Menu

తప్పక కొని చదవండి

 

“మోహన్ మామ”,ఇలా పరిచయం కార్టూనిస్ట్ మోహన్ గారు.నాకొక బెజవాడ యంగ్  కమ్యూనిస్ట్ ఫ్రెండ్స్ batch తెలుసు,వాళ్ళందరికీ “మామే”.వీళ్ళలో ఒకళ్ళకి ఆయన మేనమామ. వీళ్ళని కలిసేవరకు నాకు ఆయన గురించి తెలియదు,చిన్నపుడు ఉదయం,పెద్దయ్యాక సాక్షి ఈ రెండు పేపర్లు మా ఇంటికి వచ్చేవి కాదు,ఎందుకంటే అవి మా కుల పేపర్లు కాదు.ఆర్కే లక్ష్మణ్,బాపు,శ్రీధర్,రాగతి పండరి,మల్లిక్ ఇంతకన్నా గుర్తున్నపేర్లు లేవు.ఆయన గురించి,ఇంట్లో పార్టీల గురించి ఫ్రెండ్స్ నుంచి రెగ్యులర్ గా వినేవాణ్ణీ. ఆయన్ని,ప్రకాష్ గారిని మొదటిసారి కలిసింది ఇంకో “మామ” ఇంట్లో,మందు కొడుతూ.ఆయన మాట్లాడుతున్నది నాకు సరిగ్గా వినపడటం లేదు,ఆ మాటల్లో NINE (2009)సినిమా టాపిక్ వచ్చింది, అక్కడి నుంచి నేను చెలరేగిపోయాను.నా favourite మూవీ,ఆయన్ని పక్క రూం లో ఉన్న Mac దగ్గరకి తీసుకెళ్ళి ఇద్దరం  సినిమాలో సీన్స్ random గా చూస్తున్నాము,దీంట్లో ఒక బీచ్ సీన్ ఉంటుంది, దాని గురించి ఇంకా మిగతా “musical sequences” గురించి చాలా exciting  గా కబుర్లు చెప్పుకున్నాం.

https://www.youtube.com/watch?v=j9THeznxCNU

ఆ రాత్రి తరువాత మళ్లీ కలవలేదు,చాలా gap తరువాత ఆయన birthday పార్టీ కి వెళ్ళాను ఫ్రెండ్స్ తో .చాల excited గా ఉన్నాను,నన్ను గుర్తుపెట్టుకునే ఉంటారు అని నా నమ్మకం.ఇంట్లోకి వెళ్లేసరికి కనీసం 20 మంది పైనే ఉన్నారు. నేల మీద కూర్చుని పాటలు పాడుతున్నారు కొంతమంది,మోహన్ గారు తన టేబుల్ దగ్గర ఎవరితోనో మాట్లాడుతున్నారు,వెళ్లి విష్ చేశాను.గుర్తుచేయడానికి ట్రై చేశాను, workout అవలేదు.సినిమా గురించి మాట్లాడినంత మాత్రాన “నా మేధావితనాన్ని” ఆయన గుర్తుపెట్టుకుంటారు అనే భ్రమలోంచి బయటకు వచ్చి, పక్క రూం లో పార్టీలో జాయిన్ అయిపోయాను,ఆ రాత్రి మళ్లీ మోహన్ గారితో మాట్లాడినట్టు గుర్తు లేదు.

మళ్ళీ gap.మేము అందరం అమృత valley అపార్ట్ మెంట్ లో ఉన్నాం last two years. బాగా ఓల్డ్ అపార్ట్ మెంట్,చాలా creepy గా ఉంటుంది.అందులో మా creepiest batch Buckingham 113లో ఉండేవాళ్ళం,”బంజారా సంగం” అని flatకి పేరు పెట్టుకున్నాం. ఒకరోజు రోహిత్ చెప్పాడు “రాత్రికి మోహన్ మామ ఇక్కడికి షిఫ్ట్ అవుతున్నారు,temporary గా కొన్ని రోజులు ఇక్కడే ఉంటారు”.ఈ సారి డిసైడ్ అయిపోయాను ఆయనతో friendship చేసేయాలని.ఫస్ట్ సామాన్లు వచ్చాయి,సాయంత్రానికి మోహన్ గారు, ప్రకాష్ గారు వచ్చారు.త్రీ బెడ్రూమ్స్ లో ఒకటి ఆయనది.అక్కడే మందు కొడుతున్నారు, మోహన్ గారు అప్పుడు “మందు holiday” లో ఉన్నట్టు గుర్తు.

పొద్దున్నే లేచి బొమ్మలేసుకోవటం,పేపర్స్ చదువుకోవటం… ఆయన రొటీన్ అందరికీ తెల్సిందే… మాట్లాడటానికి ట్రై చేయాలో వద్దో అని dilemma,ఆయనతో నేనేం మాట్లాడగలను?సిగరెట్ కోసమో ఇంకేమన్నా అవసరమయి పలకరిస్తే తప్ప ఎప్పుడూ ఏం మాట్లాడలేదు.ఒకరోజు ఆయనే పిలిచి తన animation  ఫిల్మ్స్  చూపిస్తాను కూర్చోమన్నారు,excited.చూసాక ఏం చెప్పాలి?ఏమనిపిస్తే అది చెప్పేయాలని fix అయిపోయా.కానీ ఆ ఫైల్స్ సిస్టం లో ఓపెన్ అవలేదు,”రేపు చూపిస్తాన్లేబ్బా” అన్నారు కానీ ఆ రేపు రాలేదు. నేను అక్కడనుంచి vacate చేసేసాను.gap.

మా సినిమా “శీష్ మహల్” ఓపెనింగ్ లో ఒక స్టొరీ రీడింగ్ సీన్ ఉంది,ఇది సర్రాజు ప్రసన్నకుమార్ రాసిన కథల పుస్తకం లోంచి తీసుకున్నది.వాయిస్ వస్తున్నపుడు “cartoons” తో ఆ స్టొరీ చూపించాలి అని ఐడియా రాగానే రోహిత్ “మోహన్ మామని అడుగుదాం బొమ్మలు వేయమని” అన్నాడు, “వేస్తారా ?” అని అడిగాను,అడగ్గానే ఒప్పుకున్నారు.నాకు కళల మీద ఎలాంటి అవగాహన లేదు,of course నాలాంటి చాలా మంది తెలుగు directors కి కూడా లేదనుకోండి.కానీ నా సినిమా లో అంత గొప్ప Artiste బొమ్మలు కనిపిస్తాయి అనే thought forever exciting.

ఈ బొమ్మల ప్రాసెస్ మొదలయ్యాక ఇక గ్యాప్ రాలేదు,నేను కూడా ఆయన “మంద” లో ఒకణ్ణి  అయిపోయాను.regular గా ఫ్లాట్ కి వెళ్ళడం ఆయన తో మందు కొడుతూ సినిమాల గురించి కబుర్లు,మోహన్ గారు ప్రకాష్ గారు చెప్పే “journalist nostalgia” విషయాలు ఎంతసేపైనా వినచ్చు.అలా ఒక session కి వెళ్ళినపుడు దొరికిన పుస్తకమే “కార్టూన్ కబుర్లు”. మోహన్ గారి టేబుల్ మీద ఉంది, తీసి చదువుతుంటే చాలా interesting గా అనిపించి ఆ రాత్రి చెప్పకుండానే తీసుకెళ్ళి పోయాం. తెచ్చి చదవటం మొదలు పెట్టాక ఆపాలనిపించలేదు. Next Day ఈవెనింగ్ కి ఫినిష్ చేసేసాను.

నాకు “చిత్ర కళ” గురించి తెలియదు అనే  బెంగ పోయింది. చిత్ర కళ అనే కాదు చాలా కొత్త  విషయాలు తెలిసాయి.

ఖచ్చితం గా “collection” లో ఉండాల్సిన పుస్తకం.దీని సిరీస్ రాబోతోంది.ముందు ఇది కొని చదవండి, హైదరాబాద్ బుక్ ఫెస్టివల్ లో దొరుకుతోంది,ఇంకో రెండు రోజుల్లో ఫెస్టివల్ అయిపోతుంది.

మంచి తరుణం మించిన దొరకదు