Menu

META పిచ్చి

నేను బాగా excite అయ్యి inspire అయ్యి ,ఆ inspiration  తన్నులు తినే దాక తీసుకెళ్ళిన తాగుబోతు సీన్ ఒకటుంది.9-10 సంవత్సరాల క్రితం చూసాను పేరు గుర్తు లేదు,ఒక ఫ్రెంచ్ indie  film,సాయి అని నాకో ఫ్రెండ్ ఉన్నాడు,అతను ప్రపంచంలో ఎవరూ చూడని obscure ఫిల్మ్స్ చూస్తుంటాడు.అతను vcd ఇస్తే చూసాను.

సీన్ ఏంటంటే ఒక filmmaker తన రైటర్ తో కూర్చుని మందు కొడుతుంటాడు,తను next తీయబోయే సినిమాలో కథ చెపుతుంటాడు,

Protagonist  family business మెకానిక్ shed,వాడు కూడా చిన్నప్ప్పటినుంచి అదే నేర్చుకుని సెటిల్ అవాలని డిసైడ్ అయి ఉంటాడు,వాడికి మోటార్ ఫీల్డ్ అంటే ఒక రకమైన పిచ్చిలాగ అయిపోతుంది.ఆ మెకానిక్ షెడ్ లోనే పెరిగి బయట ప్రపంచం తో సంబంధాలు తగ్గిపోయి, ఒక వయసు వచ్చేసరికి inferiority complex వచ్చేస్తుంది,అది వాడు realize అయ్యేసరికి లేట్ అయిపోతుంది.వీడికో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది,ఆఫ్రికన్.చాలా ambitious,US వెళ్ళిపోయి అక్కడేమైనా  పని చూసుకుందాం,నీకు స్కిల్ ఉంది కాబట్టి వచ్చేయ్ మంటుంది.కాని వీడికి వెళ్ళటం ఇష్టం లేదు,ఇక్కడ హ్యాపీ.

ఆ అమ్మాయి వాడికి సారీ చెప్పి US లో ఉద్యోగం వెతుక్కోవటానికి వెళ్ళిపోతుంది.

ఇక్కడ వీడి రొటీన్ లో వీడు ఉంటాడు,ఇంకో గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది,ఆ అమ్మాయికి కూడా వాడి jobతో  complaint,ఎప్పుడూ  అలా  ఆయిల్ grease పూసుకుని ఎందుకు వేరే ఉద్యోగం చూసుకోవచ్చు కదా  అనేది ఆమె సలహా!ఒకసారి ముద్దుపెట్టుకోవటానికి try చేస్తే, వాడి వాసన తట్టుకోలేక దూరం గా వెళ్ళిపోతుంది. వీడు హర్ట్ అయిపోతాడు, విడిపోతారు. అక్కడనుంచి వీడికి స్త్రీల మీద అభిప్రాయం మారిపోతుంది. దురభిప్రాయం లాంటి సదభిప్రాయం.స్త్రీలు తనకన్నా సుపీరియర్ అనే chauvinism ఆవహిస్తుంది.వీళ్ళెవరూ నన్ను అర్ధం చేసుకోలేరు అని ఫిక్స్ అయ్యి అమ్మాయిల జోలికి వెళ్ళటం మానేస్తాడు.

వీడికి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అంటే చాలా ఇష్టం,ఆమెతోనే వీడికి ఎక్కువ రోజులు రిలేషన్ …US నుంచి అప్పుడపుడు కాల్ చేస్తుంటుంది,డబ్బులు ఏమైనా కావాలా అని అడిగినా  వీడు ఎప్పుడూ తీసుకోడు.అక్కడ friendsతో దిగిన photos  పంపిస్తుంటుంది, వీడు ఫొటోస్ తో పాటు లెటర్స్ కూడా రాస్తుంటాడు,ఆమె రాయదు.కొన్ని రోజులు గడిచి పోతాయి,వీడు friendsతోనే ఎంజాయ్ చేస్తుంటాడు,ఒకరకంగా నాకు స్త్రీ అవసరం లేదు,దొరికితే ok అనుకుని బతికేస్తుంటాడు.అప్పుడపుడు ఫ్రెండ్స్ ఇళ్ళకి వేరే గర్ల్స్ వచ్చినా వీడు పట్టించుకోకపోవడంతో వాళ్ళూ వీడిని  పట్టించుకోరు.2-3 ఇయర్స్ తరువాత US గర్ల్ ఫ్రెండ్ వెనక్కి వస్తుంది.అప్పటికి వాడు గడ్డం మీసాలు పెంచుకుని,alcoholic అయిపోయి  jim morrison పాటల మీద trip అవుతుంటాడు, “fake  jimmy “ ఫ్రెండ్స్ వీడికి  ఒక నిక్ నేమ్ కూడా పెడతారు.ఆ అమ్మాయి వీడికి ఫోన్ చేసి మోస్ట్ happening పబ్ ఏదో అడుగుతుంది,వాడు తెల్సిన రెండు మూడు పేర్లు చెపుతాడు,అమ్మాయి పెట్టేసేముందు మొహమాటం గా నన్ను invite  చేయవ అని అడుగుతాడు,all girls party అని చెపుతుంది.పార్టీ తరువాత ఇంటికి రమ్మని invite చేస్తాడు,ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది .

ఆ రాత్రి వాడు & ఫ్రెండ్స్  ఒక సింగర్ ఇంట్లో మందు కొడుతుంటారు, పది పదిహేను మంది ఉంటారు. men & women.సింగర్ పాటలు పాడుతుంటాడు,వాడికి బోర్ కొడుతుంటుంది,ఒక ఫ్రెండ్ ని అడిగి కార్ తీసుకుని roads మీద తిరుగుతుంటాడు,వాడు తిరిగేది ఆ అమ్మాయికి చెప్పిన pubs చుట్టూ, first pub లో ఉండరు,సెకండ్ పబ్ లో కనిపిస్తారు,ఆ అమ్మాయి వీడిని చూసి చాలా excite అయ్యి వాడిని hug చేసుకుంటుంది,తన ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తుంది,వాళ్ళెవరూ వీడికి తెలియదు.ఇద్దరు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉంటారు.ఆ అమ్మాయి వాడి చెవిలో “ఇక్కడ మ్యూజిక్ చాలా బోరింగ్ గా ఉంది,నువ్వు ఓల్డ్ అయిపోయావ్ “ అంటుంది నవ్వుతూ,వాడు కూడా నవ్వి మందు తెచ్చుకుంటాను అని కౌంటర్ దగ్గరకి వెళ్తాడు,అక్కడ bartenderతో మాటలు మొదలుపెడతాడు,చాలా ఫాస్ట్ గా first peg  ఫినిష్ చేస్తాడు. అప్పుడపుడు వెనక్కి తిరిగి చూస్తుంటాడు,ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్ తో డాన్సు చేస్తుంటుంది,సెకండ్ peg మొదలుపెడతాడు,అప్పటికే తాగేసి రావడంతో వాడు చాల హైలో ఉంటాడు.bartender బిజీగా ఉన్నా వాడిని మాటలతో విసిగిస్తుంటాడు,సెకండ్ peg అయ్యేటపుడు ఆ అమ్మాయి వీడి దగ్గరకి వచ్చి వెనక నుంచి hug  చేసుకుంటుంది,వాడు ఏదో చెప్పటానికి ట్రై చేస్తే ఆ అమ్మాయి వాడిని dance చేయమని చేయి పట్టుకుని లాగుతుంటుంది,వాడు try చేస్తాడు కానీ అప్పటికే తాగేసి ఉండటం తో చేయలేకపోతాడు.ఆ అమ్మాయి నవ్వేసి డ్రింక్ ఎంజాయ్ చేయమని ఫ్రెండ్స్ దగ్గరకి వెళ్ళిపోతుంది.వీడు ఇంకో peg మొదలుపెడతాడు,bartender వీడిని  పూర్తిగా పట్టించుకోవటం మానేసాడు.వీడు మాట్లాడుతూనే ఉంటాడు,సిగరెట్స్ తాగుతుంటాడు,ఇంకో peg తీసుకుని  తాగుతూ వెళ్లి DJ మొహం మీద చల్లుతాడు,DJ షాక్ అయ్యి చూస్తుంటాడు,మ్యూజిక్ రన్ అవుతూనే ఉంటుంది,DJని తిట్టటం మొదలు పెడతాడు గట్టి గట్టిగా,స్టాఫ్ ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళని తిడతాడు,డాన్సు చేస్తున్న వాళ్ళని తిడితే వాళ్ళు వాడిని తోసేస్తారు,వీడు అరుస్తుంటాడు,మ్యూజిక్ ఆగిపోతుంది,ఆ అమ్మాయి & ఫ్రెండ్స్ వాడి దగ్గరకి వచ్చి వాణ్ని లేపటానికి ట్రై చేస్తే వాళ్ళని తిట్టి లేచి నిలబడతాడు, bouncers వస్తారు,వాడు సైలెంట్ అయిపోయి వెళ్లి పోతుంటాడు Music మొదలవుతుంది,అందరూ డాన్సు చేస్తుంటారు,ఆ అమ్మాయి వీడి వైపే చూస్తుంటుంది,వాడు నడవ లేక తూలుతూ నడుస్తూ బయటకు వెళ్ళిపోతాడు .

ఇదంతా FILMMAKER క్యారెక్టర్ narrate చేస్తున్నపుడు స్క్రీన్ మీద వస్తుంటుంది,సినిమా లో పెద్ద డైలాగ్స్ ఉండవు,filmmaker, writer మాటలే ఉంటాయి.అంతా విని రైటర్

“వాడు ఎందుకు అలా  behave  చేసాడు”

“వాణ్ని ఎవరూ పట్టించుకోవడం లేదు అని వాడి కోపం”

“drunkard frustration & female bashing,every indie is doing same stuff,tell me something new”

“reality  is new … it’s  constantly changing….”

“దీంట్లో కొత్త ఏముంది”

“pub సీన్ happened last night with me”

writer మందు కొడుతూ వాణ్ని చూస్తుంటాడు.

“లాస్ట్ నైట్ నా గర్ల్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళినపుడు నాకే జరిగింది,దాని చుట్టూ కథ రాసాను,వాడు ఇక్కడనుంచి becomes a  wanderer… trains ఎక్కి దేశమంతా తిరుగుతూ మెకానిక్ గా  పనిచేసుకుంటూ బతికేస్తాడు,ఇక్కడనుంచి  నువ్వు రాయాలి…. ”

writer అడుగుతాడు

“నువ్వు అందరితో ఇలాగే చేస్తున్నావు, ఆ అమ్మాయి చాలా hurt అయి ఉంటుంది కదా ”

“ అయి ఉంటుంది , ఇక జీవితం లో నా మొహం చూడక పోవచ్చు”

“don’t  you feel  bad”

“i feel bad …. very bad …. “

అని ఒక peg  పోసుకుని cigaret  అంటించి

“ i   think  i  gave  her a gift “

writer surpriseగా

“gift ? you  gone  mad”

filmmaker  గ్లాస్  పక్కన పెట్టి ,

“just imagine after ten years,she will  be  laughing  at   my  stupidity  “

“అందరూ నీ ఫ్రెండ్స్ లాగ ఉండరు,నువ్వు రోజు రోజు కి self indulgent అయిపోతున్నావు నీ సినిమా కథలు కూడా అలాగే ఉంటున్నాయి, if you don’t change,u will be left alone by this world “

filmmaker  మందు తాగుతుంటాడు …..

filmmaker ఆ సినిమా తీయడం మాత్రం ఆపడు …. It’s a road movie

vague గా గుర్తున్నది రాసాను

ఎన్ని పాత “hurt gifts “ మీద నవ్వుకోవచ్చో …. హర్ట్ పర్మనెంటా ?

One Response
  1. bargava December 2, 2015 /