Menu

Monthly Archive:: March 2014

The hunt – వెంటాడే లోకం !!

చిన్న పిల్లలు ఎక్కువగా ఊహాలోకంలో విహరిస్తుంటారు.  పెద్దలు చెప్పిన కథలు నిజమనుకుంటారు. ఎదురుగా ఉన్న వాస్తవానికి  ఊహకీ ఒక లంకె ఏర్పరుచుకుంటారు. అందుకే వాళ్ళు చూసిందీ..ఊహించుకున్నదీ కలగలిపి మాట్లాడుతుంటారు. నిజానికి.. అబద్దానికి …ఊహలకి మధ్య కథలు అల్లుతారు.  ఇలా ఒక అమ్మాయి తెలియక చెప్పిన  విషయం  ఆమె టీచర్ జీవితానికి ఇచ్చే చిన్న కుదుపే ఈ సినిమా. లూకాస్ అనబడే వ్యక్తి ఒక ప్లే స్కూల్లో టీచరు.  లూకాస్ కి  పిల్లలంటే ఇష్టం. వాళ్లని ఆడిస్తూ నవ్విస్తూ

the first grader – స్పూర్తి దాయకం

  కెన్యాలో,  1953 వ సంవత్సరంలో బ్రిటీషుపాలనకి వ్యతిరేకంగా కొన్ని తెగలు  సాయుధ పోరాటం జరిపాయి . ఆ పోరాటంలో ఎందరో మరణించారు. వేలకొద్దీ జైలుపాలయ్యారు. కొందరు  చిత్రహింసలు అనుభవించారు. ఎట్టకేలకి స్వాతంత్రం సిద్దించినా చాలా మందికి కలిగిన కష్టనష్టాలు..బాధలు..గాయాలు మాత్రం అలాగే ఉండిపోయాయి.   ఓ గుడిసె..  ఎనభైఏళ్ళ ముసలాడు   ఒంటరి జీవితం, గతం తాలూకు జ్ఞాపకాలతో బతుకుతుంటాడు. కొత్త ప్రభుత్వం అందరికీ  ఉచిత ప్రాధమిక విద్య అని ప్రకటిస్తుంది. ఊరూరా స్కూళ్లు వెలుస్తాయి. ఎక్కడెక్కడి

Morvern Callar – అంతరంగపు అన్వేషణ

ఈ సినిమా ఆది మధ్య  అంతం అనే కథా సూత్రాలమీద నడవదు. అసలు ఇక్కడ కథే లేదు.ఇది ఒక అమ్మాయి, ఆమె భావోద్వేగాలు మాత్రమే. జీవితం అనేది జీవించటానికి ..  అంటే సంతోషాల్ని సొంతం చేసుకోవటానికి, ఆనందాన్ని అందిపుచ్చుకోవటానికి ఇవ్వబడింది. లైఫ్ ఈజ్ ప్యూర్ బ్లిస్. కానీ  ఆ ప్రయత్నంలో మనకి విషాదాలు.. బాధలూ ..ఎదురవుతూంటాయి. కొంతమంది బాధలని నొక్కిపట్టి ఆనందంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కొందరు సంతోషాన్ని దూరం చేసుకొని బాధలోనే జీవిస్తారు. అమె తన ప్రియుడి

Ratcatcher – అంతర్మధనం

   సినిమా అనేది భావవ్యక్తీకరణ మాధ్యమం అయితే దాన్ని స్పష్టంగా సూటిగా వ్యక్తీకరించగలిగిన దర్శకులు కొందరే.   జేమ్స్ నీళ్ళకొలను దగ్గర ఆడుతూ ఉంటాడు. కిటీకీ లోంచి రయాన్ చూస్తాడు.తనకీ స్నేహితుడితో ఆడుకోవాలని అనిపిస్తుంది. కానీ తల్లి మాత్రం  జైల్లో ఉన్న తండ్రిని చూడటానికి బయలుదేరమంటుంది. వెంట నడిచినట్టే నడిచి తల్లిని ఏమార్చి స్నేహితుడిని చేరుకుంటాడు రయాన్.  జేమ్స్  రయాన్ని నీళ్లలోకి తోస్తాడు. రయాన్ జేమ్స్ మొహాన బురద కొడతాడు.  అలా సరదాగ మొదలై  కొంచం తీవ్రమవుతుంది.

Ordet – 1955 నాటి డేనిష్ చిత్రం

Ordet అన్న డేనిష్ పదానికి “The Word” అని అర్థమట. ఇది ౧౯౫౫లో విడుదలైన డేనిష్ చిత్రం. కార్ల్ థియొడొర్ డ్రెయర్ (Carl Th. Dreyer) ఈ చిత్రానికి దర్శకుడు. Kaj Munk అన్న డేనిష్ రచయిత రాసిన నాటకం ఆధారంగా తీశారీ చిత్రాన్ని. స్కాండినేవియన్ చలనచిత్ర పరిశ్రమలోని తొలినాటి ప్రతిభావంతమైన దర్శకుల్లో‌ డ్రెయర్ అగ్రగణ్యుడు. అతను తీసిన సినిమాలలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న చిత్రం ఈ ఓర్డెట్ (ఈ పలుకుబడులలో దోషాలుంటే వ్యాఖ్యల ద్వారా తెలియజేస్తే సరిచేయగలను).