Menu

మన పిల్లల సినిమాలు

పెద్దల సినిమాలే పిల్లలు ఎందుకు చూడాలి?పిల్లల బుక్స్ టాయ్స్ ఉన్నపుడు పిల్లల సినిమా మీద మనకెందుకు చిన్న చూపు?ఎందుకంటే మనం పిల్లలుగా ఉన్నపుడు పిల్లల సినిమా లేదు కాబట్టి,ఇలా తర తరాలుగా సాగిపోతోంది కాబట్టి .ఈ మధ్య ఒక జయమాలిని పాట చూస్తుంటే,నేను 3ఏళ్ళ వయసు నుంచి చూసిన most of the films లో అలాంటి ఐటెం నంబర్స్ ఉండేవి.కుటుంబ సమేతం గా  సినిమాలు చూసేవాళ్ళం,అటువంటి పాటలనే కాదు,entertainment  పేరుతో చూపించే  లేకి విషయాలన్నీ పిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి?ఏమో ఒక రకం గా మంచిదేనేమో చాలా చిన్న వయసులో లేకితనానికి expose అయిపోతారు,అయితే దానికి దూరం అవుతారు లేకపోతే లేకి వీరులైపోతారు.

మన సినిమాలన్నీ కుటుంబ కథా చిత్రాలే కాబట్టి సినిమాల తీతలో పెద్దగా మార్పు రాలేదు.చూసేవాళ్ళ opinions కూడా ఒకే రకంగా ఉంటాయి.Technology ఇంత మారిపోతోంది నెక్స్ట్ generation kids ఎలా ఉంటారో అనిపించేది,మిగతా విషయాల్లో నాకు తెలియదు, సినిమా విషయంలో మన కిడ్స్  దారుణం.వీళ్ళకి సినిమా విషయంలో హైయెస్ట్ ప్రయారిటీ కులం అయిపొయింది,అమ్మాయిలు అబ్బాయిలు తేడా లేదు, అవతలి కులం వాడి సినిమాని దుమ్మెత్తి పోయటమే పని.Smart phoneలతో కుల యుద్ధాలు.వీళ్ళు hopeless వీళ్ళని వదిలేద్దాం,కొట్టుకుంటూ ఉంటారు.

ఇన్ని రోజులు అంటే ఫిలిం మీద పిల్లల సినిమాలు తీసి ఎందుకు డబ్బులు నాశనం చేసుకోవాలి అనే ఉద్దేశంతో వాటి జోలికి వెళ్ళలేదు.ఇప్పుడు తియాల్సిందే,Lunch Box 5లక్షల్లో తీసారు, లాభాలు వచ్చాయి,మరాఠీలో తీస్తున్నారు.అక్కడ ఇటువంటి చిన్న సినిమాలకి ప్రభుత్వ support చాలా ఉంది.మనం కూడా రెండు తెలుగు ప్రభుత్వాల్ని  అడుగుదాం,ప్రోత్సహిస్తే పిల్లల సినిమాలు  తీసి తెలుగు సినిమాని కాపాడుకుంటాం అని.లేకపోతే ఇప్పుడొస్తున్న సినిమాలే చూసి భ్రష్టుపట్టి పోతారు పిల్లలు.అడల్ట్ సినిమా మారాలంటే పిల్లల సినిమా చాల అవసరం,పిల్లల జీవితాల్లోని చిన్న చిన్న విషయాలని “entertaining” గా  తీయొచ్చు.

పిల్లల సినిమా గురించి మాట్లాడే ప్రతి సారి ఇరానియన్ సినిమా గురించి చెప్పాల్సిందే,వాళ్లకి అంటే restrictions వల్ల ప్రతిదీ “children’s cinema” తోనే చెప్పారు. ఒక సినిమాలో పొరపాటున తన ఫ్రెండ్ బుక్ తీసుకోచ్చేసిన కుర్రాడు పక్క ఊరికి వెళ్లి అది తిరిగి ఇవ్వటానికి ప్రయత్నించడం,ఆ క్రమంలో వాడు కొన్ని “కొత్త విషయాలు” experience చేస్తాడు,కొత్త మనుషుల్ని కలుస్తాడు.ఇలాంటి కథలు ఎన్ని దొరకవు మనకి,రాయాల్సిన అవసరం కూడా లేదు వాళ్ళతో మాట్లాడితే  చాలు పిల్లలే చాలా కథలు చెపుతారు. Kung Fu panda చూసే వీళ్ళని entertain చేయలేము అనుకుంటే ఏం చేయలేము. వాళ్ళకి దగ్గరవ్వాల్సిన బాధ్యత మనది.అవసరం కూడా.

మీరా నాయర్ ప్రతి interview లో ఒక మాట చెపుతుంది “మన కథలు మనం చెప్పకపోతే ఇంకెవరు చెపుతారు” అని.

Salaam Bombay సినిమా తరువాత అక్కడితో ఆగిపోకుండా,ఆ సినిమా కి వచ్చిన profits తో salaam baalak అనే సంస్థ స్థాపించి ఇప్పటికి 18 సంవత్సరాల పైనే అయింది, ఢిల్లీ,ముంబై లో 20+ centers నడుపుతోంది వీధి బాలల కోసం. ఆ సినిమా లో act చేసిన కిడ్స్ అందరు కూడా స్ట్రీట్ కిడ్సే,వాళ్ళలో చాలా మంది అదే సంస్థ లో పనిచేస్తున్నారు. ఒట్టి స్ట్రీట్ కిడ్స్ లాంటి కథలే అవసరం లేదు,ఎలాంటి చిన్నపిల్లల కథ అయిన అది సమాజానికే సంబంధించింది అయి ఉంటుది.

రెగ్యులర్ తెలుగు కమర్షియల్ సినిమాలకే అంత డబ్బులు పెట్టి పేరెంట్స్ తీసుకెళ్తుంటే,పిల్లల సినిమా బాగుండి,దానికి ప్రభుత్వ రాయితీ ఉంటె,ఎందుకు చూడరు?భారీగా ఏం తియక్కర్లేదు చిన్న కథలతో తక్కువ నిడివిలో మంచి సినిమాలు తీయటానికి ప్రయత్నిద్దాం.వంటలకే channels పెడుతున్నపుడు content ఉండాలేగాని పిల్లల సినిమా ఛానల్ కూడా పెట్టొచ్చు.నాకు తెల్సు ఏదో ఫెయిల్ ఐన ఛానల్ reference ఇస్తారు అని,అయినా సరే నాకు ఆశ ఉంది.

ఒక “కొత్త సినిమా”కి expose అయ్యే kids ఖచ్చితంగా కొత్త సినిమాని సృష్టిస్తారు,ఇపుడున్న సినిమా hopeless,కనీసం ఐదు పదేళ్ళ తరువాత అయినా తెలుగులో “new cinema “ చూడాలంటే పిల్లల సినిమా అవసరం ఉంది.

ప్రపంచ సినిమాని తెలుగు వాళ్లకి తొమ్మిదేళ్లుగా పరిచయం చేస్తున్న నవతరంగం వెంకట్ లాంటి వాళ్ళు పూనుకుంటే వెనక నడవటానికి నేను రెడీ.నేనే చేయొచ్చు ఆ పని,నావన్ని చిన్న పిల్లల లాంటి plans  అని నా చుట్టూ ఉన్న “పెద్దల” నమ్మకం.

మేము ఆల్రెడీ మొదలు పెట్టిన ఒక “పిల్లల పెద్దల” సినిమా వచ్చే సమ్మర్ కి థియేటర్స్ లోకి తీసుకు రాగలం అనే నమ్మకం ఉంది.

 

One Response
  1. Jagadeeshprathap93@gmail.com August 31, 2017 /