Menu

నవతరంగం – ఎనిమిదొవ వార్షికోత్సవం

నవతరంగం ఎనిమిదొవ జన్మదినోత్సవ సందర్భంగా పాఠకులకూ, సభ్యులకూ అభినందనలు. 2007 నవంబర్ నెలలో మొదలు పెట్టిన నవతరంగం ఆన్ లైన్ ఫిల్మ్ జర్నల్ ఈ రోజుతో ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

ఎంతో మంది సభ్యులు, రచయితలు, పాఠకులు, అభిమానులు మరియు శ్రేయోభిలాషుల ఆశీస్సులు, ప్రోత్సాహం మరియు ఆదరణతో మన నవతరంగం పత్రిక ఇన్ని సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని తొమ్మిదో సంవత్సరం లోకి అడుగు పెడుతోంది.

నవతరంగం ద్వారా వ్యాసాలు ప్రచురించడమే కాకుండా సత్యజిత్ రే “Our Films-Their Films” ని నవతరంగం సభ్యురాలు సౌమ్య తెలుగులోకి అనువదించగా నవతరంగం ఫిల్మ్ స్టడీస్ ప్రచురించడం జరిగింది. ఈ పుస్తకం ప్రచురించడంలో సాయపడిన అందరికీ మా ధన్యవాదాలు. వచ్చే సంవత్సరం నవతరంగం ఫిల్మ్ స్టడీస్ మరో ఐదు పుస్తకాలను ప్రచురించనుందని తెలియచేస్తున్నాము. ఈ పుస్తక ప్రచురణలో కూడ మీ సహాయ సహకారాలు అవసరం.

గతంలోలా నవతరంగం అంతగా యాక్టివ్ గా లేకపోయినప్పటికీ వచ్చే సంవత్సరం మరిన్ని వ్యాసాలు, కొత్త శీర్షికలతో మీ ముందుకు రావాలని ప్రయత్నం చేస్తామని మనవి చేసుకుంటున్నాము. ఎప్పటిలాగే మీ సలహాలతో, సూచనలతో మరింత మెరుగుపరుచుకునే అవకాశం మాకు అందివ్వండి.

2 Comments
  1. వేలమూరి శ్రీరామ్ March 9, 2016 /
  2. Vemeswara Reddy August 1, 2017 /