Menu

Braveheart – స్ఫూర్తిదాయకం

‘The Passion of the Christ’ మరియు ‘Apocalypto’ వంటి సినిమాలు చూశాక ఎందుకనో నాకు Mel Gibson దర్శకత్వం వహించిన చిత్రాలపై అనుహ్యంగా మనస్సు మళ్లింది.అతడి ముందటి చిత్రమైనటు వంటి ‘Braveheart’ సినిమా చూడడం తటస్థించింది. ఇది చూసేందుకు మరో కారణం కూడా ఉంది. ‘Indain cricket’ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ ఓ సందర్బంలో తనకు ఏంతగానో స్పూర్తి నిచ్చిన చిత్రంగాను,తనకు బాధ కలిగిన ప్రతిసారి ఈ చిత్రాన్ని చూస్తే ఉత్తేజం కలిగించే విధంగా ఈ చిత్రం ఉంటుందని అనడంతో, తనని ఆకట్టుకొనేంతగా ఈ చిత్రంలో ఏముందా అని తెలుసుకోవాలనే కుతుహలంతో ఈ చిత్రం చూడడం జరిగింది. నిజానికి  విషయం చాలానే ఉంది ఈ సినిమాలో.

అది క్రీశ.1208 scotland రాజుకి వారసత్వమే లేకుండా మరణించడంతో,అప్పుడు England రాజు Edward Longshanks ఘోరమైన పరిపాలన సాగిస్తుంటాడు. scotland ప్రభువులు రాజ పదవులకై వారిలో వారే కొట్టుకుంటారు.దాంతో Edward వారిని సంధికి పిలిపించి ఆయుధాలు లేకుండా వారిని బానిసలుగా చేసుకుంటాడు. ఆ ప్రాంతానికి చెందిన ఓ రైతు Molcolm wallace ఇరువురి కుమారులలో ఒకడే  William Wallace.

England అకృత్యాలకు scotland  బలవుతుంది. scotland ను స్వాతంత్ర్య దిశగా ముందుకు నడిపిన యోధుడే ఈ William Wallace. అతడి గాథే ఇది. William Wallace అనేవాడు కట్టుకథ అని England చరిత్ర కొట్టిపడేసిందని, కాని ఈ చరిత్రను లిఖించింది, ఆ యోధులకు మరణ శిక్షను స్వయంగా అమలుపరచినవారే నని కథ ఆరంభంలో చెప్పబడుతుంది.  సంధి పేరుతో scotland వాసులను ఊచకోతకొయ్యడంతో,అందుకు ప్రతీకారం తీర్చుకొనే ప్రయత్నంలో William Wallace యొక్క తండ్రి,అన్న మరణిస్తారు. దాంతో అతడి మేనమ అతడిని అక్కడి నుండి తనతో పాటు తీసుకుపోతాడు.

మరో ప్రక్క England రాజు Longshanks తన సామ్రజ్యాన్ని విస్తరించేందుకు గాను తన శత్రువైనటువంటి France దేశపు యువరాణి Isabelle ను తన కొడుక్కిచ్చి వివాహం చేస్తాడు.ఇంకో ప్రక్క Scotland ప్రజలను అక్కడి ప్రభువులచేతనే తన అధీనంలోకి తీసుకు వచ్చేందుకు పన్నాగాలు పన్నుతాడు. అందుకు తగిన దారి అక్కడి ప్రభువులను ఇక్కడికి, ఇక్కడి ప్రభువులను అక్కడికి నియమిస్తాడు. అదేవిధంగా scotland లో కొత్తగా వివాహం అయిన స్త్రీలకు ప్రభువులతో తొలిరాత్రి జరగాలి,దాంతో అక్కడి ప్రజల మనోభావాలను దెబ్బ తియోచ్చున్ననది అతడి విశ్వాసం.

William Wallace పెద్దవాడయ్యాక విద్యాభ్యాసం,అన్నివిద్యలు నేర్చుకొని తన స్వదేశానికి తిరిగివస్తాడు. అక్కడ తన బాల్యపు స్నేహితులను,చిన్ననాటి స్నేహితురాలిని అందరిని కలుస్తాడు. తన చిన్ననాటి స్నేహితురాలిని తను ఇంకను ప్రేమిస్తాడు.ఆమె కూడా అతడిని ఇష్టపడుతుంది. అయితే అప్పుడే ఒక కొత్త జంట ప్రభువులకు ఆచారం పేరిట బలికావడంతో, వీరిద్దరి జంట ఎవరికి తెలియకుండా  గంధర్వ వివాహం చేసుకుంటారు. అయితే ఇంగ్లండు ప్రభువుల సైన్యం అతడి ప్రేయసి Murron పై కన్నేయ్యడంతో ఆమె అందుకు ఎదురు తిరిగడంతో,అక్కడి నుండి ఆమెను తప్పించే ప్రయత్నంలో wallas సైన్యానికి ఎదురు తిరగడంతో ప్రతిఘటన నెలకొంటుంది. దాంతో అక్కడ చిక్కుకున్న అతడి ప్రేయసిని వారు హతమారుస్తారు. అక్కడికి తిరిగివచ్చిన wallace నిర్ఘాంతపోయి సైన్యాన్ని ఊచకోత కోస్తాడు,అందుకు scotland ప్రజలు అతడికి సహకరిస్తారు. ఈ ఘటనతో scotland ప్రజలు అతడిలో ఒక నాయకుణ్ణి చూస్తారు. ఇక్కడిని నుండే England కు ఎదురు తిరగడం ఆరంభిస్తాడు william Wallace.తన ప్రేయసిని కోల్పోయిన wallas అటుపిమ్మట తన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడాలనుకుంటాడు.

అడపదడపా యుద్దాలు చేసి England సైన్యాన్ని తన దేశం నుండి తరిమి కొడతాడు. దీంతో scotland, England ల మద్య సంగ్రామం నెలకొంటుంది.దానికి తనకు అవసరమైన సైన్యాన్ని తన దేశపు ప్రభువులను ఒప్పించి సమీకరిస్తాడు మొత్తానికి.కాని సంగ్రామంలో England సైన్యాన్ని చూసిన wallace సైన్యం భయంతో బెంబేలెత్తి పోతారు.దానితో అక్కడ అయోమయ పరిస్థితి నెలకొంటుంది. ఆ సందర్భంలో william Wallas ‘మరణిస్తే వీరునిగానే యుద్ధంలో మరణించాలి,బ్రతికుంటే పిరికిపందలుగానే బ్రతకాలి, మనం పుట్టినందుకు అర్ధాన్నిచే ఒకే ఒక్క సందర్భం ఇప్పుడు మనకి లభించింది, దానిని నిరుపించుకొనేందుకు, స్వాతంత్ర్యానికై పోరాడదాం’ అంటూ వారిలో స్పూర్తిని నింపే సన్నివేశం అతి కీలకం.దీనితో ఈ సంగ్రామం లో scotland వాసులు విజయం సాధిస్తారు. ఇప్పుడు scotland కు ఎవరిని రాజును చెయ్యాలనే సంధిగ్దత నెలకొటుంది, ప్రభువుల మధ్య ఐక్యత లోపిస్తుంది.wallace ఈ సమైక్యత లోపం వలన England మనపై మళ్లీ దండెత్తవచ్చు,దానికి మనమే England పై దండెత్తుదామంటాడు. దానికి అతనికి నిరాదరణ లభిస్తుంది.ఇక్కడే wallace కు Edinburg కు చెందిన Robert Bruce ల మధ్య సన్నిహితం నెలకొంటుంది. ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉంటాయి.

అన్నట్లుగానే wallace England యొక్క సామ్రాజ్యమైనటువంటి York పై దండెత్తి విజయం సాధిస్తాడు.దీనితో భయపడ్డ Longshanks సంధికి పధకం వేసి తనకు బదులుగా తన కోడల్ని పంపుతాడు. అక్కడ wallace తో జరిగిన  సంభాషణలో అతడి మంచితనాన్ని గుర్తించి అతడికి సహాయపడుతుంది యువరాణి Isabelle. ఓ ప్రక్క సంధికి పంపి మరో ప్రక్క వారిని తుదముట్టించేందుకు Longshanks కుతంత్రం పన్నుతాడు.అతడి కుతంత్రం తెలుసుకున్న wallace వాళ్లను ఎదుర్కొనేందుకు Robert bruce సహాయాని అర్ధిస్తాడు,అందుకు అతడు సరేనంటాడు.

మహసంగ్రామం మొదలవుతుంది.తీరా యుద్దం మొదలయ్యాక wallace కు సహాయపడేందుకు ఎవరు ముందుకురారు. Longshanks ప్రభువులకు పదవులను,ఆస్తులను ఎరవేసి తన రాజతంత్రాన్ని ఉపయోగిస్తాడు. ఆఖరి నిముషంలో తను ఎంతగానో విశ్వసించిన robert Bruce సైతం యుద్ధంలో వెన్నుపోటు పొడవటం wallace తట్టుకోలేక విలపిస్తాడు.అది చూసిన Robert Bruce పశ్చాతాప్తపడతాడు. ఈ సంఘటన నుండి కోలుకున్న తరువాత wallace యుద్ధంలో తనకు వెన్నుపోటు పొడిచిన ప్రభువులందరిని ఊచకోత కోస్తాడు.

అంచెలంచెలుగా ఎదుగుతున్న wallace,అతనికి లభిస్తున్న ఆదరభిమానాలు చూసి Longshanks విస్తుపోతాడు.మళ్లీ సంధి ఒప్పంధం పేరిట ఈ సారి హతమార్చేందుకు ప్రయత్నిస్తాడు. wallace చాకచక్యంగా మట్టుపెడతాడు. మరో ప్రక్క Robert Bruce ను కలిసేందుకు వర్తమానం రావడంతో, అందులో ఏదో కుట్ర దాగుందని అతడి అనుచరులు ఎంత వారించినా వినకుండా, మనం గెలవాలంటే వారి సహాయం మనకు తప్పక కావాలి, అందుకు మనం వారిని నమ్మే తీరాలని బయలుదేరుతాడు. కానీ అక్కడ ఈసారి Robert Bruce ప్రమేయం లేకుండానే ప్రభువులు అతడిని చుట్టుముడతారు. విషయం తెలిసి robert ఎంత వారించిన అతడిని పట్టుకొని England కు అప్పగిస్తారు. ఈసారి కూడ Robert తండ్రే సమాచారాన్ని చేరవేస్తాడు. అందుకు తండ్రినే అసహ్యించుకుంటాడు. చెరబట్టిన England ప్రభుత్వం అతడికి ఉరిశిక్ష అమలుంచేస్తుంది. అతను మోకరిల్లి తప్పును ఒప్పుకుంటే హింస పెట్టకుండా మరణ శిక్షను అమలుపరుస్తామంటారు. తనను ఎంతగా వేధించినా అందుకు ఒప్పుకోడు.ఆఖరి మాటగా ఏదో చెప్పాలనుకున్న wallas ‘స్వాతంత్ర్యం కావాలి ‘ అని దిక్కులు దద్దరిల్లేలా అరిచి తుదిశ్వాస వరకు స్వాతంత్ర్యమే లక్ష్యంగా పోరాడి మరణిస్తాడు.తాను మరణంచినా తన లక్ష్య స్ఫూర్తిని, విప్లవాగ్నిని Scotland ప్రజలలో నింపుతాడు.అతను నింపిన స్ఫూర్తితో Scotland కొన్ని వందల యేళ్ల పోరాటంతో తమని తాము స్వతంత్రించుకుంటారు.

ఈ చిత్రం కథాపరంగాను, సాంకేతికంగాను ఎంతో ఉన్నతమైంది. Benhur లాంటి క్లాసిక్‌గా దీనిని అభివర్ణించవచ్చు.Mel Gibson, William Wallas లానే అగుపిస్తాడు. ఇందులో తన ప్రేయసిని చంపేటప్పుడు అతడూ చేతులు వెనకకు ఉంచే సన్నివేశం,యుద్ధ ప్రజలకు స్ఫూర్తిని నింపే సన్నివేశం,  Robert Bruce యుద్ధంలో వెన్నుపోటు పోడిచే సన్నివేశం, తనకు యుద్ధంలో నమ్మకద్రోహం చేసిన ప్రభువులకు అతడు సింహస్వప్నంగా కనబడే సన్నివేశం, తను తుది శ్వాస విడిచే సన్నివేశం నిజంగా చాలా అధ్భుతంగా చిత్రికరించబడి ఉంటాయి.

చరిత్రను తెరకెక్కించడం కాదు గాని, తనకు లభించిన కొద్దిపాటి సమాచారానికి, తన కాల్పానికతను జోడించించి చిత్రాన్ని తియ్యడమే గొప్ప. Mel Gibson నటునిగాను, దర్శకునిగాను  ఓ మెట్టు పైన నిలబెట్టింది చిత్రం. అందుకే ఎవరు ఊహించని విధంగా 5 ఆస్కార్లు వశమయ్యాయి.సినిమాను ప్రేమించేవారు తప్పక చూడవలసిన చిత్రం.చారిత్రక యుద్ధ నేపధ్యానికి చెందిన చిత్రాలలో ఓ ఉత్తమమైన చిత్రమని దీనిని నిస్సందేహంగా చెప్పోచ్చు.

-Sreenu Agnes

One Response
  1. బి. పవన్ కుమార్ June 5, 2016 /