Menu

దర్శకులు – గడ్డాలు

Growing a beard is like an indie film;it requires patience,care,delusion,stubborn determination, ego,revulsion for society,confidence in the process and an appreciation for the slowing things in life   – Men with Beards ( 2013 )

దర్శకులు గడ్డాల గురించి రాద్దామని online రీసెర్చ్ చేస్తున్నపుడు దొరికిన quote ఇది. ఈ ఒక్క quote చాలు నేను  ఇంకో అడుగు గడ్డం పెంచుకోవటానికి. ఆ ఉత్సాహం తోనే featured imageలో నా ఫోటో కూడా గొప్ప దర్శకుల పక్కన పెట్టేసుకున్నా.ఎవడికి తెలుసు తీస్తున్న సినిమా release అయ్యాక ఏమైనా జరగచ్చు.

అసలు దర్శకుల గడ్డాల గురించి ఎందుకు  రాయాలి?ఊరికే!ప్రపంచంలో ఎంత మందికి లేవు గడ్డాలు?కానీ director అవడానికి try చేస్తున్నవాడు పెంచితే, “ ఏంటి రా ఆ గడ్డం మేధావిని  అనుకుంటున్నావా “…. అంత లేదండీ బాబు అని చెప్పినా వినరు,ఆ టాపిక్ మీద కాసేపు వాణ్ని football ఆడి వదులుతారు.అయినా మా గడ్డాలతో మీకేంటి నష్టం? పెంచుకునేది మేము, పీక్కునేది మేము,దురద గోక్కునేది మేము.ఎంత కష్టమో  మీకేం తెలుసు?కానీ బాగా ఇష్టమైన కష్టం,గడ్డం గురించి అడిగిన వాళ్ళకి రెటమతంగా జవాబు ఇవ్వడం లో ఒక ఆనందం ఉంది,సమాజాన్ని దిక్కరిస్తున్నాము అనే కిక్,తెలుసు అది false అని ఇలా పిచ్చి వాగుడు వాగితే అడుక్కుతిని పోతావు అని మీరు అంటారు,పర్లేదు.

అయినా అంతంత పొట్టలు పెంచుకుని,కొవ్వు పెంచేసుకుని తిరిగే వాళ్ళ కన్నా దారుణం ఏమి కాదు. అదెంత అనారోగ్యం?ఇది జస్ట్ ఒక బ్లేడ్ తో తీసేయొచ్చు,ఆ కొవ్వు కోయాలంటే ఎంత ఖర్చు,రిస్కు?మనం worry అవాల్సిన వాటి గురించి పట్టించుకోం.

ఇంకో online ఆర్టికల్ లో గ్రేట్ గడ్డాల దర్శకుల ఫొటోస్ చూస్తుంటే ఎంత ఆనందమో, గడ్డం  నిమురుకుంటూ చదివాను. Kubrick ,marty, coppola, lucas, terrence mallick, spielberg , haneke, ridley scott ,mike lieghe …. ఇంకా చాల మంది.మనకి కూడా చాలా మందే ఉన్నారు.గడ్డాలు  పెంచే వాళ్ళందరూ గొప్ప దర్శకులు కాలేరు.

RGV కి గడ్డం ఉందా?ఎంత తిట్టుకున్నా గొప్ప దర్శకుడు కాదు అనగలమా?Tarantino?గడ్డాలు లేని ఈ దర్శకులు ఇద్దరు intense violence స్క్రీన్ మీద చూపించారు,గడ్డం ఉంటే intense & passionate అనేది ఒట్టి అబద్ధం.

Director అయ్యే ప్రాసెస్ లో డబ్బులు లేకో, బద్ధకం తోనే పెంచే గడ్డం మెల్లిగా addiction అయిపోతోంది, అద్దంలో చూసుకున్న ప్రతిసారి ఈ దిక్కుమాలిన face కి  ఏదో ఒక character add  చేస్తోందిలే అని కన్విన్సు చేసుకుని పెంచేస్తుంటారు.ఈ conviction కాస్తా మొండితనం గా మారిపోతుంది. అంతేగాని మేధావి అనిపించుకోవాలనో, ఇష్టమైన దర్శకుడికి గడ్డం ఉంది కదా అని పెంచాలంటే కష్టమే.

రాజమౌళిలా గడ్డం పెంచగలం కాని బాహుబలి తీయగలమా? చాన్సే లేదు.

 

  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *