Menu

Nothing Personal – ఏకాంత జీవితం

పొద్దునలేస్తే  పొట్టచేతబట్టుకుని ఉరుకులూ పరుగులూ..అదే పనిగా పనిచేస్తూ నెల జీతానికి జీవితాన్ని తాకట్టుపెడుతూ …బాంక్ బాలెన్సులూ..తెచ్చిపెట్టుకున్న నవ్వులూ..బలవంతపు భంధాలూ.. పిప్పిలోంచి ఆనందం పిండుకుందామనే ఆశలూ కొందరివైతే, సకల సౌకర్యాలతో ఆకలి విలువే తెలియక.. వీలైనంత ఆహారాన్ని పొట్టలోకి కుక్కుతూ ,జీవితంలో ఆనందం కోసం కుతిగా ఎగబడుతూ.. డబ్బే లోకంగా నకిలీ ఆనందాన్ని కొనుక్కుంటూ..ప్రకృతినీ ప్రపంచాన్ని తమ కాళ్ళకింద శాశించాలనుకునే వ్యాపారవేత్తల్లూ..ధనవంతులూ  మరికొందరు. కానీ సరిగ్గా వీళ్లకి వ్యతిరేకంగా కొంతమందికి ఏకాంతం కావాలి. ఈ ప్రపంచాన్ని..జనాన్ని వాళ్ళ పోకడనీచూసి విసిగెత్తినపుడో, ప్రియమైన వాళ్ళనికోల్పోయి ప్రపంచం మీద విముఖత ఏర్పడ్డప్పుడో,  ఒకానొక దశలో జీవితం ఇదికాదు అని అనిపించినవాళ్ళో..లేదా ముందునించీ తమతో తాము ఉండటం ఇష్టమున్నవాళ్ళో,  ….వాళ్లకి ఏకాంతం కావాలి.. ఏకాంతవాసాన్ని కోరుకుంటారు వాళ్ళు.  ప్రపంచానికి  అతీతంగా  ప్రకృతి ఒడిలో తమతో తాము ఉండాలనుకుంటారు. తమలోని ఆనందాన్ని..భావాలనీ ..భావోద్వేగాలని  అన్వేషించాలనుకుంటారు. తమకీ ప్రకృతికీ ఒక అనుభందాన్ని ఏర్పరచుకుంటారు, ప్రకృతి రహస్యాలని వింటారు. పరికిస్తారు..ఆనందిస్తారు. వాళ్ళు శాంతంగా ఉంటారు.. కాలువగట్టునో కూర్చొని ఉదయిస్తున్న సూరీడీనీ..నిద్రలేస్తున్న ప్రకృతినీ ఆస్వాదిస్తారు. నీటివలయాల్లో విశ్వరహస్యాలని శోదిస్తారు. ఎగిరే పక్షి స్వేచ్చ తమదిగా చేసుకుంటారు. విచ్చుకున్న పువ్వులోని నవ్వు వాళ్ళ మొహంలో కనిపిస్తుంది.  కిటికీలోంచి పాకే మెత్తని కాంతి వాళ్లకి సుప్రభాతగీతమవుతుంది. మిట్ట మధ్యాన్నపు ఎండలో చెట్టునీడన వాళ్లకి దేవ రాగాలు వినిపిస్తాయి, నడిరేయి నక్షత్రాలతో ముచ్చటిస్తారు.   వాళ్లకి ఎదుటి వ్యక్తులు తమ జీవితల్లోకి చొరబడటం ఇష్టముండదు. అనవసరపు హైపు..పొగడ్తలూ..అక్కరలేదు.వాళ్ళు వ్యక్తులతో నిదానంగా కలుస్తారు. ఒకరిద్దరు నచ్చిన వ్యక్తులతో మాత్రం స్నేహం చేయగలుగుతారు.  నిలకడగా..నింపాదిగా జీవితం అందించే ఆనందాలనీ, బాధలనీ అందుకుంటారు.

 
 

ఒకమ్మాయి కిటికీ వారగా కూర్చిని చూస్తూంటుంది..ఇళ్ళంతా ఖాలీ..తనవస్తువులన్నీ రోడ్డుమీద పడేసింది. వాటిని జనాలు ఏరుకుంటూ ఉన్నారు.  వేలికున్న ఉంగరం తీసి పక్కనపెట్టింది. కాసేపు ఆ ఖాళీ ఇంటిలో కూర్చుంది. ఒక చిన్న గుడారం, కొన్ని బట్టలతో బలల్దేరింది. ఏవరిదో కారులో చోటడిగి ఏదో ఊళ్ళొ దిగింది. తనకే తెలియని చోటికి ప్రయాణిస్తోంది.మనుషులకి దూరంగా.  పగలంతా ప్రయాణం..సాయంత్రం ఎక్కడో సముద్రపు ఒడ్డున రాళ్ళల్లో గుడారం వేసుకొని నిద్ర . సముద్ర ఘోష  భయానకంగా ఉన్నది, అమె చెవుల్లో చేరి భీతికలిగిస్తోంది. ఆ బాషని అర్థం చేసుకొనే ప్రయత్నం చేసింది. చిన్న చిన్న జలపాతాల్లో మంచినీళ్లు పట్టుకోవటం..మైదానాల్లో…గుట్టల్లో ఒంటరిగా రోడ్లమీద నడక . ఎవరినీ నమ్మని స్వభావం ఆమెది. ఒక రకమైన కసి..కోపం..నిర్లక్షధోరణి ఆమెది.

 

మొత్తానికి ఒకచోటు చేరింది. గుడారం వేసుకొని చలికి ఒణుకుతూ కూచుంది, ఎదురుగా మట్టి దిబ్బలు. దానిపైకెక్కి చూస్తే ఆ ప్రదేశం  అద్భుతంగా తోచింది. నీళ్లల్లోకి పొడుచుకొచ్చిన భూభాగం.. అందులో  ఒక ఇల్లు ఆమెని ఆకర్షించాయి.  చాలా ప్రశాంతంగా..సముద్ర గాలులతో ఉందా ప్రదేశం. చుట్టూ సముద్రపు  నీళ్ళూ మైదానాలు..గడ్డి గుట్టలు.. సముద్రం..రాళ్ళూ. మెల్లిగా ఆ ఇంటికి చేరుకుంది. ఎవరూ లేరా ఇంట్లో ఆ సమయంలో..ఇళ్లంతా కలియతిరిగింది. అన్నీ పొందికగా అమర్చి ఉన్నాయ ఇంట్ళో..  సంగీతం విన్నది. మంచం మీదా పడుకుంది..దొళ్ళింది. ఒక సారి ఇళ్ళు అనబడే స్వర్గాన్ని ఆస్వాదించింది. తిరిగి తన గుడారం చేరుకుంది.

మరునాడు గుడారం విప్పుకొని ఆ ఇంటిముందు కూర్చుంది వేచిచూస్తూ,.  ఆ ఇంట్లోంచి ఒక నడి వయస్కుడు వచ్చాడు. ఆమెని చూసాడు. పలకరించాడు. బదులివ్వకుండా అతన్ని తేరిపారా చూసింది. నీపేరేంటీ అని అడిగాడు. నీ పని చూసుకోవయ్యా అని నిర్లక్ష సమాధానం.

 

తోటలో పని చేస్తే తిండిపెడతాను అన్నాడాయన.. తిండికోసం పని చేయటం మొదలుపెట్టింది. తినటానికి లోపలికి రమ్మంటే వెళ్లదు. మనిషిని నమ్మదు. తిన్నాక బయలుదేరింది. రోజూ పనిచేస్తే రోజూ తిండి పెడతా అన్నాడు. సరే కానీ నీవెవరూ..ఎక్కడనించొచ్చావు..లాంటీ ప్రశ్నలేమీ అడగొద్దు మరి అన్నది. సరే అన్నాడతను. అలా పొద్దునంతా పని..తిన్నాక గుడారం చేరుకోవటం. అలా అతనేంటో తెలిసిన కొద్దీ..ఇంట్లోకి వెళ్ళటం ..కలిసితినటం..పొడి మాటలూనూ.  ఓ గదిచూపించి అందులో ఉండవచ్చు అన్నాడతను, అప్పటికే అతనిమీద నమ్మకం కుదిరింది ..కనక గదిలో చేరింది.  ఇద్దరూ కలిసి పనిచేయటం.. వండుకొని తినటం ..సంగీతం పుస్తకాలు.. చుట్టూ ప్రకృతి, అతని స్నేహం..అమె సంతోషంగా, ప్రశాంతంగా  ఉన్నది. తాను కోరుకున్న ఏకాంత వాసం దొరికింది. అతనెవరో తెలుసుకునే ప్రయత్నం ఆమె చేసింది. ఆమె ఎవరో తెలుసుకునే ప్రయత్నం అతడుచేసాడు. ఒకరికొకరు ఏమీ కారు.   ఏకాంతపు బతుకులు వాళ్లవి.  ఇద్దరు మనుషులు, ఎవరికివారే కానీ ఒకరికొకరు…భంధం లేదు..సంభంధం అసలే లేదు.. దానికి పేరు లేదు, కేవలం అనుభూతి తప్ప !!
Urszula Antoniak తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి పలు అవార్డులు వచ్చాయి.  ఈ సినిమా చూస్తుంటే  మనసు చల్లబడుతుంది. మనతో మనం ఉండటం అంటే ఏమిటో..దానివల్ల ఒనగూడేదేమిటో తెలుస్తుంది. ఆకాశంలో లో నునుపు, గాలిలో మృదుత్వం,  నీళ్ళలోని చల్లదనం ఇవన్నీ మళ్ళీ మన ఎరుకలోకొస్తాయి. మన జీవితాల్లో కరువైన ప్రశాంతత మన కళ్ళముందుంటుంది.

One Response
  1. April Fools Day March 29, 2015 /