Menu

శీష్ మహల్లో ENTER THE BABA

Flash Back

రెండువేల పదమూడు, నవంబర్ పదమూడు , ఇదే రోజు నేను మా శీష్ మహల్ young rebel team చాలా బిజీ గ ఉన్నాం . అందరం చిత్రలేఖ స్టూడియో లో gather అయ్యాం , ఈ స్టూడియో అజిత్ నాగ్ అనే friendది. అంత మంది కలవటానికి మాకు ప్లేస్ లేదు , ఇండిపెండెంట్ సినిమా కి ఉన్న గొప్ప quality “అన్ని మనవే అందరూ మనోళ్ళే “ అనే నమ్మకాన్ని కలిగిస్తుంది . అవతలి వాళ్ళు చేతులు ఎత్తేదాకా  వీలైనంత  వాడేయటమే, అంతకు మించి పెద్ద option ఏమి ఉండదు .

నవంబరు 11 రాత్రి దరిద్రం football ఆడకపోయినా గోలీలాట ఆడుతోంది . అప్పటికే “ధూల్పేట్ గణేష” అనే డాక్యుమెంటరీ 24 గంటల footage hard disk  లో  పడి  ఉంది ,  edit అవటం లేదు , దానికి చాల మంది ఫ్రెండ్స్ హెల్ప్ చేసారు . దానికి ముందు తెలంగాణ ఉద్యమ సమయం లో ఒక సమ్మె backdrop  లో సినిమా తీద్దామని friendsని  motivate  చేసి  నిజంగా సమ్మె జరుగుతున్న రోజు షూటింగ్ ప్లాన్ చేసాం , ఆ రోజు చాలా scenes  తీసేయాలి ; తెలంగాణా ఉద్యమంలో పాటలు పాడుకుంటూ ఊరి వదిలి వెళ్ళిపోయిన తమ్ముడిని వెతుక్కుంటూ ఒక అన్న సిటీ కి రావటం , సమ్మె రోజు అతను ఎలాంటి  situations face చేసాడు  అనేది కథ . మాకు పూర్తి కథలు రాసే అలవాటు లేదు . oneline ఆర్డర్ తో షూటింగ్ చేసేయటమే . “సమ్మె” సినిమా షూటింగ్ మధ్యాహ్నం అయ్యేసరికి almost ఆగిపోయే level  కి వచ్చేసింది , ఎందుకంటే మేము అనుకున్నట్టు సమ్మె ప్రభావం పెద్దగా లేదు . అప్పటికి కొన్ని ఇంటరెస్టింగ్ సీన్స్ తీసాము , ఆ footage ఎక్కడుందో తెలియదు . ఈ సినిమా షూట్ చేసింది జయకృష్ణ గుమ్మడి.   రాత్రి అందరం మందు కొడుతూ shooting మీద jokes  వేసుకుంటూ ఆ సినిమా ఆపేశాం .

so  నాకు “incomplete  man “ అనే reputation  వచ్చేసింది . కానీ ఇంకో సినిమా తీయటం గురించి plans వేయడం ఆపలేదు . మళ్ళీ ఇంకో ఫిలిం స్టార్ట్ చేయాలి ఈ సారి docu కాకుండా fiction plan చేశాను , రెండు రోజుల్లో international  children’s  film festival   మొదలవుతోంది , “D P గణేష “  “సమ్మె” shootings experience తో ఈసారి ఎలాగైనా complete అయ్యే project చేయాలి అని కథ కోసం ఆలోచిస్తుంటే first వచ్చిన idea “multi plot “ set  against  film  festival  , నాకు తెలిసినంత వరకు అటువంటి backdrop లో సినిమా రాలేదు . చాలా interesting  visuals   అయితే  ఖచ్చితంగా  వస్తాయి అని ఒక నాలుగు characters అనుకుని one line order  రాసేసాను .

next day writer రోహిత్ కి కథ చెప్పాను , అప్పటికే మేమిద్దరం ఒక ఆటో వాడి లవ్ స్టొరీ మీద వర్క్ చేస్తున్నాము , అది పక్కన పెట్టి దీని మీద వర్క్ మొదలుపెట్టాము , అదే రోజు రాత్రి రోహిత్ ఫ్రెండ్స్ ని , నా ఫ్రెండ్స్ ని పిలిచి ఒక వార్ రూం range  మీటింగ్ arrange చేసి అందరిని ఒక రూం లో కూర్చోపెట్టి కథ చెప్పాను  , 15minutes  లో narration  అయిపొయింది , అందరూ DONE అనేసారు.  ఎవరు ఎలాంటి help/పనులు చేయగలరో డిసైడ్ చేసుకుని , 13th మార్నింగ్ చిత్రలేఖ లో మీటింగ్ . కొంతమంది bikes మీద theatres  ఫొటోలు తీసుకురావడానికి వెళ్లారు ,  నేను రోహిత్ కథ  scenes అనుకుంటూ actors ని finalize  చేస్తున్నాము , ఒకరిద్దరు తప్ప అందరూ  non  actors  & first timers  , చాల వరకు మా టీం లో వాళ్ళు కూడా actors  అయిపోయారు ఈ సినిమా లో, నేను, రోహిత్ కూడా

రోహిత్ కి కెమరామెన్ ఎవరు అనే worry ఉంది, నాకు ఒక ఐడియా ఉంది కానీ వర్కౌట్ అవుతుందో లేదో అని డౌట్ ….. try చేస్తున్నా , ఆ రోజు రాత్రి 11-30 కి cameraman ఎవరో  confirm  అయిపొయింది … నేను రాకేష్ వెళ్లి కథ, కబుర్లు చెప్పుకుని ఫైనల్ చేసి రోహిత్ కి కాల్ చేసి చెప్పాను,  typical గా “జ్ఞాన is  in  “ . ఇండస్ట్రీ లో చాలా వరకు “BABA” గానే తెలుసు జ్ఞాన శేఖర్ ,

నేను industry వాణ్ని కాదు కాబట్టి నాకు Gnana నే .