Menu

Monthly Archive:: May 2014

Nothing Personal – ఏకాంత జీవితం

పొద్దునలేస్తే  పొట్టచేతబట్టుకుని ఉరుకులూ పరుగులూ..అదే పనిగా పనిచేస్తూ నెల జీతానికి జీవితాన్ని తాకట్టుపెడుతూ …బాంక్ బాలెన్సులూ..తెచ్చిపెట్టుకున్న నవ్వులూ..బలవంతపు భంధాలూ.. పిప్పిలోంచి ఆనందం పిండుకుందామనే ఆశలూ కొందరివైతే, సకల సౌకర్యాలతో ఆకలి విలువే తెలియక.. వీలైనంత ఆహారాన్ని పొట్టలోకి కుక్కుతూ ,జీవితంలో ఆనందం కోసం కుతిగా ఎగబడుతూ.. డబ్బే లోకంగా నకిలీ ఆనందాన్ని కొనుక్కుంటూ..ప్రకృతినీ ప్రపంచాన్ని తమ కాళ్ళకింద శాశించాలనుకునే వ్యాపారవేత్తల్లూ..ధనవంతులూ  మరికొందరు. కానీ సరిగ్గా వీళ్లకి వ్యతిరేకంగా కొంతమందికి ఏకాంతం కావాలి. ఈ ప్రపంచాన్ని..జనాన్ని వాళ్ళ పోకడనీచూసి విసిగెత్తినపుడో, ప్రియమైన వాళ్ళనికోల్పోయి

ఒక రొమాంటిక్ ప్రేమ కథ కాలేకపోయిన ‘కొత్తజంట’

ఒక అబ్బాయి-ఒక అమ్మాయి. ఇద్దరూ ప్రేమించుకుంటారు. సమస్య వాళ్ల స్వభావ వైరుధ్యం (ఖుషి)వల్లనైనా రావాలి లేదా బయటనుంచీ వచ్చే ప్రమాదం/అభ్యంతరం/పరిస్థితుల (జయం, నువ్వూ-నేనూ) ప్రభావం వల్లనైనా రావాలి. దాన్ని అధిగమించి ఇద్దరూ ఒకటవ్వాలి. ఒక హ్యాపీ ఎండింగ్ ఉన్న ప్రేమకథలకు అది అత్యంత అవసరం. ఆ ప్రేమ జంట ఒకటవ్వాలని జనాలు/ప్రేక్షకులు బలంగా కోరుకోవాలి. అలా కోరుకోవాలంటే, వాళ్ళు ముచ్చటైన జంట అయుండాలి. సమస్యతో ప్రేక్షకుడు ఐడెంటిఫై అయ్యుండాలి. వాళ్ల ప్రేమతో ఎంపతైజ్ అవగలగాలి.ఇవేవీ కాని సినిమా

మౌనరాగం – మనసు తీరు

స్త్రీ పురుషులిద్దరూ కొన్నాళ్ళపాటూ కలిసుంటే..స్నేహం వికసించి,  ఒకరినొకరు అర్థంచేసుకొని..సర్ధుబాటు కూడా చేసుకొని ఒకరిమీద ఒకరికి ఆధారపడే తత్వం ఏర్పడి,  ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ఉంటారు తద్వారా వాళ్లమధ్య అనుబంధం ఏర్పడి ప్రేమ చిగురిస్తుంది. ఈ లోపు ఇద్దరి ప్రేమకి ప్రతిరూపంగా పిల్లలు పుట్టుకొస్తారు. అలా కుటుంబం ఏర్పడుతుంది.  ప్రేమ కొంచం అటూ ఇటూ అయినప్పటికీ అలవాటు అయిన అనుభంధం వివాహాన్ని పటిష్టంగా ఉంచుతుంది. ( పటిష్టం అంటే…ఇద్దరూ కొట్టుకుంటున్నా వివాహన్ని విడిచిపోకూడదు అనుకుంటారు ) .