Menu

పర్యవేక్షక CINEMA

దర్శకుడి పనే పర్యవేక్షణ,ఆ పైన పర్యవేక్షణ అంటే డైరెక్టర్ పైన “సూపర్ డైరెక్టర్” అయ్యుంటుంది.

ఇది నేను controversy కోసం రాస్తున్నాను అనుకునేవాళ్లు అందరూ TOLERATE చేయబడుదురు.film ఇండస్ట్రీ మిత్రుల మాటలు,నాకు అనిపించినవి రాస్తున్నాను.

దరిద్రాన్ని భరించలేక desperateగా డైరెక్టర్ అయిపోదాం అనుకునేవాళ్ళకి అవకాశాలు ఇప్పిస్తున్నందుకు Thanks to Mr.Kona వెంకట్.క్రేజీ combinations సెట్ చేసి,చాలా బాగా ప్రమోట్ కూడా చేస్తున్నారు.శంకరాభరణం సినిమా మొదలైనపుడు “పర్యవేక్షణ” లేదు.చివర్లో వచ్చి చేరింది.First film కాబట్టి దర్శకుడు తప్పులు చేస్తున్నపుడు మీరు హెల్ప్ చేసి ఉండొచ్చు, మీ experience తో వాటిని correct చేసి ఉండొచ్చు,అంత మాత్రానికి “దర్శకత్వ పర్యవేక్షణ”అని వేసుకోవటం సబబేనా?ఆ వచ్చే credit ఏదో 15ఏళ్ళుగా నానా కష్టాలు పడుతున్న వాడికి  వదిలెయొచ్చుగా,మీరు రాసిన దానికి “రచనా పర్యవేక్షణ” అని వేస్తే ఎలా ఉంటుంది మీకు? మీరు experienced,కాదనటం లేదు,ఇన్నేళ్ళ experience లో ఎంతమంది director అవ్వాలని ట్రై చేస్తున్న వాళ్ళని చూసి ఉంటారు?“DIRECTOR”  “A FILM BY”  అని స్క్రీన్ మీద చూసుకోవటానికి పడే తపన మీకు కనపడలేదా?దర్శకత్వ పర్యవేక్షణ ఎందుకు మీరే చేయోచ్చుగా?ఇప్పుడు సినిమా క్రెడిట్ ఎవరికి?మంచి జరిగినంతవరకు మీకు,bad అంతా డైరెక్టర్ కి.ప్రతి flop ని disown చేసుకునే మీరు ఏమైనా అనగలరు!పెద్దలు,చెల్లిపోతుంది.

పర్యవేక్షణ లో ఫెయిల్ అయిన దర్శకుడి పరిస్థితి ఏంటో?ఒక రకంగా మంచిదే,ప్రస్తుతం అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు.ఈ సినిమాకి డబ్బులు కూడా వస్తాయేమో,ఈ మధ్య తెలుగులో కొన్ని సినిమాలు ఎందుకు ఆడుతున్నాయో ప్రేక్షకులకి కూడా అర్ధం కావటం లేదు.కొత్త దర్శకులని encourage చేస్తున్నందుకు మళ్లీ “thanks”.కొత్త వాళ్ళ దగ్గర కూడా కథలు ఉంటాయి సార్.Phas gayaa re obama చూసాను,అది కామెడీ సీన్స్ చుట్టూ కథ కాదు,కథలో కామెడీ ఉంది,ఆ కామెడీ జీవితానికి సంబంధించింది,బఫూనరీ కాదు.

నాకు ఉదయ్ పదిహేనేళ్ళుగా తెలుసు,చాలా కథలు చెప్పాడు.ఇది ఖచ్చితంగా ఉదయ్ చేయాల్సిన సినిమా కాదు,ఎందుకంటే తను ఎప్పుడు పది కామెడీ సీన్స్ రాసి దానికి కథ రాయలేదు,పిచ్చివో మంచివో పూర్తి కథ రాసి,కామెడీ కూడా part of script ఉండేలా చూసుకునేవాడు.మీరు కరెక్టే అవొచ్చు సార్,audience కామెడీ తప్ప చూడటం లేదు అని మీరు గట్టిగా నమ్మొచ్చు,ఎన్ని రోజులు అలా “confusion comedy” తో చావగొడతారు? “DHEE” “READY” “DOOKUDU” లో కామెడీ చాలా ఎంజాయ్ చేసాము,అలాగని ప్రేక్షకుల మీద చిన్న చూపుతో రాసిందే రాసి బోర్ కొట్టించటం న్యాయం కాదు.ఒట్టి కామెడీ సీన్లు చూడాలనుకుంటే అన్ని డబ్బులు పెట్టి సినిమాలు చూడటం ఎందుకు?

కొత్త దర్శకుల కథలు ఓపికతో వినండి,మీ అనుభవంతో బెటర్ చేయడానికి హెల్ప్ చేయండి, అంతేగాని సుప్రీమ్ సినిమా judge లాగా మీరు రాసిందే కరెక్ట్ అనుకుంటే ఎలా? ప్రతి సినిమా కళాకారుడికి ఒక saturation పాయింట్ వస్తుంది,RGV,మణి sir లాంటి వాళ్ళకే తప్పలేదు.

“phas gayaa re obama” వీలైతే మళ్లీ చూడండి, మనం కూడా అటువంటి జీవితానికి దగ్గరగా ఉండే కథలోంచి చాలా “cinematic elements” రాయగలం.కథని పర్యవేక్షించండి,దర్శకులని కాదు.  

“cinema is not TEMPLATE based ”