Menu

బెజవాడ BLAK

గమనిక : ఇది మేము తీయాలి అనుకుంటున్న Indie Sci-fi సినిమా స్టొరీ.as story progresses “మధ్య తరగతి సంస్కారులు” తట్టుకోలేని Obscenity ఉండే ఛాన్స్ ఉంది,మీ ఇష్టం.

48గంటల నుంచి ఆపకుండా వర్షం.హైదరాబాద్ మునిగిపోతుందేమో అనిపించేంత వర్షం.stanley.k రాత్రి half పైనే బ్రాందీ తాగాడు.time ఎంతైందో తెలియదు కానీ తెల్లారిపోయింది.stanley లేచాడు,రూంలో ఎవరూ లేరు….రాత్రి 10-12 మంది ఉండాలి. ఫోన్ చూసాడు,Dali పెయింటింగ్.

14-optical-illusion-paintings-by-salvador-dali

రాత్రి బుల్బలు Salvador Dali గురించి చెపుతూ తన ఫోన్ లో ఉన్న images చాలా పంపించాడు.Back ప్రెస్ చేసాడు అవటం లేదు,టచ్ ట్రై చేసాడు,ఫోన్ hang అయిపొయింది.battery పీకి,పెట్టి ON చేసి బెడ్ మీద విసిరేసి,bathroom లోకి వెళ్ళాడు.Table మీద నేల మీద రూం అంతా బీర్స్,విస్కీ,బ్రాందీ,జిన్,బ్రీజర్స్,సగం తాగిన గ్లాసులు,సగం తిని వదిలేసిన తందూరీ,బిర్యానీ ప్లేట్లు,సిగరెట్ పాకెట్స్…..బాత్రూంలో అద్దం ముందు stanley,కళ్ళు ఉబ్బిపోయి ఉన్నాయి.తన reflectionని చూస్తూ సిగరెట్ తాగుతున్నాడు.సోప్ లేక షాంపూతో మొహం కడిగాడు.బయటకి వచ్చి మొహం తుడుచుకుని తాళం వేసి మెట్లు దిగుతున్నాడు,apartment building అంతా చాలా silent గా ఉంది….watchman రూం దాటుతూ అటు చూసాడు,watchman కూడా లేడు.Apartment డౌన్ దిగి main road మీదకి వచ్చాడు,ట్రాఫిక్ లేదు,ఒక్క మనిషి కూడా లేడు.stanleyకి ఏం అర్ధం కావటం లేదు,ఇంకా మత్తుగా ఉంది,climate కూడా dark cloudsతో thick గా ఉంది.మంచు పడుతున్నట్టు ముసురుకుని ఉంది.Stanley సిగరెట్ అంటించి metropolitan కేఫ్ వైపు నడుస్తున్నాడు.రోడ్ పక్క చిన్న కాలువలాగా నీళ్ళు పారుతున్నాయి.ఆ నీళ్ళలోనే నడుస్తున్నాడు.అన్ని షాప్స్ మూసేసి ఉన్నాయి.ICICI bank వైపు చూసాడు,సెక్యూరిటీ కూడా లేడు.ఫోన్ కోసం జేబులో చెయ్యి పెట్టాడు,లేదు,బెడ్ మీద విసిరేయటం గుర్తొచ్చింది.టైం ఎంత అయుంటుంది? నేను మరీ ఎర్లీగా లేచి వచ్చేసానా?దూరం నుంచి చూస్తే కేఫ్ తీసే ఉంది,రోడ్ దాటటానికి ఆగి ఏమన్నా వెహికల్ వస్తుందేమో అని చూసాడు,అసలు ఎలాంటి సౌండ్ లేదు,నిశ్శబ్దం గా ఉంది.ఎంత ఎర్లీ అయినా ఆటోస్ కూడా ఎందుకు లేవు రోడ్ దాటాడు,కేఫ్ దగ్గరకి వెళ్తే అక్కడ కూడా ఎవరూ లేరు…కానీ కేఫ్ ఓపెన్ ఉంది,లైట్స్ వేసే ఉన్నాయి….సిగరెట్ తాగుతూ ఒక టేబుల్ లో కూర్చున్నాడు.చాయ్ తాగాలని ఉంది,ఇదంతా నిజమా,కలా?ఏమైపోయారుఅందరూ?గట్టిగా ఒక పఫ్ లాగి కళ్ళు మూసుకున్నాడు,అలానే సిగరెట్ ఫినిష్ చేసాడు.కళ్ళు మూసుకున్నపుడు ఏమైనా సౌండ్స్ వినపడతాయి ఏమో అని concentrate చేసాడు,లేదు ఎలాంటి సౌండ్స్ లేవు, hyderabadలో అందరూ మాయమై పోయారా?లేదు,నేను ఇంకా లెగవలెదు,ఇది కలే …. కిచెన్ దగ్గరకి వెళ్ళాడు,ఎవరూ లేరు.కింద నుంచి దూరి లోపలి వెళ్లి స్టవ్ అంటించాడు,దాని మీద పాలు ఉన్నాయి.పాలు మరుగుతున్నంత సేపు పాల వైపే చూస్తున్నాడు,మైండ్ లో ఎలాంటి ఆలోచనలు లేవు.పొంగుతున్నపుడు ఆఫ్ చేసి కప్ లో పాలు పోసుకుని టీ dicaction పట్టి,బయటకు వచ్చి నిలబడి టీ తాగుతున్నాడు,వర్షం పెరిగింది.ఆలోచిస్తున్నాడు.నేను తప్ప అందరూ ఏమైపోయారు?ఇది నిజమైతే,ఎన్నిరోజులు?మళ్లీ అందరూ వచ్చేస్తారా?వెనక్కి రావడానికి ఎక్కడికైనా వెళ్తే కదా,ఏదో జరిగింది,aliens వచ్చి ఎత్తుకుపోయారా?నన్ను ఎందుకు వదిలేసారు?అదేదో willsmith సినిమా లాగ ఉంది,పేరు గుర్తుకు రావడం లేదు,కనీసం కుక్కలైనా ఉన్నాయా?అటు ఇటు చూసాడు,కుక్కలు లేవు. 

( ఇంకా ఉంది )