Menu

దృశ్యం – జీవితపు నాటకీయత !!

అవును.. జీవితంలో అన్నీ ప్లాన్డ్ గా జరగవు.. మనకి తెలియకుండా టపీమని జరిగిపోయే అనర్థాలనే ప్రమాదాలు అంటాం. జరిగేటప్పుడు తెలియకున్నా..జరిగింతరవాత మాత్రం మనకి కొంత టైం ఉంటుంది.. బాధ పడటానికీ,ఏడవటానికి.  జీవితంలో చాలా నాటకీయత ఉంటుంది. కానీ దాన్ని మనం గుర్తించం.. గుర్తించినా తీరిగ్గా కలియజూసుకోటానికి టైం ఆగదు..మెల్లిగా నడవదు. తన స్పీడ్ లో తాను వెళ్ళిపోతుంది.  అక్కడ మిస్సయిన  ఆ నాటకీయతని..ఆ భావోద్వేగాలనీ పట్టిచూపించేదే సినిమా !!

సినిమాలో  ‘అవసరమైన’ సాగదీత లేకుంటే.. కిక్కు ఎక్కదు. ఫోర్ప్లే లేని శృంగారంలా అవుతుంది. అవును నేను సినిమా గురించే మాట్లాడుతున్నాను.   నేను  దృశ్యం సినిమా గురించి మాట్లాడుతున్నాను.   దాని గురించి మిత్రులు చెపితే  కలిగిన ఎక్శైట్మెంట్ సినిమా చూస్తుంటే రెండింతలయింది.. మొదట్లో అంతా పాత్రల పరిచయాలూ.. ప్లాంటింగ్ లతో కొంచం స్లో గా అనిపించినా   మెల్లిగా ఊపందుకుంటుంది.  రెండో సగం మాత్రం  మంచి భావోద్వేగాలూ ..కావలసిన నాటకీయత  కలగలిసి యమా ఉత్కంఠతో సాగిపోయింది చివరిదాకా.

అందమైన మధ్యతరగతి ఫామిలీలో …అకస్మాత్తుగా కుటుంబాన్ని అలలాకుతలం చేసే   సంఘటన జరిగి…ఆ కుటుంబం దాన్ని ఎలా ఎదుర్కొని నిలబడ్డారూ అనేదే సినిమా.

ప్రతిమనిషీ స్వార్థంతోనే బ్రతుకుతాడు. ఇతరులకి హాని చేయని స్వార్థం, మన తప్పు లేని స్వార్థం  స్వార్థమే అయినప్పటికీ తప్పుకాదు.

వెంకటేష్..మీనా…మిగతా పిల్లలూ చక్కగా కుదిరారు. వెంకటేష్ తనదైన శైలిలో బాగా చేసాడు.  ప్రస్తుత సమాజ పరిస్థితులమీద అవగాహన ఉన్న ఉండి ఇలాంటి కథని  సహజత్వానికి దగ్గరగా తీయటం అభినందనీయం. సరిగ్గా ఇలాంటి అర్థవంతమైన సినిమాలే అవసరం మనకి.

నేను నా చిన్నప్పుడు మాస్ మసాలా సినిమాలనే చూసాను. కానీ ఇప్పుడు అలాంటి సినిమాలనే చూడలేను. కాలం..వయసు..చదువు..వివేకం నన్ను  ప్రేక్షకుడిగా ఎదిగేలా చేసాయి. నా సెన్సిబిలిటీస్ మారాయి..నాలాగే ఎందరో,  కనక మాకు కొత్త సినిమా కావాలి.    ప్రతి హీరో మూడూ మాస్ మసాలా సినిమాలు చేసినా తమకంటూ ఉన్న క్లాస్ ప్రేక్షకులకోసం, మాస్ నుండి క్లాస్ గా ఎదిగిన అభిమానులకోసం   నాలుగో సినిమా ఇలాంటిది చేస్తే ప్రేక్షకులు  కోరుకున్న భిన్నత్వం ఉంటుంది.. నిలిచి ఉన్న నీరు మురుగు కాలువ కాకుండా ,   తెలుసు సినిమాని ప్రవహింపచేసినవాళ్లవుతారు. !!

ఇలాంటి సినిమాని నాలాంటి తెలుగు సినీ  ప్రేక్షకులకి అందించినందుకు.. దృశ్యం  టీం ని అభినందించాల్సిందే !!

3 Comments
  1. April Fools Day March 29, 2015 / Reply
  2. bathakhani.com April 22, 2015 / Reply
  3. Venu September 13, 2015 / Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *