Menu

Monthly Archive:: February 2014

మా సినిమాలు:బాపు- చివరి భాగం

’సీతమ్మ పెళ్ళి’ తర్వాత తీసిన ’బుల్లెట్’ తుస్సుమంది. రేలంగి గారు చక్రపాణి దగ్గరకెళ్ళి “నాకెందుకు విజయాలో వేషం ఇవ్వలేదు? నేను రమణారెడ్డిలా కామెడీ విలన్ చెయ్యలేననా” అన్నారట. చక్రపాణిగారు – నువు చెయ్యగలవు గానీ జనం చూడద్దూ” అన్నారు. అలాగా – నువ్వు బులెట్టు బాగానే తీశావు – గానీ ఫలానా లాటి సినిమాలు మీనించి expect చేసే జనం చూడద్దూ! ’జాకీ’ రేసుల్లో సరిగ్గా పరిగెట్టలేదు. బాలుగారి సంగీతం “అలా మండిపడకే జాబిలీ” గుర్తుందా! “కళ్యాణ

మా సినిమాలు:బాపు- ఆరవ భాగం

నెక్స్ట్! ’రాజాధిరాజు’. తెల్లారకుండానే Bangalore palace కి బాబా నేనూ వెళ్ళిపోయేవాళ్లం. చెట్లలోంచి ఉదయసూర్య కిరణాలు వస్తూంటే షూట్ చెయ్యాలని మా అత్రుత. స్టాఫ్ గానీ నటులు గానీ ఎవరూ వచ్చేవారు కాదు. కానీ చివర రిజల్ట్ చక్కగా వచ్చింది. డెవిల్ గా నూతన్ ప్రసాద్ అద్భుతంగా పోషించారు. సుమలత మొదటి సినిమా. దాంట్లో నా అభిమాన డ్యాన్స్ మాస్టర్ సీనుగారు ఒక పాటచేస్తూ అమ్మాయిలను పడుకోబెట్టి ఒక మూమెంట్ ఇప్పించారు. లాంగ్ షాట్ లో చూస్తుంటే

మా సినిమాలు:బాపు-ఐదో భాగం

తరువాత సినిమా స్నేహం. మా సినిమాలకి పాతికకి పైగా సంగీతం ఇచ్చిన కె.వి.మహదేవన్ గారికి ఈ సినిమాల్లో (ఆరుద్ర రచనలు) పాటలు, “పోనీరా పోనీరా! పోయింది పొల్లు మిగిలింది చాలు, సరే సరే ఓరన్నా” మహా ఇష్టం. రాజేంద్రప్రసాద్ గారి మొదటి చిత్రం. ఒక పాత్రికేయుడు (పేరు కనుక్కోకపోవడం నా తప్పిదం) మా గురించి రాస్తూ “సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ” అంటే “మేం తీసాం మొర్రో” అంటారు వాళ్లు అని అతి చమక్ గా రాశారు. రాజమండ్రీ

మా సినిమాలు:బాపు-నాలుగో భాగం

ముత్యాలముగ్గు షూటింగు చివరిరోజుల్లో అల్లు రామలింగయ్య గారి కొడుకు accident లో మరణించాడు. వద్దంటున్నా ఆయన షూటింగుకి వచ్చేశారు. “బాధ మరచిపోవాలంటే – పని చేయడం ఒకటే మార్గం” అన్నారు. సినిమా చివర కోతిగా ఆయన నటన పోలినది చాలా చాలా అరుదు. సినిమాలో కోతి సప్లయి చేసిన వాడితో థామస్ అనే కుర్రాడు అసిస్టెంటుగా వచ్చాడు. కోతికి వేషం లేనపుడు అతను కెమెరా అసిస్టెంట్ల వెనక తిరిగి నానా ప్రశ్నలూ వేసేవాడు. సినిమా అవగానే ఇషానార్యతో

మా సినిమాలు:బాపు-మూడవ భాగం

సంపూర్ణ రామాయణం తరువాత అక్కినేని గారితో అందాలరాముడు తీశాము. గోదారి మీద ఒక సాదా లాంచీ, ఒక గొప్పవాడి లగ్జరీ లాంచీ కలిపి లాగే ఒక మోటారు బోటు. భద్రాచల ప్రయాణం- పంటు అనబడే ఒక పెద్ద చెక్క ప్లాట్‍ఫాం మీద, మా ఫ్రెండు సీతారాముడు ఆ లగ్జరీ లాంచి కట్టాడు. డబ్బుని నమ్మిన ధనవంతుడికీ అప్యాయత, సంఘీభావం కలిగిన మధ్య తరగతి కటుంబాలకీ సంఘర్షణ. బస్సుల్లో ఎక్కినపుడు హోటల్లో మెక్కినప్పుడు ఈ కులాలూ మతాలూ మడీ