Menu

మరో ప్రపంచం

తెలుగులో Atlas Shrugged నవల ని సినిమా గా తీశారు. మీకు తెలుసా?

అవును నిజం. తెలుగులో Ayn Rand వ్రాసిన అద్భుత నవల Atlas Shrugged ని సినిమాగా తీసి చేతులు కాల్చుకున్నారు.

మహా మహా హాలీవుడ్ ఉద్దండులే (వాళ్ళని వాళ్ళే అనుకున్నారేమో నాకు తెలియదు మరి) మల్ల గుల్లాలు పడే ఆ నవలని సినిమాగా తీయటం అంటే మాటలు కాదు. A novel with multilayered plot structure, and philosophically challenging theme, and a huge number of characters. Moreover, it has speeches. Eight in all. దాన్ని సినిమాగా మల్చాలంటే తాతలు, కాదు కాదు వాళ్ళ తాతలు కూడా దిగిరావాల్సిందే. కానీ మన తెలుగులో విఫల యత్నమైనా (సినిమా విఫలం కాలేదు. చెప్పదల్చుకున్న విషయాల్ని బాగా చెప్పారు. ఆడకపోవటమే ఇక్కడ నేను వాడిన విఫలం అనే మాటకు అర్థం) ఒకటి జరిగింది నాకు తెలిసినంతలో.  అది ముదావహమైన విషయం.

మరీ ఎక్కువ ఊదరగొట్టి విషయాన్ని నాన్చను. డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను.

చక్రవర్తి చిత్ర పతాకం పైన అక్కినేని, ఆదుర్తి కలిసి నిర్మించిన మరో ప్రపంచం సినిమా దాదాపూ Atlas Shrugged లాంటి plot structure నే కలిగి ఉంది. ఆ విషయాన్నే నేను ఇక్కడ చెప్పదల్చుకున్నది.

వీటిగురించి గురించి క్లుప్తంగా.

The Fountainhead వ్రాసిన క్రొత్తల్లో అమ్మకాలు తక్కువగా ఉన్నాయనే ఫ్రస్ట్రేషన్లో Ayn Rand ఉన్నప్పుడు ఒక ఫ్రెండ్ తో సంభాషణ మధ్యలో తనకు వచ్చిన ఆలోచనకి అక్షర రూపమే ఈ నవల. (The Fountainhead గురించి తెలుగులో తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడవచ్చు).

ప్రపంచంలో ఉన్న మేధావులు, ప్రపంచాన్ని ముందుకు నడిపిస్తున్న పారిశ్రామికవేత్తలు ఒక్కొక్కరే సమాజంలోంచీ మాయమైపోతే ప్రపంచం పరిస్థితి ఏమిటనేది AS ముఖ్య విషయమైతే… మరో ప్రపంచం కూడా దాదాపూ ఇల్లాంటి అంశాన్నే స్పృశిస్తుంది. కానీ రెంటిలోనూ చర్చించిన విషయాల్లో చాలా తేడాలున్నాయి.

మరో ప్రపంచం సినిమా నాకు కాస్త విచిత్రంగా పరిచయం అయింది. ఒకరోజు కాలేజెగ్గొట్టి ఇంట్లో కూచుంటే (ఆరోజు నిజంగానే సెలవ. గాంధీ జయంతి. ఏదో అలా అలవాట్లో పొరబాటుగా వచ్చేసింది. పట్టించుకోకండేఁ 😉 ) సిటీకేబుల్లో ఏదో సినిమా వస్తోంది. అందులో నాగేశ్వర రావు డిటెక్టివ్. షెర్లాక్ హోమ్స్ అభిమానినైన నాకు డిటెక్టివ్ కథలంటే చాలా ఇష్టం. అందులోనూ మిస్సమ్మలో అక్కినేని వేసిన డిటెక్టివ్ పాత్ర నాకు బాగా నచ్చింది. చిన్నప్పుడు అనుకరణ ప్రయత్నం చేశాను కూడా. సో టీవీకి అతుక్కుని పోయి మరీ ఆ సినిమా చూశాను. చివరిదాకా కదలకుండా చూసిన ఆ సినిమాలో నాకు నచ్చిన అంశాలెన్ని ఉన్నాయో నచ్చనివీ అన్నే ఉన్నాయి కానీ, తీసిన విధానానికీ, చెప్పిన విషయానికీ, ప్రయత్నంలోని సిన్సియారిటీకీ, కథని బోరుకొట్టకుండా నడిపించిన తీరుకీ సలమ్ కొట్టాను.

నగరంలోని చిన్నారులని కొందరెవరో అపహరిస్తుంటారు. పిల్లలని ఎత్తుకుని వెళ్ళి ముష్టివారిగా మార్చే మాఫియానా? లేక వేరే ఏవైనా ఇతర కారణాలతో అపహరిస్తున్నారా అనేది అర్థం కాదు. అప్పుడు గుమ్మడీ, నాగేశ్వరరావూ రంగంలోకి దిగి ఆ మిస్టరీని ఛేదిస్తారు. చివరికి ఆ పిల్లలు ఏమయ్యారు? అసలు వారంతా బ్రతికే ఉన్నారా? క్షేమంగా ఉన్నారా? వారినెవరు అపహరించారు? ఎందుకు అపహరించారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు కావాలంటే ఆ సినిమాని చూడాల్సిందే.

AS లోనూ ఇంతే. కథా ప్రారంభం నుంచీ మేధావులూ, గొప్ప గొప్ప పారిశ్రామికవేత్తలూ అపహరణకి (missing/retiring with mysterious reasons) గురి అవుతుంటారు. వారంతా ఏమయ్యారనేది ఎవరికీ తెలియదు. ఎవరన్నా కిడ్నాప్ చేశారా? లేదా వాళ్ళే ఎతన్నా వెళ్ళిపోయారా? అసలేమయ్యారు అనేది నవల ప్రారంభం నుంచీ సస్పెన్సే. Dagny Taggart వాళ్ళంతా మిస్సవ్వటానికి కారణమైన ఒక వ్యక్తే అనీ, అతనిని కనుక్కోగలిగితే వారినందరినీ బయట ప్రపంచంలోకి తీసుకుని రావచ్చనీ భావిస్తుంది.

నాగేశ్వరరావు ఆ పిల్లలంతా మాయమవటానికి కారణం అభ్యుదవాదులైన కొందరు యువతీ యువకులే కారణమనీ, ఆ పిల్లలంతా వారి సంరక్షణలోనే మరో ప్రపంచంలో హాయిగా ఉన్నారనీ, కనుక్కుని వారితో జతగడతాడు.

ఇక్కడ డాగ్నీ కూడా ఈ మేధావులంతా జాన్ గాల్ట్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో గాల్ట్స్ గల్చ్ అనే పేరు ఉన్న ఒక లోయలో తమదైన లోకంలో హాయిగా ఉన్నారనీ తెలుసుకుని, క్రమంగా వారితో చేరుతుంది.

మరో ప్రపంచంలో పతాక సన్నివేశాల్లో నాగేశ్వరరావు మీద విచారణ సమయంలో చెప్పే మాటలూ, ఆ సన్నివేశ కల్పనా నాకు జాన్ గాల్ట్ స్పీచిచ్చే సందర్భాన్నే గుర్తుకు తెచ్చింది. అయితే ఇక్కడ గాల్ట్ ఇంకా అరెస్ట్ చేయబడడు.

ప్రధాన పాత్ర మిస్సైన వ్యక్తులని వెతుక్కుంటూ వెళ్ళటం, వాళ్ళని కనుక్కున్నాక, వారక్కడ ఉన్న పరిస్థితులని చూసి ఇంప్రెస్ కావటం, ఆ మిస్ కావటానికి వెనుక ఒక ఫిలసాఫికల్ కారణం ఉండటం, చివరకు ఆ వెతుక్కుంటూ వెళ్ళిన ప్రధాన పాత్ర వారితోనే చేరిపోవటం, మొదలైన వన్నీ ఈ రెంటి మధ్యా ఉన్న సారూప్యాలు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే రెండూ ఒక గొప్ప ఫిలసాఫికల్ విషయాన్ని (Rand’s summarization of objectivistic philosophy, and her projection of ideal people, ఇందులో గాంధీ గారు ప్రవచించిన మరో ప్రపంచాన్ని గురించిన) చర్చిస్తూ ఉంటాయి. కానీ ఏదో ఒక సుస్పెన్స్ థ్రిల్లర్ మాదిరిగా నడుపబడుతాయి. చాలా ఇంటెన్సిటీ ఉన్న కథలివి. రెండు చోట్లా ఉన్నవి ఊహాజనితమైన self-consistent worlds. ఆ రెంటినీ సాధారణ సమాజం ఒప్పుకోదు. రాజ్యాంగబద్ధం కావవి.

గాల్ట్స్ గల్చ్ ని వేరెవరూ అందుకోలేరు కానీ ఇక్కడి ఈ మరో ప్రపంచాన్ని పట్టుకోగలరు. చివరి సన్నివేశాలలో కాస్తంత మార్పు, spirit of the story, తప్పిస్తే ఈ సినిమాని AS కి ఒక చక్కని దృశ్యానువాదంగా భావించవచ్చు.

సావిత్రి, జమున, మొదలైన పెద్ద తారలెందరున్నా, ఇలాంటి సినిమాని తీయాలనుకున్న ఆదుర్తీ, అందుకు ప్రోత్సాహమిచ్చి, తన హీరోయిజాన్ని ప్రక్కన పెట్టెల్లా ఇందులో నటించిన అక్కినేనినీ అినందించకుండా ఉండలేము.

ఈ సినిమాలో చూపించిన కొన్ని కొన్ని దృశ్యాలు, సింబాలిజం, ఉన్న ఒకే ఒక పాట మనలని కాస్త వెంటాడతాయి. మరో ప్రపంచం గురించి పూర్తిగా వ్రాయాలంటే మరో పెద్ద వ్యాసం అవసరపడుతుంది. వీలుననుసరించి వ్రాసే ప్రయత్నం చేస్తాను. ఇప్పటికైతే ఇవాళ్టి సాక్షి ఆదివారం అనుబంధంలో ఉంది దీని గురించి. అది చూశాక నాకు కలిగిన భావాలే ఈ టపా.

My Rating for this movie is 3.75.

చూసి మాత్రమే అర్థం చేసుకోవాల్సిన, ఆనందించ గలిగే సినిమా ఇది.

9 Comments
  1. Arvind November 30, 2009 /
  2. chandramouli November 30, 2009 /
  3. వెంకటాచలపతి November 30, 2009 /
  4. G November 30, 2009 /
  5. G November 30, 2009 /
  6. Ashok Reddy December 1, 2009 /
  7. jin soaked boy December 12, 2009 /
  8. Atlas Shrugged January 9, 2010 /
  9. G February 6, 2010 /