Menu

Monthly Archive:: January 2014

కృషీ వలుడు అక్కినేని – ఆచార్య ఆత్రేయ

అడుగు మోపే స్ధలమిచ్చేసరికి అలా పెరిగిపోయాడు వామనుడు, నాగేశ్వరరావుకు అడుగు మోపే అవకాశం ఎవరిస్తే ఏం? ఎలా పెరిగాడు,ఏం సాధించాడు అనేదే కధానాయకుడి కధ. ఎలా పెరిగాడు? జీరో లాంటి వేషంతో ప్రవేశించి,హీరో దాకా పెరిగాడు. ఏం సాధించాడు? లక్షలు(వివరాలు ఉన్ కమ్ టాక్స్ వాళ్ళకూ,ఆయనకూ తెలుసూ)సంపాదించాడు. మద్రాసులో ఒక ఇల్లు కొన్నాడు.అమ్మాడు. మరొక ఇల్లు కట్టాడు. అమ్మాడు. హైదరాబాద్ లో ఒక ఇల్లు కొన్నాడు. ఇంకొక ఇల్లు కడుతున్నాడు. పొడి చేస్తాం, దంచేస్తాం అనే ఒక

ప్రేమనగర్

1971 లో వచ్చిన ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో ఒక కొత్త ఒరవడిని ఒక చరిత్రని సృష్టించింది.చిత్ర సీమలో నిర్మాతగా రామానాయుడికి, నవలా నాయకుడిగా అక్కినేని స్థానాన్ని సుస్థిరం చేసింది.అప్పటికి రామానాయుడు నిర్మాతగా తట్టా బుట్టా సర్దుకుని ఇంటికి వెళ్ళే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా ఆయనే చాలాసార్లు ఉటంకించినట్లు గుర్తు.చిత్రసీమలో అక్కినేని స్థానం అప్పటికి నిలకడగా ఉన్నప్పటికీ ఈ సినిమా తర్వాత తిరుగులేకుండాపోయింది. అప్పటికి చాలా నవలలు సినిమాలుగా రూపం సంతరించుకున్నప్పటికీ, కోడూరి (అరికెపూడి) కౌసల్యాదేవి గారి

తోడికోడళ్ళు

ఇది ముగ్గురు తోడికోడళ్ల కథ. అన్నపూర్ణ (కన్నాంబ) , అనసూయ (సూర్యకాంతం ), సుశీల (సావిత్రి). పెద్ద కోడలు అన్నపూర్ణ మాట కటువైనా మనసు మాత్రం నవనీతం లాంటిది. ఆమె భర్త కుటుంబరావు (ఎస్.వి.రంగారావు) మంచి పేరున్న వకీలు. కోర్టు విషయాలు తప్ప ఇంటి విషయాలు పట్టించుకోడు. పైగా ఇంటివిషయాలంటే మతిమరుపు కూడా. రెండో కోడలు అనసూయ అసూయాపరురాలు. ఆమె భర్త రమణయ్య ( రేలంగి) పేకాట రాయుడు, కులాసాగా తిరగడం,ఎప్పుడూ డబ్బు తగలేయడమే . మూడో

తెనాలి రామకృష్ణ

కత్తులును ఘంటములు కదనుతొక్కినవచట, అంగళ్ళ రతనాలనమ్మినారట అచట, నాటి రాయల కీర్తి నేటికిని తలపోయు తుంగభద్రా నదీ సోయమాలికలందు ఆడవే జలకమ్ము లాడవే… అంటూ విజయనగర సామ్రాజ్య ప్రాభవాన్ని వర్ణిస్తారు డా.సి నా రె గారు.అలా..తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి, అష్టదిగ్గజాల వైశిష్ట్యాన్ని, భువనవిజయపు ప్రాభవ వైభవాన్ని కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు ఈ సినిమాలో. తెలుగదేల యన్న దేశంబు తెలుగేను తెలుగు వల్లభుండ తెలుగొకండ యెల్ల నృపులు గొలువ యెరుగవే బాసాడి దేశభాషలందు తెలుగు లెస్స అంటూ

మేఘసందేశం

అతను గోదారి ఒడ్డున ఉన్న పల్లెటూరిలో ఓ పెద్ద మనిషి. నలుగురికీ మంచీ చెడూ చెప్పే వ్యక్తి. అతని భార్య మామూలు పల్లెటూరి మహిళ. పూజలు, వ్రతాలు, కుటుంబ వ్యవహారాలు..ఇవే ఆమె ప్రపంచం. వాళ్ళిద్దరికీ ఓ కూతురు. అతనికి సంగీతసాహిత్యాల పట్ల అభినివేశం, వాటిలో ప్రవేశం ఉన్నాయి. అతని భార్యకి ఇవేమీ తెలియదు. ఇంతలో ఆ ఊరికి ఓ ‘దేవదాసి’ వచ్చింది. ఆమె తన ఆటపాటలతో ఆ ఊరి కుర్రాళ్ళందరినీ ఆకట్టుకోడం మొదలుపెట్టింది. ఆమెని ఊరినుంచి పంపేయమని