Menu

శీష్ మహల్లో Gulzaar, Ranbir, Thammareddy & Nallari

ఈ రోజు పొద్దున్నే భరత్ వ్యాస్ నుంచి message , మీ సినిమా  మొదలై రెండు సంవత్సరాలు  అయిన  సందర్భంగా మాకేం లేదా ? అని… చాయ్ biscuit అని రిప్లై ఇచ్చాను . సమైక్య రాష్ట్రం లో జరిగిన చివరి Children’s  film  festival  లో తీసిన సినిమాగా మా   “శీష్ మహల్”  చరిత్ర లో నిలిచిపోతుంది. ( ఇలా ఏదో ఒకటి అనుకోకపోతే motivation ఉండదు , నిర్మొహమాటంగా మన సినిమా గొప్పలు మనమే చెప్పుకోవాలి ) . Shooting మొదటి రోజు , ప్రతి  దర్శకుడికి special day నే , అప్పటికే నేను  రెండు మూడు ఆగిపోయిన projects  చేసి ఉండటం వల్ల  నాకు  అలాంటి special  feeling  ఏమి లేదు . Gnana  షూట్ చేస్తున్నాడు అనే excitement  ఒక వైపు , CFF లాంటి పెద్ద ఈవెంట్ లో మా actors ని పెట్టి  scenes ఎలా షూట్ చేస్తామో అనే tension  ఒక వైపు . ఎందుకంటే నేను, ఇంకో ఇద్దరు ముగ్గురు తప్ప టీం లో అందరూ కొత్త వాళ్ళే .

Shoot కి ముందు రోజు CFF లో షూట్ చేయడానికి మాకు 10 work passలు దొరికాయి ,  last  minute లో  idea  విని  అజిత్ నన్ను వేదకుమార్ గారి దగ్గరకి తీసుకెళ్ళాడు , ఆయనకి  5 నిమిషాల్లో కథ చెప్పాను. నా ఫ్రెండ్స్ కాకుండా మొదటి appreciation ఆయనదే , చాలా బాగుంది  కానీ ఇప్పటి దాకా పాస్ లు ఎందుకు అప్లై చేయలేదు అని అడిగి , సెక్రటరీ ని పిలిచి ఎట్లైన సరే మాకు పాస్ లు  arrange చేయమని చెప్పారు ,Special thanks  to  అజిత్  & వేదకుమార్  గారు .

మేము అనుకున్న టైం కన్నా గంట లేట్ గా reach అయ్యాము , Gnana తో పాటు ఎడిటర్ Sravan  కూడా వచ్చాడు షూట్ కి . మా దగ్గర ఒక 5D , blackmagic , gopro , 60D  cameras  ఉన్నాయి , event లో ఏది మిస్ అవకూడదు అనే కక్కుర్తి తో నాకున్న resources లో  equipment  arrange  చేసుకున్నాం . ఈ cameras  సినిమాలో props  కూడా . ఇది కాక Sync Sound , ఈ ఐడియా రోహిత్ ది , నాకు ఫస్ట్ టైం .

నాలుగు కథల్లో ఒకటైన  documentary filmmaker  scene  మాత్రమే షూట్ చేస్తున్నాము ఆరోజు , తన టీంతో  film  festival  opening ని కవర్  చేసే సీన్ ,అప్పటికే గంట లేట్ అవడంతో అదే situation scene కి adopt  చేసి , filmmaker  కథ ప్రకారం గంట లేట్  అయినట్టు , tension  పడుతూ festival  లో already  wait  చేస్తున్న టీంని  వెతుక్కుంటూ  enter అవడం …. METAదనం, మేము ఏం చేయడానికి ట్రై చేస్తున్నామో దాన్నే recreate చేసే ప్రయత్నం … అంత META moment మాకెంత కిక్కో … పిచ్చ నా …. అనుకుంటున్నారు కదా ! helpless ….

Gnana 5D మెడలో వేసుకుని ఫస్ట్ shot  compose  చేసి, ready  Sasi  అన్నాడు , అది నాకు one of the most exciting  moments  శీష్ మహల్ మేకింగ్ లో  (  కొంచెం మెలోడ్రామ ).  Filmmaker  walking , back shot , Gnana ఫాలో  అవుతున్నాడు , నేను  Gnana ని ఫాలో  అవుతున్నాను షాట్ చూస్తూ , RETAKE – second టేక్ చేస్తున్నపుడు , మాకు oppositeలో Gulzaar సాబ్ festival  లోకి  ఎంటర్ అవుతున్నారు , పక్కన  ప్రెస్ వాళ్ళు ఉన్నారు . చాలా  ఫాస్ట్ గా నడిచి వెళ్ళిపోతున్నారు ఆయన , నేను పిచ్చ ఎక్సైట్ అయిపోయి , షాట్ చూడటం మానేసి , రోహిత్ కి కాల్ చేసి Gulzaar మీ వైపు వస్తున్నారు  ఉన్న camerasలో ఏదో ఒక దానితో  షూట్  చేయండి  అని ఫోన్ చేసి చెప్పాను , కానీ చేసారో లేదో తెలియదు . చేసారు , మా సినిమాలో గుల్జార్ సాబ్ గెస్ట్ రోల్ .

ఫస్ట్ షాట్ తరువాత we were unstoppable , situation కి తగ్గట్టు మా  actorsని  position  చేస్తూ చాలా షాట్స్ తీసాము . లలిత కళా తోరణం రచ్చగా ఉంది , పిల్లలు , పేరెంట్స్, మీడియా, పోలీసులు …. మాటలు వినపడనంత సౌండ్ setup …. ఎవరినైనా పక్కకి జరగండి అని చెప్పేంత control కూడా లేని పరిస్థితి …. కానీ అదేమీ పట్టడం లేదు మాకు ….  Gnana తీస్తున్న ప్రతి షాట్ కి నా confidence  levels  పెరిగిపోయాయి , ప్రతి షాట్ magical గానే అనిపించింది ,  ఇటువంటి షాట్స్ తెలుగు సినిమా లో ఎవరూ తీయలేదు,అది చాలు ,ఈ సినిమా కంప్లీట్ అవుతుంది అనే నమ్మకం వచ్చేసింది.

మధ్య లో తమ్మారెడ్డి భరద్వాజ్ entry , ఇంకో సెలబ్రిటీ గెస్ట్ రోల్

stage  మీద పిల్లల తో Ranbir కపూర్,  గెస్ట్ రోల్#3

సమైక్య రాష్ట్ర CM నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి స్పీచ్ , గెస్ట్ రోల్#4

మా first  day rush చూసి ఫ్రెండ్ ఒక మాట అన్నాడు , తోట తరణి సెట్ వేసి , 2-3వేల మంది junior artistes ని తీసుకొచ్చిన ఇంత GRAND షాట్స్ దొరకవు అని.

జీవితం సినిమా కన్నా GRAND  DRAMA