Menu

శీష్ మహల్లో CHILDREN OF HEAVEN

ఫైసల్ పాషా  శాలిబండ సుధా థియేటర్ లో కాంటీన్ నడుపుతుంటాడు , అదే థియేటర్ లో children’s film festival screenings జరుగుతుంటాయి .  ఓల్డ్ సిటీ లో ఉన్న పాత థియేటర్ కాబట్టి ఇక్కడ సినిమా లు చూడటానికి వచ్చే పిల్లలందరూ mostly గవర్నమెంట్ స్కూల్స్ నుంచే, వీళ్ళని  ప్రభుత్వమే బస్సుల్లో తీసుకొస్తుంది. చాలా గోల గోల గా ఉంటుంది , పిల్లలకి పండగే . అసలు ఇంత ఖర్చు పెట్టి film festival ఎందుకు  చేస్తున్నారో ఫైసల్ కి అర్ధం కాదు , ఇవన్ని డబ్బులు తగలబెట్టే పనులు అని అతని opinion . పిల్లల ని కాంటీన్ దగ్గరకి టీచర్స్ వెళ్ళనివ్వరు , canteen బాయ్ గోపాల్ ఇంకో ఇద్దరు థియేటర్ లోపలికి వెళ్లి సమోసాలు అమ్ముతుంటారు . ఈ festival అయ్యేదాకా తన బిజినెస్ డల్ అయిపోతుంది అని ఫైసల్ కి కోపం. ఇంకో ముఖ్య కారణం అతని entertainment మిస్ అయిపోతోంది , రోజూ బోర్ కొట్టినప్పుడల్లా థియేటర్ లోపలికి వెళ్ళి ఒక పాటో ఫైటో చూసి రావటం అతని టైం పాస్ , అది కూడా లేదు ఇప్పుడు , ఈ అంతర్జాతీయ పిల్లల సినిమాలు బోర్ కొట్టిస్తుంటాయి . అప్పటికి ఆగలేక చూద్దామని లోపలికి  వెళ్లి నిమిషం లోపే బయటకు వచ్చేస్తుంటాడు . film festival అయిపోవడానికి ఒక రోజు ముందు ఫైసల్ రొటీన్ గా theatre లోకి వెళ్తాడు ,  screening  జరుగుతున్న సినిమా కొంచెం ఇంటరెస్టింగ్ గా అనిపించి కూర్చుని మొత్తం సినిమా చూసేస్తాడు.  అతను చూసిన సినిమా CHILDREN OF HEAVEN .

ఇది క్లుప్తంగా శీష్ మహల్ నాలుగు కథల్లో ఒకటి . సినిమా లో ఫైసల్ కథ మొత్తం deccani ఉర్దూ లోనే ఉంటుంది . ఈ సీన్, షూటింగ్ start అయిన మూడోరోజు చేసాం. ఫైసల్ ఏ సినిమా చూస్తాడు అనేది ముందు రోజు నేను, జ్ఞాన, రోహిత్ decide అయ్యి , ఫైసల్ character చేసిన Feroze కి చెప్పాము , అతను చాలా ఎక్సైట్ అయ్యాడు అది అతని fav సినిమా. అయితే ఫైసల్ సినిమా చూడటం కన్నా important సినిమా చూసాక కాంటీన్ బాయ్ గోపాల్ కి C.o.H కథ మొత్తం చెపుతాడు . ఈ సీన్ కొంచెం dramatize చేద్దామని అనుకుని  మినీ క్రేన్ సెటప్ తెప్పించాము , ఇదే అతి పెద్ద equipment మేము సినిమాలో వాడింది . crane, track & trolley  తో డ్రామా ఎలా వస్తుంది అనేది నాకు పెద్ద అవగాహన లేదు , ఇలాంటి సీన్ కి చిన్న మూమెంట్ ఉంటె బాగుంటుంది అని మాత్రమే తెలుసు .

ఒక పక్క ఫెస్టివల్ జరుగుతోంది, పిల్లలు వచ్చేలోపు ఈ సీన్ తీసేయాలి , feroze  empty థియేటర్ లో కూర్చుని meditation  చేసుకుంటున్నాడు ,  సీన్ సెటప్ చేస్తున్నాము . కానీ  మేము ప్లాన్ చేసినట్టు  జరగలేదు .  మేము రెడీ అయేసరికి పిల్లలు వచ్చేసారు. చేయటానికి ఏం లేదు , పిల్లలందరూ సినిమా చూడటానికి లోపలికి వెళ్ళేదాకా ఆగాల్సిందే . screening మొదలైంది , సీన్ తీయడానికి మేము రెడీ కానీ కాంటీన్ బాయ్ గోపాల్ కనపడటం లేదు . అక్కడ కాంటీన్ లో పని చేస్తున్న గోపాల్ నే ఆ character కి ఫిక్స్ అయి ముందు రోజు షూట్ లో ఒక పెద్ద సీన్ కూడా తీసేసాం . కాసేపటికి గోపాల్ థియేటర్  లోంచి  empty కార్టన్ తో బయటకు వచ్చాడు , ఎక్కడికెల్లావ్ గోపాల్ అంటే ,

“సమోసాలు అమ్మకపోతే మా ఓనర్ తిడతాడు అన్నా “

మా బాధ సినిమా గురించి , వాడి బాధ సమోసాల గురించి . Coffees & Cigarettes లాగ   సినిమాలు & సమోసాలు అని ఒక ఫిలిం తీయొచ్చు.

సీన్ తీయటం మొదలుపెట్టాము , ఏం చేయాలి అన్నా అని గోపాల్ అడిగితే , ఏం లేదు ఆయన కథ చెపుతాడు కూర్చుని విను , ఇంతకన్నా ఏం చెప్పాలో అర్ధం కాలేదు . feroze  బాగా ప్రిపేర్ అయి ఉన్నాడు.  ఎంత కథ చెప్పించాలి, children of heaven  ని బ్రీఫ్ గా ఎలా చెప్పాలి ఇవన్ని ఏం అనుకోలేదు , తీయటం మొదలుపెడితే అర్ధం అవుతుందిలే అని షూటింగ్ మొదలుపెట్టాం.అప్పుడపుడు లోపల నుంచి పిల్లల అరుపులు తప్ప బయట అంతా చాలా quite గా ఉంది .

feroze కథ చెప్పటం మొదలుపెట్టాడు , చాలా intense గా animated గా చెపుతున్నాడు . నాకు ఒక పక్క డౌట్, ఇప్పటిదాకా ఫైసల్ క్యారెక్టర్ ని establish చేసింది వేరు , ఇక్కడ వేరే గా అనిపిస్తోంది . ఏమైతే అయింది లే, “ సినిమా లో కథ చెప్పటం” అనే సీన్ interesting , అని  నన్ను నేను convince  చేసుకుని షూట్ లో involve  అయిపోయాను. నేను చేయటానికి ఏం లేదు , feroze  కథ చెపుతున్నాడు , గోపాల్ వింటున్నాడు , gnana షూట్ చేస్తున్నాడు . రెండు angles లో తీసాక , గోపాల్  close up  , feroze suggestion లో తీస్తున్నాము . feroze  కథ continue  చేస్తున్నాడు , మధ్య లో గోపాల్ “ఒక్క నిమిషం అన్న” అని పక్కనే ఉన toilet లోపలికి  వెళ్లి మొహం కడుక్కుని వచ్చాడు , రోహిత్ అడిగాడు ఎందుకు మొహం కడిగావు అని,  “ఏడుపొస్తోంది అన్న” అన్నాడు . ( మీ టార్చర్ తట్టుకోలేక ఏడ్చుంటాడు అనే ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు నాకు ) గోపాల్ close up  సినిమాలో చూస్తే అతను ఎంత involve అయి విన్నాడో మాకు అర్ధం అయింది , audience సంగతి  అనవసరం .

గోపాల్ ని కాంటీన్ లో చూసి interesting  గా  ఉన్నాడు , ఒక సీన్ లో “వాడదాం “ అనుకున్నది almost  సినిమా లో అయిదో కథ అయిపొయింది . ఈ ఒక్క సీన్ అయిన Majid Majidi  కి చూపించాలని నా కోరిక . ఈ సీన్ చాలా పెద్ద సీన్ ,  2013 festival లో  children of  heaven స్క్రీనింగ్ జరగలేదు , ఈ సీన్ ఇరానియన్ సినిమా కి మా tribute .

ఇరానియన్ సినిమాల్లాంటివి మనం కూడా ఎన్ని చేయొచ్చో !