో లేదో అనే confusion లో ఉన్న థియేటర్స్ అన్ని నింపేయడం…బాహుబలి రిలీజ్ టైం లో ఏం జరిగింది?ఏ ధియేటర్ లో చూసిన అదే సినిమా… జనాలకి నచ్చింది కాబట్టి workout అయింది…తేడా కొట్టుంటే?

“సౌఖ్యం” అనే సినిమా మార్నింగ్ షో అయ్యేసరికి ఫ్లాప్ అయిపొయింది,ఆ సినిమాని విడుదల చేసిన ప్రతోడు లాసే…BB మగాడివోయ్ మార్నింగ్ షో తో బ్లాక్ బస్టర్ అయిపొయింది…చిన్న సినిమా ఎప్పుడూ సేఫ్ బెట్టె..పోతే తక్కువలో పోతుంది… వస్తే double triple లో వస్తుంది…చిన్న సినిమాని సపోర్ట్ చేయండి సార్…చేస్తున్నారు…కానీ ఇంకా సపోర్ట్ కావాలి.

సినిమాకి 10కోట్లు అడిగే హీరోని దర్శకుడిని film production లో భాగం చేయండి సార్, 30% ఇవ్వండి మిగతాది వాడి investment,ఇవి మీరు చేయటం లేదు అని కాదు…filmmakingలో అందర్నీ involve చేయండి,కనీసం ఈ సినిమా workout అవకపోతే అనే భయం అయినా ఉంటుంది…నా డబ్బులు నాకు వచ్చేసాయి అనుకునే వాళ్ళని encourage చేయకండి…

మీకు సలహాలు ఇచ్చే అంత సీన్ లేదు కాని…ఏదో నా గోల…