Menu

బెజావాడ BLAK -2

నేను తప్ప అందరూ ఏమైపోయారు?ఇది నిజమైతే,ఎన్ని రోజులు?మళ్లీ అందరూ వచ్చేస్తారా ?వెనక్కి రావడానికి ఎక్కడికైనా వెళ్తే కదా,ఏదో జరిగింది,aliens వచ్చి ఎత్తుకుపోయారా ?నన్ను ఎందుకు వదిలేసారు?అదేదో willsmith సినిమా లాగ ఉంది,పేరు గుర్తుకు రావడం లేదు,కనీసం కుక్కలైనా ఉన్నాయా?అటు ఇటు చూసాడు, కుక్కలు లేవు.టీ అయిపొయింది,కప్ పక్కన పెట్టి ఇంకో సిగరెట్ అంటించాడు,పెట్టెలో చూస్తే ఇంకో మూడు ఉన్నాయి. సిగరెట్ తాగుతూ రోడ్ వైపే అటూ ఇటూ చూస్తున్నాడు,ఎవరు రావటం లేదు.ఎలాంటి చప్పుడు లేదు.cafe తీసే ఉంది అంటే నాలుగు నాలుగున్నర వరకు అందరూ ఉన్నారు,ఆ తరువాతే ఏదో జరిగింది  కేఫ్లో టేబుల్స్ వైపు చూసాడు,అక్కడక్కడ తాగిన cups  ఉన్నాయి.

IMG_20150924_135433_edit

మూల టేబుల్ మీద సిగరెట్ పాకెట్ దాని పైన గ్రీన్ లైటర్ ఉన్నాయి,టేబుల్ దగ్గరకి వెళ్లి pack open చేసాడు,ఒకటి తక్కువ పెట్టె సిగరెట్లు.జేబులో పెట్టుకున్నాడు,వర్షం తగ్గింది.రూం వైపు నడుస్తున్నాడు,urgentగా ఎవరో ఒకళ్ళకి కాల్ చేయాలి,ఎవరికి చేయాలి?అందరూ disappear అయిపోయుంటే?ఇటువంటి situationలో కూడా ఉదయ్ ఒక్కడే తప్పించుకోగలడు,తన నెంబర్ లేదు,మంజు aliens అడిగిన వెంటనే space ship ఎక్కేసుంటాడు,పిచ్చి adventurist.అయినా ఏం ఆలోచిస్తున్నా నేను… ఆలోచిస్తూ అపార్ట్ మెంట్ దాటేసి petrol bunk దాక వెళ్ళిపోయాడు, ఆగి మళ్ళీ ఏదో ఆలోచించి ముందుకే నడవటం మొదలుపెట్టాడు.Green bawarchi కూడా ఓపెన్ ఉంది,మనుషులు లేరు. రోడ్ దాటి గ్రీన్ బావర్చి వైపు వెళ్తున్నాడు,కరెక్టే,నాలుగు నాలుగున్నర మధ్య ఏదో జరిగింది.cash counter మీద ఒక ఫ్లాస్క్ ఉంది,ఓపెన్ చేసాడు,వేడి టీ ఉంది.కప్ తీసుకుని పోసుకున్నాడు,గల్లా పెట్టె open ఉంది.డబ్బులు ఉన్నాయి, పదులు, వందలు, ఐదొందలు…. చూస్తున్నాడు,ఇప్పుడు డబ్బులు అవసరమా? చేతికి పట్టినన్ని నోట్లు తీసుకుని జెర్కిన్ జేబులో పెట్టుకున్నాడు.టీ తాగేసి అక్కడే కూర్చుని ఏం చేయాలి ఇప్పుడు?నాలాగా తప్పించుకున్న వాళ్ళు ఇంకెక్కడైనా ఉంటారా ?రూంకి వెళ్లి ఉన్న మందు తాగేసి పడుకుంటే లేచేసరికి అంతా నార్మల్ అయిపోతే ?ఇది కలో /illusion అయితే …మంగ వైపు నడుస్తున్నాడు,అన్ని షాప్స్ closed.మంగ టిఫిన్ సెంటర్ ఓపెన్ ఉంది….ఖాళీగా …లోపలికి వెళ్ళాడు,డైరెక్ట్ కిచెన్ దగ్గరకి  వెళ్ళిపోయి ఇడ్లి గిన్నె ఓపెన్ చేసాడు,ఉన్నాయి.ప్లేట్ లో పెట్టుకుని చట్ని వేసుకుని అక్కడే కూర్చుని తింటున్నాడు.తను తింటున్న సౌండ్ తప్ప ఇంకేం వినపడటం లేదు.గోడ మీద గడియారం కూడా ఆగిపోయి ఉంది.ఇంకొంచెం సేపు మెలకువ గా ఉంటె పిచ్చెక్కడం ఖాయం…రూం కి వెళ్లి మందు కొట్టి పడుకోవాలి.జేబులో తాళాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నాడు.మళ్లీ కిచెన్ లోకి వెళ్లి,మిగిలిన ఇడ్లీలు అన్ని carry bag లో వేసుకుని,fridge లోంచి లస్సి,minute maid బాటిల్స్,కొన్ని వాటర్ బాటిల్స్ తీసుకుని మూడు నాలుగు పెద్ద carry bagsలో వేసుకుని రూంకి బయలుదేరాడు,చాలా వెయిట్ ఉంది,చేతులు లాగేస్తున్నాయి.green bawarchi దగ్గర ఆగి సిగరెట్ అంటించాడు,చాలా ఆటోలు అడ్డదిడ్డంగా ఆపేసి ఉన్నాయి.ఒక ఆటోలో bags పెట్టుకుని స్టార్ట్ చేయకుండా డౌన్ లో రూం వైపు వెళ్ళిపోతున్నాడు ఆటో తోలాలి అనే కోరిక ఇలా తీరిపోతోంది,నేను ఒక్కడినే ఇలా బతికేయగలనా ? రూం టర్నింగ్ దాకా స్టార్ట్ చేయకుండానే వెళ్ళిపోయింది.స్టార్ట్ చేసి ఎక్కించేస్తే? కీస్ ఉన్నాయి,ఆటో స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ లో అపార్ట్ మెంట్ up ఎక్కించేసాడు.లిఫ్ట్ దగ్గర ఆపి సామాన్లు అన్ని పెట్టుకుని ఫస్ట్ ఫ్లోర్ లో రూంకి వెళ్ళాడు.ఫోన్ తీసుకున్నాడు,ఇంకా రీస్టార్ట్ అవుతోంది.పక్కన పడేసి కిచెన్లో సిలిండర్ వెనక దాచిన క్వార్టర్ Mansion House తీసుకుని ఒక large ఫిక్స్ చేసుకుని వచ్చి  laptop ఆన్ చేసాడు.ఫన్కిరణ్ తో చూసిన The Martian సినిమా గుర్తొస్తోంది.“నేను కూడా matt damon లాగా పంటలు పండించాలా ?బుల్బలు కి ఇవన్ని బాగా తెల్సు,వంట కూడా వచ్చు,తను ఒక్కడు ఉండి ఉంటె బాగుండేది?వాట్ ద ఫక్ man…నేను ఎలాంటి situation లో ఉన్నానో నాకు అర్ధం కావటం లేదు… ఇంకొన్ని గంటల్లో పిచ్చెక్కుతుంది…లేదా ఆల్రెడీ నేను పిచ్చి వాణ్ని అయిపోయాను.నాకెందుకు భయం వేయటం లేదు…ఇంకా దిగలేదు…తొందరగా నిద్రపోవాలి…ఫోన్ తీసి చూసాడు,ఇంకా స్టార్ట్ అవలేదు. మంచం మీదకి విసిరేసాడు అది బౌన్సు అయ్యి అటు పక్క నేల  మీద పడింది.

( ఇంకా ఉంది )