Menu

Monthly Archive:: August 2014

The lovely bones – వేదనా కావ్యం !

 చావు తరవాత జీవితం ఉంటుందా ?? అనేది ప్రతి మతగ్రంధాల్లోనూ చర్చించారు. ఒక్కోరు ఒక్కోవిధంగా తమ మత విశ్వాసలకనుగుణంగా రాసుకున్నారు. అయితే విచిత్రంగా అన్నిట్లోనూ  స్వర్గమూ..జెన్నత్..హెవెన్ అని ఒకానొక ఆనందకరమైన ప్రదేశం ఉంటుందనీ.. అలాగే నరకం.. హెల్..   అనే బాధకరమైన ప్రదేశం ఉంటూందనీ రాసుకున్నారు. ఎవ్వరినీ నొప్పింపక ఇతరులకి చేతనైన సహాయంచేస్తూ పుణ్యం దక్కించుకున్నవాళ్ళు చచ్చాక స్వర్గం చేరి ఆనందపడతారనీ..  ఇతరులని దోచుకుంటూ.. పీడిస్తూ ..హాని తలపెడుతూ బతికినవాళ్ళు చచ్చాకా  నరకానికి వెళ్ళి  ఆ పాపాలకి శిక్షఅనుభవిస్తారనీ 

The past – చిక్కుముడి

ఇదో గమ్మత్తయిన కథ..ఇందులో ఎవరు తప్పు ఎవరు కరక్టో తెలియదు.అందరి అలోచనలూ..దృక్పథాలూ సరైనవే. కానీ నాటకీయత మాత్రం నిండుగా ఉంటుంది. అదే నాటకీయంగా మన సహానుభూతి ఒకరినించి ఒకరికి మారుతూ ఉంటుంది. అలా అని ఇలాంటివన్నీ మేం టివీ సీరియళ్ళలో చూస్తూనే ఉన్నాం అనకండోయ్. ఎందుకంటే సినిమాకు ఉండే లక్షణాలన్నీ బలంగా ఉన్న సినిమా. బాగా ఆకట్టుకునే సినిమా..!! మనం ఒక పనిచేసేముందు మనకున్న లాజిక్కు ప్రకారం ఇది ఇలా చేస్తే ఇలా అవుతుందీ అని చేస్తాం..