Menu

బెజవాడ BLAK-3

ఫోన్ తీసి చూసాడు,ఇంకా స్టార్ట్ అవలేదు.మంచం మీదకి విసిరేసాడు అది బౌన్సు అయ్యి అటు పక్క నేల  మీద పడింది.ఒక్క జంప్ లో మంచం మీదనుంచి ఫోన్ దగ్గరకి రీచ్ అయ్యాడు,తీసుకుని చూసాడు,ఏమి కాలేదు.బాల్కనీలో మర్రి చెట్టు ఊగుతుంటే ఆకుల మీద చినుకులు కింద పడుతున్నాయి.వాన ఆగింది,మబ్బులు అలాగే నల్లగా ఉన్నాయి.బాల్కనీ చుట్టూ తులసి,కనకాంబరం,చేమంతి, మిర్చి,టొమాటో, చేమ,కరేపాకు…ఇంకా మొలుస్తున్న చిన్న చిన్న మొక్కలు,అవేంటో తెలియదు.ఇవి కాక పూల మొక్కలు. వీటన్నిటి మధ్యలో ఒక గంజాయి మొక్క.

IMG_20151206_170123 IMG_20151206_170250 IMG_20151206_170526_edit IMG_20151206_170644 IMG_20151206_170817 IMG_20151206_171009 IMG_20151206_171121 IMG_20151206_171158 IMG_20151206_171253 IMG_20151206_171457

వర్షానికి తడిసి వాలిపోయి ఉన్నాయి.ఇక్కడ ఏం పండించొచ్చు?అయినా ఎవరూ లేరుగా ఏ షాప్ లోంచి అయినా తెచ్చేసుకోవచ్చు…ఈ apartmentలో ఫ్లాట్స్ ఓపెన్ ఉంటే  నెల రోజులు ప్రాబ్లం ఉండదు, ఓపెన్ లేకపోతే  చేయాలి ఎలాగైనా సెకండ్ పెగ్ పోసుకుని laptop ముందు కూర్చున్నాడు.On అయింది, wifi సిగ్నల్ లేదు,కేబుల్ పీకి డైరెక్ట్ గా పెట్టాడు.net రావటంలేదు.

music folder

AkiKarusmaki soundtracks

OLD SCARS playinghttps://www.youtube.com/watch?v=nfS4lTohYH0

సిప్ చేస్తూ రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకోవటానికి ట్రై చేస్తున్నాడు.బుల్బలు Dali గురించి,surrealism గురించి చెప్పాడు,అదేమీ గుర్తులేదు,Dali sex life గురించి చెప్పింది మాత్రమే గుర్తుంది, womanizer.

Amanda-Lear-and-Salvador-Dali-1-500x682నాలాగే మాయమవని అమ్మాయి ఎవరైనా సిటీలో ఎక్కడైనా ఉంటుందా?ఉన్నా ఎక్కడ ఉంటుంది?Auto వేసుకుని తిరిగితే?కనిపిస్తే ఏం మాట్లాడాలి?ఇద్దరమే ఉంటే ఒకరి అవసరం ఇంకొకళ్ళకి ఉంది.సో వెంటనే ఫ్రెండ్స్ అయిపోవచ్చు.సెక్స్ కి ఒప్పుకుంటుందా?”iam committed,i will wait for my boyfriend to come back”ఖచ్చితంగా ఇదే అంటుంది,ఆటోలో తిరగటం waste,మందు తాగి నిద్ర పోవాలి,లేచేసరికి ఇదంతా మాయమై అంతా నార్మల్ అయిపోవాలి…అయిపోతుంది…మూడో పెగ్.రాహుల్,రాకేష్  పేకాడుకున్నారు,రోహిత్ సినిమా చూసాడు,ఆర్కే,వ్యాస్ ఫోన్లో busy,బుల్బలు నాకు పాషా కి dali,picasso గురించి చాలా సేపు చెప్తూనే ఉన్నాడు,కిరణ్ చికెన్ వండుతున్నాడు.తరువాత ఏం జరిగింది ?సగం పెగ్  అయింది,బాల్కనీ లోకి వచ్చి సిగరెట్ అంటించాడు,సన్నటి చినుకులు పడుతున్నాయి…పక్కింటి బాల్కనీలో బట్టలు ఆరేసి ఉన్నాయి…గోడ దగ్గరకి వెళ్లి అటువైపు చూసాడు పేలిపోయిన టపాకాయలు,కాలి బూడిదైన చిచ్చుబుడ్లు,భూ చక్రాలు నిన్న సాయంత్రమే అంకుల్ & family దీపావళి మొదలుపెట్టారు, రేపు పండగైతే ఈ రోజే రచ్చ చేస్తున్నారు అని వాళ్ళని బండ బూతులు తిట్టుకున్నాం,అసలు అంత బాంబుల మోతని ఎలా ఎంజాయ్ చేస్తారో ?మనుషులందరూ యుద్ధొన్మాదులె…అంటే ఈ రోజు దీపావళి.పండగ  చేసుకుందాం అనుకున్నారు మాయమైపోయారు …క్రేజీ peoples …మూడో పెగ్ అయిపోవచ్చింది…మైసూర్ పాక్ ఉంటె బాగుండేది….గోడ దూకి పక్కింట్లోకి వెళ్ళాడు,బ్యాక్ డోర్ open ఉంది,కిచెన్లో fridge మీద మూడు స్వీట్ పాకెట్స్ ఉన్నాయి,ఒకటి ఓపెన్ చేసాడు,రసగుల్లాలు,రెండోది కోవా కజ్జికాయ,మూడోది all mix, దాంట్లో మైసూర్పాక్ తప్ప అన్నిఉన్నాయి,కరెక్ట్ గాఎవడో అదే తిన్నట్టుఉన్నారు దరిద్రాన్నిదెంగా …హాల్లో ఉన్న 4carton crackers,స్వీట్ పాకెట్స్ తన ఫ్లాట్ కి షిఫ్ట్ చేసాడు.నిశ్శబ్దం.సిటీ ట్రాఫిక్ని నాయిస్ & స్మోక్ పొల్యూషన్ తట్టుకోలేక విరుపాపరగడ్డి కి షిఫ్ట్ అయిపోదాం అనుకుంటే ఇంకేదో జరిగింది. ప్రశాంతంగా ఉంది.భయంకరమైన నిశ్శబ్దం.చెట్ల ఆకులు వాన చినుకులు musicశబ్దం తప్ప ఇంకేం లేదు…how long i can survive with this silence… ఇపుడైతే ఎవరూ లేరు అనే ఫీలింగ్ ఏం అనిపించటం లేదు.బాల్కనీ లో డాన్సు వేస్తున్నాడు,చేతిలో గ్లాస్.పైకి చూస్తూ “ఎవరైనా ఉన్నారా? “  గట్టిగా అరిచాడు…తన వాయిస్ తనకే వేవ్స్ లాగా వినిపిస్తోంది,మెల్లిగా దూరమైపోతోంది శబ్దం.అలా పైకే చూస్తున్నాడు,మర్రి ఆకుల మీద చినుకులు మొహం మీద పడుతున్నాయి,తెలుగు హీరోయిన్ వానలో చేసే మోస్ట్ లేకి పని ఇదే …చినుకులు మొహం మీద పడుతుంటే తన్మయత్వంఆ వానేమో చిరాకుగా ఎండా వానా కలిసి ఉంటాయి…వాన అంటే ఇది… నల్లటి మబ్బులు వాన…wat a combination…Crackers బాక్స్ ఓపెన్ చేసి ఒక పెద్ద రాకెట్ లాంటిది తీసి బాల్కనీ గట్టు మీద బీర్ బాటిల్లో పెట్టి,లైటర్తో అంటించాడు.అది డైరెక్ట్ గా మర్రి చెట్టు మధ్యలోకి వెళ్లి అక్కడ ఇరుక్కుపోయి విజిల్స్ వేసుకుంటూ పేల్తోంది,మర్రి చెట్టు మీద ఉన్న వాన చినుకులు ఎటుపడితే అటు చిమ్ముతున్నాయి,20+ టైమ్స్ పేలి ఆగిపోయింది…స్టాన్లీ చెవులు గట్టిగా మూసుకుని కూర్చున్నాడు.హైద్రాబాద్ మొత్తం వినిపించి ఉంటుంది,bombing జరిగి ఆగినట్టు ఉంది.ఇంకెవరైనా ఉండుంటే ఖచ్చితం గా వినిపించే ఉంటుంది,ఇక్కడ కాదు terrace మీదకి వెళ్లి పేల్చాలి…మందు అయిపొయింది,మళ్లీ పక్కింటి బాల్కనీ లోకి దూకాడు.