Menu

Monthly Archive:: February 2014

సినిమా కథలు- ద్వాదశి చక్రములు

మన చుట్టూ వున్న ప్రపంచం,ఆ ప్రపంచంలో వున్న మనం…మన కుటుంబ నేపధ్యం,మన వృత్తి,ఇరుగు- పొరుగు,సంబంధ బాంధవ్యాలు వీటికి తోడుగా మన చుట్టూ అల్లుకు పోయిన సామాజిక,రాజకీయ,ఆర్ధిక పరిస్థితులు వాటి వల్ల మనం ఆకస్మికంగా ఎదుర్కోవలసి వచ్చే ఉత్పాతాలు,వాటికి మన ప్రతిస్పందన..స్థూలంగా మనం ఎదుర్కొనే సమస్యలు,వాటి ద్వారా మనం పొందే అనుభవాల సమాహారమే కథ. ప్రతి కథానాయకుడు సమస్యల్ని ఎదుర్కొంటాడు….కొందరు ధీరులు వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు.కొందరు భీరువులు వాటికి లొంగిపోతారు(దేవదాస్)…ఇంకొందరు అవాస్తవిక దృక్పధాలతో సమస్యని తమదైన శైలిలో పరిష్కరించే

పూజాఫలము

పగటి పూట వెన్నెల – ఒక అందమైన అబద్ధం. “కళను వ్యాపార దృష్టితో చూడకూడదు. కళాకారునికి సమాజం పట్ల గురుతరమైన బాధ్యత ఉంది. అవాంచనీయ సన్నివేశాల ద్వారా ప్రేక్షకులలోని నీచాభిరుచులని రెచ్చకొట్టకూడదు. ఉత్తమ వులువలని ప్రతిబింబించే కళాత్మక చిత్రాలనే నిర్మించాలి” అనే సత్సంకల్పంతో సినీరంగ ప్రవేశం చేసిన బి.ఎన్.రెడ్డి తెలుగు సినీరంగంలో ఓ చరిత్ర. ఆయన తీసింది పదకొండు సినిమాలే అయినా అందులో ఒక్కొక్కటి ఒక్కో కళాఖండం. ఆయన తీసిన చిత్రాల్లో అందరికీ నచ్చిన చిత్రాలు కొన్నయితే,