Menu

సినిమా AFFAIR

రాధిక ఒక 30+ స్త్రీ,పెళ్లి అయి పదేళ్ళు,అక్రమ సంబంధం వల్ల pregnant అవుతుంది. ఈ విషయం తన భర్తకి చెప్పాలా వద్దా,చెపితే ఎలా react అవుతాడు అని ఫ్రెండ్ తో discuss చేయడం.ఇంతే LET’S TALK సినిమా కథ.వీలైతే ఈ సినిమా చూడండి.సినిమా తీయడానికి “పెద్ద కథలు” అవసరం లేదు,ఒక్క లైన్ చాలు అని నన్ను influence చేసిన సినిమాల్లో ఇదొకటి. Boman irani, MaiaKatrak, Anahitha Oberoi సినిమాలో ఈ ముగ్గురే actors. అద్భుతమైన performances, అస్సలు acting  చేస్తున్నట్టు ఉండదు, టిపికల్ గా చెప్పాలంటే కేవలం పాత్రలే కనిపిస్తాయి. Almost  మొత్తం సినిమా ఒక అపార్ట్ మెంట్ లోనే జరుగుతుంది.

రాధిక ఫ్రెండ్ తో మాట్లడుతుంటుంది తన situation గురించి, భర్త ఎలా react అవుతాడు అనే ఆమె ఊహలు మనం చూస్తాం.“Conversation  Cinema” చాలా exciting genre. పాత్రలు చాలా త్వరగా AUDIENCEకి ఫ్రెండ్స్ అయిపోతాయి. చూడటానికి చాలా సింపుల్ గా కనిపించే ఇలాంటి సినిమాలు తీయడం కష్టమే! actors performance మీదే అంతా జరగాలి.దానికి మంచి నటులు కావాలి,mumbai directors మీద ఆ విషయంలో నాకు చాల jealous. మా శీష్ మహల్ కి పాటలు రాయడానికి వచ్చినపుడు piyush mishra“నాలాంటి actors వెయ్యిమంది దొరుకుతారు ముంబైలో”అన్నాడు. అదృష్టం. పదేళ్లుగా చూస్తున్న, నాకు ఒక్క exciting actor కనపడలేదు  Hyderabad లో,నేను సరిగ్గా వెతకలేదో!

Mumbai నాటకరంగం సినిమా కి ఒక వరం. ప్రతి సినిమా లో ఖచ్చితంగా  Theatre actors  ఉంటారు. Theater  నుంచి రాకపోయినా దాన్నుంచి వచ్చిన నటులతో పని చేయడం కూడా మంచి experience. మన సినిమా కి theater చాలా చాలా దూరం,మన గోల అంతా “సినిమా theaters“ గురించే. ఎంత frustratingగా ఉంటుంది అంటే,లైఫ్ లో చేసే చిన్న పనులు కూడా natural గా చేయరు ఇక్కడి నటులు,అన్నీ“నటిస్తారు”. ఇన్ని complaints చేస్తున్న నేను కూడా లోకల్ theater  చూడను,అది నా సంస్కృతి లో లేదు,అలవాటు చేసుకోవాలి.Complaints ఆపి కొత్త నటుల్ని వెతికే పని మొదలు పెట్టాలి.శీష్ మహల్ పూర్తి అవగానే ఇదే target. మొత్తం థియేటర్ నటులతో ఒక సినిమా చేసే ప్లాన్ ఉంది.

Boman ఇరాని గురించి ఎంత రాసిన తక్కువే, just తన కోసం ఈ సినిమా చూడొచ్చు. థియేటర్ actingని సినిమాకి ఎలా అడాప్ట్ చేయొచ్చో bomanని చూసి నేర్చుకోవచ్చు.LET ‘s  TALK  కథ గానే కాదు production కూడా experimental, minidv  కెమెరా మీద షూట్ చేసి  ఫిలిం మీదకి  transfer  చేసారు,minidvనుంచి ఫిలిం transfer కోసం ఒక స్పెషల్ software కూడా డిజైన్ చేసారు అని ఒక ఫ్రెండ్ చెప్పాడు.డిజిటల్ to ఫిల్మ్ transfer చేసిన మొదటి సినిమా.

సినిమా డైరెక్టర్ రామ్ మద్వాని ఈ సినిమా చేసే timeకే international అవార్డ్స్ win ఐన ad  filmmaker. ఈ కథ  ఎవరికి చెప్పినా “worst” గా ఉంది  అని opinions  వచ్చినా కూడా తను అనుకున్నదే చేయాలి అని  ఫిక్స్ అయిపోయి చేసాడు రామ్ ఈ ఫిలిం. Independent   సినిమా గొప్పదనం అదే,నువ్వు ఏం అనుకుంటే అదే చేయొచ్చు,ఎవడైనా మన సినిమాని కెలికితే shoot చేసేయడమే. Multiplex లో పోస్టర్ చూసుకుని మురిసిపోయి గర్వపడిపోయాడు రామ్,ఈ ఒక్క reason చాలదా సినిమా తీయడానికి.“actor’s space “ on set గురించి అతను చెప్పిన మాటలు నాకైతే “మంత్రమే” .

I did not want to violate the actor’s space. Often, the actor’s mind is preoccupied by too many external factors like lighting, focus, makeup and other technical things.I didn’t want that, which is why I decided to shoot digital.

full interview – http://in.rediff.com/movies/2002/dec/12ram.htm