Menu

Haider – Analysis

1995

ఖుర్రం –

ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న లాయరు, చాలా తెలివయినవాడు. తన వదిన ఘజాల అంటే అతనికి చాలా ఇష్టం, ప్రేమ, ఆరాధనా సర్వస్వం. అతని కలల రాకుమారి ని తనకు దక్కదనే విషయం అర్ధం చేసుకుని జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవలనుకున్నాడు. కాని విధి అతనికి ఇంకో అవకాశం ఇచ్చింది.

 Dr.హలాల్ మీర్

ఘజాల భర్త , తన ఎకైక సంతానం అయిన హైదర్ అంటె డాక్టర్ కి ప్రాణం, కొన్నాల నుండి హైదర్ తన మవయ్య దగ్గర ఉంటు చదువుకుంటున్నడు.  కాశ్మీర్ ని భారత దేశం నుండి వేరు చెయలని పొరాడే ఉగ్రవాద సంస్థ కి సానుభుతిపరుడు. తన సిద్ధాంతాలకు ఇచ్చినంత విలువ తన భార్య మాటకి ఇవ్వలేదు డాక్టర్. ఫలితంగా అందరి జీవితాలు తారు మారు అయిపోయాయి .

 పరిస్థితి:

 ఒక రోజు ఉగ్రవాద నాయకుడికి చిన్న సర్జరీ చేయాల్సి వచ్చింది. బహుశ హైదర్ తన ఇంట్లో ఉంటే ఒప్పుకునే వాడు కాదేమో డాక్టర్ ఆరోజు తన ఇంట్లో నే ఆ నాయకుడికి సర్జరీ చేస్తానని ఒప్పుకున్నాడు.  చెప్పినట్టే తన ఇంటి మెడ పై ఉన్న ఒక రహస్య గది లో ఉంచి సర్జరీ పూర్తి చేసాడు. ఈ విషయం తెలిసిన ఘజాల కి కాళ్ళు చేతులు ఆడలేదు తను చెప్పే ఏ విషయం గురించి కనీసం వినే పరిస్థితి లో కూడా లేదు డాక్టర్.  కాని ఏ ప్రమాదం జరగకుండా జాగ్రత్త పాడాలన్న, ఎలా ? ఒక  ఆలోచన వచ్చింది వెంటనే టెలిఫోన్ రెసివర్ తీసి ఎవరికో ఫోన్ చేసింది.

 ప్రభావం:

మరుసటి రోజు తెల్లారింది, అంత ప్రశాంతంగా ఉంది వాతావరణం ఆ ప్రశాంతత ఎంతో సేపు నిలవలేదు బయట నుండి ఇండియన్ ఆర్మీ వాళ్ళు రైడ్ చేయటానికి వాళ్ళ  కాలని కి వచ్చేసారు, అందరిని ఇంట్లో నుండి బయటకి పంపి ప్రతి ఒక్క ఇంటిని క్షుణ్ణంగా సోద చేస్తున్నారు అలాగే ఆ కాలని లో ఉండే మగవాళ్ళు అందరు మేజర్ ముందుకు వెళ్లి తమ ఐ.డి. చుయిస్తున్నారు, డాక్టర్ ని చూడగానే తాము వెతుకుతున్న వ్యక్తి దొరికినట్టు సైగ చేసాడు నలుగురు సైనికులు వచ్చి డాక్టర్ ని నిర్ధక్షనియంగా లాక్కుంటూ లోపలి తీస్కుకేల్లరు. డాక్టర్ ఇంటిని చుట్టూ ముట్టి లోపల ఉన్న ఉగ్రవాదులకు లొంగిపొమ్మని హెచ్చరికలు చేసారు వాటిని పట్టించుకోవట్లేదు అని తుపాకి తో సమాధానం చెప్పారు. వెంటనే ఒకే ఒక్క బాంబు తో ఆ ఇంటిని పేల్చేశారు. ఇదంతంత తన కల్ల ముందే జరుగుతున్న ఆపే శక్తి లేక నిస్సహాయంగా ఏడుస్తూ కూర్చుంది ఘజాల…

 **********

కొన్ని సంవత్సరాల తరువాత

 హైదర్

యూనివర్సిటీ లో చదువు పూర్తి చేసుకుని తన తల్లి మీద ఉన్న ప్రేమ తో, తండ్రి గురించి మది లో మిగిలిన ప్రశ్నలకు సమాధానాలు వెతకలన్న సంకల్పం తో మళ్ళి కాశ్మీర్ కి తిరిగి వచ్చాడు. చిన్నప్పటి నుండి తనని ప్రేమించిన అర్శియా నవ్వుతు అతన్ని రిసీవ్ చేసుకుంది. నిప్పుల్లో కాలి బూడిద అయిన ఇంటిని దగ్గరికి వెళ్లి తన చిన్ననాటి జ్ఞాపకాలని నేమరేసుకుని గట్టిగా ఏడ్చాడు, పక్కనే ఉన్న అర్శియా ప్రేమ గా హత్తుకుని ఓదార్చింది.. (ఆ జ్ఞాపకాల నిండా కనిపించకుండా పోయిన తండ్రి మాత్రమే కనిపించాడు.)

రూహ్దార్:

భారత సైన్యం బంధించిన ఖైదిల్లో ఒకడు, జైలు లో డాక్టర్ (హైదర్ తండ్రి) సహచరుడు. కొద్ది రోజుల్లోనే ఇద్దరు మంచి స్నేహితులయ్యారు. తను చనిపోయిన కాని హైదర్ కి తన చావు గురించి నువ్వే చెప్పాలి అని ఎప్పుడు రూహ్దార్ తో చెప్పేవాడు డాక్టర్.

 పరిస్థితి:

 అక్కడి నుండి అమ్మ ని చూడటానికి వెళ్ళాడు, తన బాబాయ్ ఖుర్రం ఇంట్లో ఉంటుందని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. తను వచ్చాడని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, అమ్మ కోసం ఇల్లంతా వెతుకుతున్న హైదర్ కి చిన్నగా ఒక నవ్వు వినిపించింది. అది కచితంగా తన తల్లి నవ్వే అని అర్ధం అయింది ఆ నవ్వు ని వెతుక్కుంటూ లోపలికి వెళ్ళిన హైదర్ కి గుండె పగిలే దృశ్యం ఎదురయింది. తన బాబాయ్ పడగ్గది లో అందంగా నవ్వుతు కనిపించింది. తన కోసం దీనంగా ఎదురు చుస్తున్తున్దనుకుని వచ్చిన హైదర్ కి అమ్మ-బాబాయ్ ల మధ్య సాన్నిహిత్యం చూసి గుండెల్లో కత్తితో పొడిచినట్టు అనిపించింది.

 ప్రభావం:

 తండ్రి కనిపించకుండా పోయాడు అసలు బ్రతికే ఉన్నదా లేదా కూడా తెలిదు అప్పటి వరకు తనని కలత పెట్టిన విషయాలు ఇవే, కాని ఇవేవి పట్టించుకోకుండా బాబాయ్ తో సరసాలలో మునిగి తేలుతున్న తల్లి ని చూసి అసహ్యించుకున్నాడు. తన పరిస్థితి కొడుకు కి అర్ధమయ్యేలా చెప్పాలని ఎంత ప్రయత్నించిన పట్టించుకోలేదు హైదర్. ఇక తన జీవితం లో ‘నా’ అనే వాళ్ళు ఎవరు లేరని తన తండ్రి ని వెతుక్కోవటం మాత్రమే తన జీవిత లక్ష్యమని నిర్ణయించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు.

 మలుపు :

 కొన్నాళ్ళ తరువాత డాక్టర్ చావు సందేశం తీసుకుని హైదర్ ని కలుసుకున్నాడు రూహ్దార్

 “హైదర్ నా తమ్ముడి పై నా పగ తీర్చుకో, తప్పుడు చూపుతో మీ అమ్మ ని చూసిన వాడి రెండు కళ్ళలో తుపాకి గుళ్ళతో పేల్చేయ్… నన్ను మోసం చేసిన మీ అమ్మ ని ఆ దేవుడే శిక్షిస్తాడు… “

 తన తండ్రి చావు గురించి తెలుసుకున్న హైదర్ పరిస్థితి వర్నతితంగా మారింది. తండ్రి చావు ఒక వైపు, బాబాయ్ పై పగ మరో వైపు. గట్టిగా ఏడ్చాడు! బాబాయ్ ని చంపటం తన శక్తి కి మించిన పని ఎందుకంటే ఇప్పుడు అయన ఎమెల్యే.  గుండెల్లో బాధ, ఆలోచనల్లో పగ హైదర్ ని ఒక ఉన్మాదం లోకి  నేట్టేసాయి .

 విశ్లేషణ:

 ఈ కధ నిజానికి హైదర్ ది కాదు తన తల్లి ఘజాల ది. అవును ఆమె జీవితం లో ఎంతగానో నమ్మి ఆధార పడిన వాళ్ళ వల్ల తనకు జరిగిన నష్టమే ఈ సినిమా కధ.

తన భర్త Dr.హలాల్ సిద్ధాంతాలకు ఇచ్చిన విలువ తన భార్య జీవితానికి ఇవ్వలేదు.

భయపడి తన మరిది ఖుర్రం ని సహాయానికి ఫోన్ చేసింది. తన ప్రేమ ని దక్కించుకునే అవకాశం వచ్చిందని కుట్ర తో అన్న ని మిలటరీ వాళ్ళకి పట్టించి ఏమి తేలినట్టు ఘజాల ని మోసం చేసాడు. ఇవేవి తెలియని ఘజాల బాధ తో ఏడుస్తూ కూర్చుంది, ఆ క్షణాల్లో ఓదార్పు గా నిలిచాడు ఖుర్రం.

ఈ సినిమా లో ఒక చోట హైదర్ తన తల్లి ని కోపంగా ఒక మాట అంటాడు:

“మీరు ఎందుకు ఏ విషయాన్నైనా ఎదుటి వాళ్ళ పాయింట్ అఫ్ వ్యూ నుండి చూడరు?”

కాని నిజానికి హైదర్ ఏ కాదు ఎవ్వరు ఘజాల పాయింట్ అఫ్ వ్యూ నుండి ఒక్క సరి కూడా ఆలోచించలేదు, అల అలోచించి ఉంటే పరిస్థితులు వేరేల ఉండేవి.

ఘజాల పాత్రా లో టబు అధ్బుతంగా నటించింది  అనేదానికంటే జీవించింది అనటం అతిశయోక్తి కాదు. ముఖ్యంగా హైదర్ పాత్ర కాంబినేషన్ లో తనకి ఉన్న సన్నివేశాల్లో ఈ విషయం అర్ధం అవుతుంది.

టబు తరువాత అంతల గుర్తుండిపోయే పాత్ర షహీద్ కపూర్ ది, తన తండ్రి చావు వార్త తెలుసుకున్న తరువాత అతని నట విశ్వరూపాన్ని చూడొచ్చు. ఒక అమాయక యువకుడి నుండి మొదలై  క్లైమాక్స్ కి వచ్చాక జీవితానికి సరైన అర్ధం తెలుసుకున్న వ్యక్తి లా తను చుయించిన ట్రన్స్ఫొర్మషన్ అధ్బుతం.

షేక్స్పియర్ రాసిన ట్రాజెడీ ని దర్శకుడు విశాల్ భరద్వాజ్ బాగా హేండిల్ చేస్తాడు, తను  డీల్ చేసిన ప్రతి ఒక్క డిపార్టుమెంటు (దర్శకత్వం, సంగీతం, మాటలు) అన్నిట్లోనూ నూటికి నోరు మార్కులు వేయొచ్చు.  కొన్ని డైలాగ్ లు సినిమా అయిపోయిన తరువాత కూడా వెంటాడుతూనే ఉంటై :

क्यूँकी मर कर ही पता चलता है की जिंदा थे तो जिए नहीं, और मर कर भी बचे नहीं!”

(బ్రతికునన్నాళ్ళు జీవితం విలువ తెలుసుకొలెదు, చనిపొయక బ్రతికే అవకశం లేదు అన్న విషయం చనిపొయిన తరువతే తెలుసుకుంటం.)

“ग़ुलामी में आज़ादी की बहुत याद आती है!”

(బానిసత్వం లో స్వతత్రం చాలా గుర్తొస్తుంది)

ప్రీ- క్లైమాక్స్ లో వచ్చే “బిస్మిల్” అనే పాట చాలా బాగుంది, ఈ ఒక్క పాట లో గుల్జార్ లిరిక్స్ తో మొత్తం కధని చెప్పేసాడు. ఆ పాట తీసిన విధానం కూడా ఆకట్టుకుంటుంది.  సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది .

 ****************

 చివరిగా మంచి సినిమా ని చూడాలనుకునే వాళ్ళు మాత్రం మిస్ అవ్వకూడదు, సినిమా ని టైం పాస్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలనుకునే వాళ్ళు ఈ సినిమా చూడకపోవటమే మంచిది.

 

—– Hari Krishna —-

 

No Responses