Menu

శీష్ మహల్లో CHILDREN’S FILM FESTIVAL

శీష్ మహల్లో CHILDREN’S FILM FESTIVAL

అమీర్ పేట్ శీష్ మహల్లో కాదు , మా సినిమా “శీష్ మహల్లో” children’s film festival . 2013 CFF backdrop లో మేము మొదలు పెట్టిన సినిమా “శీష్ మహల్ “. నాలుగు కథలు ఒక film festival , ఇదే మా సినిమా. రెండు సంవత్సరాల తరువాత మా సినిమా “శీష్ మహల్” ఇప్పుడు ముగింపు దశ లో ఉంది . పూర్తిగా resourcesని నమ్ముకుని , friends & family members support తో ఇక్కడి దాక వచ్చాము . ఒక రకంగా “crowd funded “ సినిమా నే . 27 రోజుల షూటింగ్ చేయడానికి సంవత్సరం పట్టింది . మా cinematographer VS జ్ఞాన శేఖర్ ఈ మధ్య లో మూడు సినిమాలు finish చేసారు కంచె తో కలిపి . ప్రతి పెద్ద హీరో సినిమా కి ఎంత కష్ట పడ్డారో చెప్పే “టిపికల్ కష్టాలు” ఎలా ఉంటాయో స్వతంత్ర సినిమా కి కూడా చాలా “కష్టాల కబుర్లు” ఉంటాయి . కాకపోతే ఈ కష్టాలు ఇంకో రకం. సిగరెట్స్ కి, మందు కి డబ్బులు లేకపోవటం , కొత్త బట్టలు కొనుక్కోలేక పోవటం , గర్ల్ ఫ్రెండ్ ని outing కి తీసుకెళ్ల లేక పోవటం , multiplex లో సినిమా కి వెళ్ళి కదిర్ సినిమాల్లో పేద హీరో లాగ పాప్ కార్న్ ,చికెన్ శాండ్విచ్ వైపు ఆశగా చూడటం , షేర్ ఆటోల్లో ఇరుక్కుని ట్రావెల్ చేయటం …. “ఏముంది ఇందులో నీ దరిద్రం తప్ప “ అనిపిస్తోంది కదా! నేను చెప్పినవి జస్ట్ సింపుల్ కష్టాలే , చెప్పుకోలేని దరిద్రాలు చాలానే ఉంటాయి . అన్ని రాసుకుంటూ పోతే ఒక చిన్న సైజు పుస్తకమే ప్రింట్ చేయొచ్చు , అది ఎవరూ కొని చదవరు అని గట్టి నమ్మకం తో ఆ పని చేయలేదు . ఇన్ని దరిద్రాలు అనుభవిస్తూ , సమాజం అడిగే దిక్కుమాలిన ప్రశ్నలకి జవాబు చెపుతూ “స్వతంత్ర సినిమా” ఎందుకు చేయాలి ? ఎందుకంటే నేను చెప్పిన 50-75 లక్షల budget సినిమా కథలు ఏ నిర్మాత కి నచ్చలేదు . ఒక కథ RGV కి నచ్చింది కానీ workout అవలేదు . జరిగి ఉంటె అదే ICE CREAM 3.

ఇది ఏ genre సినిమానో ఖచ్చితంగా చెప్పలేను కానీ, “multi plotted meta film “ అనొచ్చు . ఈ “meta film “ పిచ్చి నాకు అంటించింది నా కుర్ర స్నేహితుడు , మా సినిమా ఎడిటర్ , రచయిత , విమర్శకుడు , దర్శకుడు అయిన రోహిత్ కే ఆ credit . నాకు కొంచెం ఉండేది Meta పిచ్చి, ప్రస్తుతం పీక్స్ లో ఉంది . ఈ సినిమా మొదలు పెట్టాక వచ్చిన experience తో “బంజారా సంగం “ అనే మరో స్వతంత్ర సినిమా షూటింగ్ విజయవంతంగా పూర్తి చేసాము . ఇది 80 % లంబాడి భాషలో ఉంటుంది . editing మొదలు పెట్టాలి .

స్వతంత్ర సినిమా చేయటానికి కావాల్సింది support , అది ఎవరినుంచి అయిన ఎటు నుంచి అయినా “లాక్కోవాల్సిందే” “అడుక్కోవాల్సిందే” . అంత easy గా ఎవరూ సపోర్ట్ చేయరు . సిగ్గు లేకుండా మనమే అడుక్కోవాలి …. ఒకసారి అడుక్కోవటం మొదలు పెడితే ఆ తరువాత సినిమా కోసం ఏమైనా చేసేస్తాం . మేము ఒక రకంగా experts అయిపోయాం అందులొ. సినిమా తీస్తున్నాము అంటే మన చుట్టూ పక్కల వాళ్ళే నమ్మరు , నమ్మించాలి , మోసం చేయాలి , అబద్దాలు చెప్పాలి , ఏమి లేకపోయినా ఏదో జరుగుతున్నట్టు hype తీసుకురావాలి …. స్వతంత్ర సినిమా తీయడం కన్నా ఇదే పెద్ద ART .

సినిమా తీస్తున్నపుడు చాలా మంది అడిగిన చిరాకు ప్రశ్న “ short ఫిల్మా / డాక్యుమెంటరీనా” , కాదు రా బాబు మేము తీస్తున్నది feature లెంగ్త్ సినిమానే అని నమ్మించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది, కథ చెప్పాక ఇంకో చెత్త ప్రశ్న “ఓహో ART CINEMAనా ?” short ఫిలిం / డాక్యుమెంటరీ తో compare చేసినందుకు కాదు కోపం , మన పక్కనొడు సినిమా తీయటం కష్టం అని అందరి నమ్మకం, అందుకే స్వతంత్ర సినిమా దర్శకులు అందరూ అంత arrogant . ఈ మధ్య ఎవరైనా ఏమైనా అనే లోపు నేనే మాది “తేడా సినిమా” అని చెప్పటం మొదలు పెట్టా .

అవును ఇది తేడా సినిమా నే !

2 Comments
  1. msk November 13, 2015 /
  2. క్యాంప్ శశి November 15, 2015 /