Menu

శీష్ మహల్లో PINK

POLITICAL INDIE కెసిఆర్ కి TRIBUTE మా SEESH MAHAL టైటిల్ లో pink . ఎన్టీఆర్ తరువాత అంత exciting తెలుగు politician కెసిఆర్ . జనాల్ని ఉత్తేజ పరిచినా ఉద్రేక పరిచినా  వీళ్ళిద్దరి తరువాతే ఎవరైనా . రూలింగ్ పార్టీ లో ఏదో ఒక పదవితో happyగా  గడిపెయకుండా సొంత ఎజెండాతో బయటకి వచ్చి పార్టీ పెట్టి రాష్ట్రం సాధించిన కెసిఆర్ greatest పొలిటికల్ indie .తెలంగాణా కోసం కాదు పదవి  దక్కలేదనే అసంతృప్తితోనే కెసిఆర్ పార్టీ పెట్టాడు అని  ఫ్రెండ్స్ చాలా మంది argue  చేసారు, ఏదైతేనేం  “అసంతృప్తి “ ముఖ్యం. ఎంత అసంతృప్తి ఉంటె ఎజెండా కూడా అంత పెద్ద గా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఇండిపెండెంట్ సినిమా కూడా “అసంతృప్తి” “అవకాశాల లేమి” నుంచి పుట్టిందే .

బలమైన వ్యవస్థలకి సమాంతరంగా నిలబడే ధైర్యం అందరికీ ఉండదు, అలా నిలబడినవాళ్ళు రాజకీయాల్లో సినిమాల్లో పెను మార్పులు తీసుకొచ్చారు. పాలిటిక్స్ లో  కెసిఆర్ లాగ తెలుగు సినిమా లో కూడా “ఒక్కడు” ఉండి  ఉంటె మన సినిమా ఇలా ఉండేది కాదేమో . తమిళ్ filmmakers కి ఎంత inspiration  ఉంది ! బాలచందర్, భారతి రాజ, బాలు మహేంద్ర ,మహేంద్రన్ , భాగ్యరాజ ఇంకా నాకు తెలియని ఎంతో మంది . వీళ్ళ సినిమాలు అన్ని life నుంచి inspire అయినవే . So called commercial  సినిమాకి సమాంతరం గా సినిమాలు తీసి చరిత్ర ని మార్చేసారు . తమిళ్ సినిమాలు  ఇప్పటికీ  డైలీ లైఫ్ నుంచి inspire  అవుతున్నవే. వాళ్లకి కథల కొదవ లేదు . మనకేమో కథలు లేవు .

కమర్షియల్ సినిమా తో సమస్య లేదు , అందరూ కమర్షియల్ “కోటి” దర్శకులు అయిపోవాలనే ఆరాటంలోనే సమస్య అంతా . Alternate సినిమా రాక పోవడానికి నిర్మాతల్ని , ప్రేక్షకులని blame చేయడం అలవాటు చేసుకుని కొత్తగా ప్రయత్నించని “direction department”ది  బాధ్యతా రాహిత్యమే .రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడి నుంచో సినిమా తీద్దామని వచ్చే దర్శకులు అందరూ ఒకే తరహా సినిమా చేయడం strange thing .

ఒక్క Hyderabad  నేపథ్యంలోనే  ఈపాటికి ఎన్ని సినిమాలు వచ్చి ఉండాలి ? అలా జరగలేదు . మా భూమి  లాంటి సమాంతర సినిమా సంచలన విజయం తరువాత కూడా అలాంటి సినిమా ఎందుకు రాలేదు అనేది ఒక mystery ! అతి తక్కువ budget లో  నగేష్ కుకునూర్ తీసిన హైదరాబాద్ బ్లూస్  లాంటి నేటివ్ సినిమా  ఒక్క సినిమా ముచ్చట అయిపొయింది . కనీసం “deccani  సినిమా”  filmmakers  ఏదో ఒకటి ప్రయత్నిస్తూనే ఉన్నారు . పంజాగుట్ట దాటని sophisticated  filmmakers  ఇంకా  హీరో కథలు  రాసుకుని budgets  కోసం  ఎదురుచూస్తున్నారు .

మన సినిమా లో Secunderabadని ఎప్పుడైనా చూసారా ? railway station  బోర్డు తప్ప .ఇప్పటిదాకా అంటే “ఫిలిం”  మీద  తీయటం costly అనే reason  తో ఆగిపోయాం, digital  విప్లవం  తరువాత కూడా కొత్తగా ఏదో ఒకటి చేయకపోతే  బాగోదేమో ! ప్రతి భాష లో ప్రాంతీయ సినిమా  filmmakers NEW WAVE వైపు  దూసుకుపోతున్నారు , వాళ్ళ సినిమాని అంతర్జాతీయం చేస్తున్నారు . ఇవన్ని కూడా low  budget independent  సినిమాలే , కమర్షియల్ గా మంచి విజయాల్ని  సాధిస్తున్నాయి . మనకేం తక్కువ ?

తెలంగాణా రాష్ట్రం వచ్చాక కెసిఆర్ ఖచ్చితంగా లోకల్ సినిమా కి ఏదో ఒకటి చేస్తారు అనే ఆశ ఉండేది , ఇంకా ఉంది . సారు మనకి encouragement  ఇచ్చేలోపు  మన పని మనం కానిద్దాం , ఆయన రాష్ట్రం సాధించిన విధానమే మనకి స్ఫూర్తి. మనం పార్టీలు పెట్టక్కర్లేదు , సంఘాలు స్థాపించాల్సిన పని లేదు . కెమెరాలు తీసుకుని ఊరి మీద పడదాం , DECCANI CINEMA అంటే ఓల్డ్ సిటీ comedies మాత్రమే కాదు ఇంకా చాలా  చూపిద్దాం ప్రపంచానికి . మన అస్థిత్వాన్ని చాటుదాం . సినిమాలు తీస్తే పోయేదేమీ లేదు డబ్బులు తప్ప .

సమాంతర స్వతంత్ర సినిమా సాధ్యమే