Menu

The Goob – a Teenage boy

ఇదొక ఇండిపెండెంట్ సినిమా తరహాలో ఉంటుంది. కథ రెగులర్ సినిమా ఫార్మాట్లో ఉండదు.
ఒక టీనేజ్ యువకుడి పరిచయం..పరిస్థితులు..కొన్ని సన్నివేశాలు మాత్రమే ఈ సినిమా.

గూబ్  పదహారేళ్ల కుర్రాడు. గూబ్ కి  వేసవి సెలవులు మొదలవుతుతాయి. సెలవుల్లో సరదాగా ఆటాపాటలతో సరదాగా గడుపుదామనుకుంటాడు.
గూబ్ కి  తల్లి,  ఆమె మగతోడు (బాయ్ ఫ్రెండ్)  ఉంటారు. తల్లి అమాయకురాలు..తోడులేక బతకలేనిది. ఆమె బాయ్ ఫ్రెండుకి  ఆడపిచ్చి, కనపడ్డవాళ్ళని కావాలనుకునే తత్వం..కోపమెక్కువ, అధికార తత్వం. ఎవ్వరినీ సహించడు,గూబ్ మీద అజమాయిషీ చేస్తుంటాడు.
వీళ్ళిద్దరిమధ్య తెలియని విరోధం.

సెలవులమూలాన  పొద్దునంతా తమ గుమ్మడితోటలో పని చేయటం ..రాత్రి దానికి కాపలా కాయటం గూబ్ పని. అయినా  ఎక్కడ సమయం చిక్కినా  అక్కడ సరదాగా గడుపుతుంటాడు.వయసు ప్రభావం అలాంటిది. తన తల్లి మిత్రుడి లీలలన్నీ తెలిసినా తల్లికి చెప్పడు.

గూబ్ సరదాగా గడుపుతున్న ప్రతిసారీ అతడు పడనీయడు.
తోటలో పనికోసం వచ్చిన ఓ అమ్మాయితో గూబ్ కి స్నేహం కుదిరి చనువుపెరగుతుంది కానీ ఆ పిల్ల మీద వాడికన్ను కూడా పడుతుంది. గూబ్ ని ఆ అమ్మాయినీ కలవనీయడు.  చివరికి ఆ గూబ్ స్నేహితురాల్ని కూడా బలవంతం చేయబోతాడు. గూబ్ అడ్డుకొని విడిపిస్తాడు. అంతకంటే ఏమీ చేయలేడని వాడికి తెలుసు. గూబ్ తల్లికి కూడా ఆ విషయం తెలిసినా నిస్సహాయంగా ఆ విషయాన్ని వదిలేయమంటుంది గూబ్ ని.  గూబ్ తల్లిని అర్థం చేసుకుంటాడు.
గూబ్ తనవాహనాన్ని తీసుకొని…ఎక్కడికో బయలుదేరతాడు. !!

ఈ సినిమా సినిమాలాగా ఉండదు. కథా…కథనంలో ఏదో వెలితి ఉంటుంది. కొన్ని పాత్రలూ..సన్నివేశాలూ అనవసరం అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు అక్కరలెని ఉపకథల్లాగా వచ్చిపోతాయి. కొన్ని అనవసర విషయాలు చెప్పారేమో అని అనిపిస్తుంది.

అయితే ఇది డాక్యుమెంటరీ ఫిల్మేకర్ Guy Myhill అనే ఒక నూతన దర్శకుడి సినిమా. అతడు ఆ డాక్యుమెంటరీ స్టయిల్ని వదల్లేకపోవటం వల్ల అలా అయిఉండవచ్చు. లేక సినిమా కథచెప్పేపద్దతులమీద పూర్తి అవగాహన లేకా కావచ్చు. లేదా తెలిసీ తెలిసీ ఇలాగే తీద్దామనుకునీ కావచ్చు.

ఏదేమైనా నాకు నచ్చింది. ఎందుకంటే  జీవితం సినిమాకాదు. మనజీవితంలో దారినపోయేదానయ్యలుంటారు. మనకిసంబంధం లేని సన్నివేశాలు జరుగుతుంటాయి. మనం అనుకోని సంఘటల్లోకి చొరబడతాం..కాసేపుంటాం.. వచ్చేస్తాం. అలా జీవితంలోని ఓ ముక్కని సినిమాగ తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందీ సినిమా. ప్రతిసారీ ఓ మొదలు.. ఓ పెద్ద కంఫ్లిక్షన్…ఓ గొప్ప ముగింపూ ఇవ్వే సినిమా అవ్వాల్సిన పనిలేదు. రోజువారీ జీవితంలోఇవ్వేవీ ఉండవు.  ఏదో అనుకుంటాం..ఏదో చేస్తుంటాం..ఎటో పోతుంటాం..నిర్ణయాలు తీసుకుంటాం..వదిలేస్తాం. అటీటూ తిరుగుతాం..ఎంజాయ్ చేస్తాం..ఏడుస్తాం..బాధపడుతాం..నవ్వుతాం.
బాధపడాల్సిన విషయాల్ని లైట్ గా తీసుకుంటాం.. అక్కరలేనివిషయాలకి బాధపడతాం. బాధలకి అలవాటవుతాం..కొత్తబాధలకి భయపడతాం. అయినా నవ్వాలనుకుంటాం..ఉన్నంతలో హాయిగా ఉండాలని అనుకుంటాం. ఎందుకంటే   లైఫ్ టెండెన్సీ ఈజ్ టు బీ హాప్పీ..అండ్ ఎంజాయ్ , ఆనందంగా హాయిగా సుఖంగ ఉండలనుకోటం జీవితపు ధోరణి !!

దర్శకుడు సరిగ్గా దాన్నే చూపించాలని అనుకున్నాడని నాకనిపించింది. కనక నచ్చింది.
దానికితోడు  సూపర్ సినిమాటోగ్రఫీ…ఆ లొకేషన్లూ…బాగానే కుదిరిన నటన, నిజజీవితానికి దగ్గరగా ఉండే తరహాలో సినిమాతీసిన విధానం బాగా ఆకట్టుకుంది. గూబ్ గా చేసిన అబ్బాయి  Liam Walpole.. తల్లిబాయ్ఫ్రెండ్ గా చేసిన Sean Harris పాత్రలు ప్రస్పుటంగా ఉండి ఆకట్టుకుంటాయి.

ఈ సినిమా గొప్పసినిమా చూసిన భావన కలిగించదు. కానీ ఇలాంటిసినిమా స్టయిలు బాగానచ్చుతుంది  అందుకే ఇది వివిధ సినిమా పండుగల్లో బహుమతులు పొందకున్నా ప్రదర్శించబడింది. మీకూ నచ్చొచ్చని పరిచయం చేసా… ఓ లుక్కేయండీ కుదిరితే !! 🙂