Menu

Balak-Palak – మరాఠీ మెరుపు

విజ్ఞానశాస్త్రం చెప్పినట్టు మనిషి ఏకకణ జీవి అమీబా నించి పరిణామం చెందాడా లేక మన బైబిల్లో చెప్పినట్టు దేవువు ఆడ మగా ఆడం..ఈవ్ ని సృష్టిస్తే వాళ్లనించి ఈ లోకంలో ఇంత జనాభాగా విస్తరించిందా.. లేక మిగతా మత గ్రంధాలలో చెప్పినట్టు మానవుడు మరో విధంగా ఉద్బవించాడా …?? ఏమో ఎవరికి తెలుసుకనక… తెలుసుకున్నా చేసేదేముంది కనక.  తొలి మానవుడు ఎలా  పుట్టాడో తెలియదు కానీ మలి మానవుడు మాత్రం ప్రత్యుత్పత్తి ద్వారా అని అందరికీ తెలుసు. జీవులు పరిణామం అన్న పాఠంలో జాతులు ప్రజాతులు, మొక్కలు చెట్లు..కీటకాలు..ఉభయచరులు…జలచరాలు.,. సరీసృపాలు.. గుడ్లుపెట్టే జీవులూ..క్షీరదాలు ..అనే పాఠాలతో మొదలయ్యి.. ఏ రకం జీవులు ఎలా ప్రత్యుత్పత్తి జరిపి పిల్లలని కంటాయో అనేది  పాఠ్యాంశాలుగా పెట్టారు. ఉమ్మెత్త పువ్వు ఫపదీకరణం.. మొక్కల అంటుకట్టు విధానం..కప్పల ప్రత్యుత్పత్తి…దోమల ఎదుగుదల..చిక్కుడు గింజ మెలకెత్తే సంగతీ..చివరికి  మానవ ప్రత్యుత్పత్తి విధానం అన్నీ తరగతిలో చదువుకున్నాం..  అదంతా చదువు .. ఆ యేడు ప్రశ్న జవాబులకి పనికొస్తుంది.మిగితాజీవుల్లా  ప్రత్యుత్పత్తి విధానాన్ని ఒక అసంకల్పిత ..కాలానుగుణ శారీరక చర్యలా  కాకుండా భావోద్రేకంతో..మోహంతో..కాంక్షతో..కళాదృష్టితో.. అర్పణతో సుఖపారవశ్యం + మానసిక మహదానందం  చెందటానికీ ఉపయోగపడే సహజ దైవిక చర్య గా చేసుకోగలిగాడు  కనక  ఈ విషయంలో మాత్రం మానవ జీవితం చాల గొప్పది..ఆనందదాయకమైనదీ..ఉత్తమమైనదీ అని మాత్రం చెప్పవచ్చు.  మనకి విషయం  తెలిసినా తెలియకున్నాఅ అనుభవించటం..అనందించటం ఆగనిది..ఎందుకంటే అదొక సహజాత ప్రోద్భలం.. సహజ చర్య కనక. ఏదో విధాన తెలుస్తుంది..తెలుసుకుంటాం..జరిగిపోతుంటుంది. అయితే  సరైన పద్దతుల్లో తెలుసుకోవటం ద్వారా జీవితాన్ని కోల్పోకుండా  చక్కగా .. ఎక్కువగా ..ఉత్తమంగా.. ఉన్నతంగా  ఆనందించగలుగుతాము. 

కూడూ, గూడు, గుడ్డ అనేవి ప్రాధమిక అవసరాలుగా చెప్పుకుంటాం. అయితే కేవలం వాటితో సరిపోదు మనిషికి. అవి ఎల్లకాలం అవసరమే అయినప్పటికీ.. మధ్యలో వయసు పెరుగుదలతో పాటు కావలసిన శారీరక మానసిక ప్రోద్బలాలు ఉన్నాయి. వాటిల్లో కామం శారీరకమైతే స్నేహం మానసికమైనది.  బయోలాజికల్ పరంగా పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు అతి క్లిష్టమయినది అని చెపుతారు. ఎందుకంటే..శారీరక ఎదుగుదల ఒకవైపు.. మానసికంగా ఎదిగి వ్యక్తిత్వాన్ని సంతరించుకునే సమయం మరోవైపూ..శారీరక ప్రోద్బలాలు ఒకవైపూ.. ప్రపంచాన్ని గ్రహించే పారడియం షిఫ్ట్ మరోవైపు.ఈ వయసు రాగానే లైంగిక హర్మోనుల ఉత్పత్తి జరిగి కౌమారదశ నించి యౌవనంలోకి అడుగుపెట్టి అన్ని అవయవాలు సంపూర్ణత్వాన్ని సంతరించుకుని..శారీరకంగా ఎదుగుతారు. . అన్నాళ్ళూ చెప్పినమాట వింటు..పెద్దల దృక్పథంలోనే లోకాన్ని చూస్తున్న వాళ్లు స్వంత దృక్పథం మొదలయ్యి మెల్లిగా ప్రశ్నించటం మొదలుఅవుతుంది. ప్రపంచంలో ఏదీ సరిగ్గా ఉన్నట్టు తోచదు.అప్పటివరకూ ఉన్న నమ్మకాలు పటాపంచలయ్యి తమ అనుభవ పూర్వక నమ్మకాలని కల్పించుకోజూస్తారు. వ్యక్తిగా ఎదగటానికి వ్యక్తిత్వాన్ని సంతరించుకునే తొలి దశలో ఉంటారు. సరిగ్గా ఇప్పుడే అవతలి వ్యక్తి మీద ( opposite sex ) కూడా ‘కోరిక’,   కుతూహలం కలుగుతుంది.

కామం ఏమిటి ..ఎందుకూ అని తెలుసుకోవాలనే కుతూహలానికి తోడు.. కోరిక లోపలినించి బలంగా తంతూంటే.. అవతలి వ్యక్తిని ఆకర్షించాలన్న తమన మొదలవుతుంది.
ఆ ఉత్సుకతలో ఒక్కొరు ఒక్కోదారి ఎంచుకుంటారు. భయంవల్లో …తప్పు అన్న ఫీలింగ్ వల్లో మొదట్లో ప్రత్యక్ష అనుభవానికంటే పరోక్ష అనుభవానికి ప్రయత్నిస్తారు. అందులో భాగంగానే కామప్రవృత్తికి సంభందించిన పుస్తకాలు..సినిమాలు వీటికి చూడటానికి ఎగబడతారు.

పల్లెటూళ్ళలో అయితే పిల్లలకి కావలసిన స్పేస్ ఉంటుంది.. పిల్లలూ + కొంచం పెద్దలూ ఒకరి జ్ఞానాన్ని మరొకరు పంచుకొని  తెలుసుకునే అవకాశం ఉంటుంది.  అదే పట్టణాలలో అయితే పిల్లలకి కావలసిన స్పేస్ అండ్ టైం దొరకటం కష్టమే అనుకోవచ్చు. ముఖ్యంగా మధ్యతరగతి కుంటుంబాలలో కామాన్ని నీచంగా చూడటం వల్ల జీవితపు దెబ్బలకి తట్టుకోలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులుండటం వల్ల.. ఏమాత్రం చెడు పేరొచ్చినా సమాజం చులకనగా చూస్తుందనీ…చులకనలో బతకలేమని అనుకోవటం వల్ల ఆ మధ్యతరగతి పిల్లలకి ఈ విషయ జ్ఞానం అందటానికి అడ్డంకులు ఎదురవుతాయి. అయినా ఆగదు ఎందుకంటే మనసులోని ప్రోద్బలం ఊరుకోనివ్వదుగా …ఏదో దారి వెతుక్కుంటుంది !!

తాము టీనేజ్ నించే వచ్చినా ఆ వయసులో తమని వెంటాడిన ప్రశ్నలూ.. మొలకెత్తిన కోరికలూ తల్లిడండ్రులకి గుర్తుంటాయా.. గుర్తున్నా పిల్లలని గమనించి వాళ్లకి సరిగ్గా విశదీకరిస్తారా ??

టీనేజ్ కాలేజ్ లో ఉన్న యువతీ యువకుల మీద సినిమాలు కామన్. ప్రీటీన్ లవ్ స్టోరీస్ కూడా కొన్ని వచ్చాయి. మలీనా లాంటి అద్బుతమైన ప్రపంచ సినిమాలు ఉన్నాయి. తెలుగులో నోటు బుక్కు.. టెంత్ క్లాసు, బాయ్స్  లాంటి సినిమాలూ వచ్చాయి.
అయితే ప్రీ టీన్ సెక్సువల ఇంట్రెస్ట్.. అండ్ సెక్స్ ఎడ్యుకేషన్ మీద అర్థవంతమైన సినిమా ఒక్కటికూడా రాలేదనే చెప్పొచ్చు. ఎంతసేపూ అయితే హీరోఇజం.. లేదా టిటిలియేట్ చేసి డబ్బులు సంపాదిద్దాము అనే సినిమాలే తప్ప అర్థవంతమైన చిత్రాలు తీయొచ్చు.. తీసి జనాన్ని మెప్పించొచ్చు అనే సృహఉన్న దర్శకనిర్మాతలు బహు కొద్దిమందే కనక… ఇలాంటి సినిమాలు ఎప్పుడో కానీ రావు. ఇదుగో అలాటి ఒక రేర్ సినిమా యే ఈ సినిమా .
నాకు స్పష్టంగా గుర్తుంది. మా పక్కటౌనులోకాలేజీలో జేర్పిస్తే అక్కడ ఒక థియేటర్లో ఆడే బూతు సినిమాలకి వెళ్లటం.. మూతి మీద మీసం సరిగ్గా రాకపోవటం కారణం చేత.. ఎవడు తిడతాడో..టికెట్టిస్తారో లేదో ..తక్కువగా చూస్తారేమో.. అని భయంభయంగా టిక్కెట్టుకొనుక్కొని లోపలికి వెళ్లటం..

ఏదో పైపై వేషాలే తప్ప అసలు గుట్టు ఏ సినిమాలోనూ చూపక పోవటం తో విసిగి వేసారాము నేను నా మిత్ర బృందం. ఇహ చివరాఖరికి ఎవడినో పట్టుకొని పడరాని పాట్లు పడి ( ఆ పాట్లన్నీ రాస్తే గమ్మత్తుగా ఉంటూ మరో సినిమా తీయొచ్చు. అయినా అలాంటివి అందరికీ ఉండేవే ) ఒక్క క్యాసెట్టు సంపాదించి ‘ తొలి సారి సినిమాని సాంతం చూసాం. ఒళ్ళంతా వేడెక్కి తెల్లారేసరికి దాదాపు అందరికీ జ్వరం పట్టుకున్నది. మావాడు ఒకడైతే గజ గజా వణికి వాంతులు కూడా చెసేసుకున్నాడనుకోండి. సో ఏదైతేనేమి కావలసిన జ్ఞానాన్ని పొందగలిగాము. అటుమీద అడపా దడపా ఆ సినిమాలు చూడటం..అమ్మాయిలని ఆకర్షించాలన్న తపన పడటం అలవాటయ్యింది. అది అటు వదిలేస్తే ……

నగరజీవితం.,,అపార్ట్మెంట్ సంసృతిలో ఓ  ఫ్లాటు.  తలుపులేసి మరీ   పిల్లాడిని బాదుతూ ఉంటాడు తండ్రి. చదువుకోతానికి పుస్తకాలు..ఆట సామగ్రీ.. హాబీకి గిటారు ఇలా అడిగినవన్నీ కొనిపెడితే ఇదట్రా నీవు చేసేదీ అంటు. అటు తల్లి ఎందుకు పిల్లాడినికొడుతున్నాడో అర్థం కాదు.  ఇరవైనాల్గు గంటలూ వాడిని చూస్తోంది నీవు. ఏం చేస్తున్నాడో  గమనిస్తున్నావా ? ఇదుగో ఇదీ మీ అబ్బాయి చేస్తున్న నిర్వాకం అని బూతు సీడీలు ఆమె చేతిలో పెడతాడు. విస్తుపోతుంది..చిన్నపిల్లాడు ఇలా చేయటమేమిటీ అని.అసలు వాడు స్కూలికే వెళుతున్నాడా.. అక్కడేంచేస్తున్నాడో కనుక్కోవాలి అని అనగానే..  కథ గతంలోకి వెళుతుంది.

ఓ పల్లెటూరు.. డాలి, చివ్ అనే ఇద్దరమ్మాయిలు  భాగ్య, అవ్య అనే ఇద్దరబ్బాయిలూ…ఈ  నలుగురు ప్రీటీన్స్ లో ఉన్నపిల్లలు. ఒకే తరగతిలోని మిత్రబృందం. ఎనమిదో /తొమ్మిదో చదువుతుంటారు. అర్థసంవత్సరం పరీక్షలు రాసి సెలవులన్న ఆనందంలో ఉత్సాహంగా కాలనీకి చేరుతారు. కానీ అదే సమయానికి  కాలనీలో ఉంటున్న  ఓకుటుంబం కాలనీ వదిలివెళ్ళిపోతుంటారు. ” ఆ జ్యోతి ఇలా చేస్తుందని అనుకోలేదు. పైకి కనపడేంత అమాయకురాలేం కాదా పిల్ల..ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లలని పట్టించుకుంటే కదా..పైకి మంచిలోపల చెడు. చెప్పకూడదు కానీ పేడతినే రకం ”  అమ్మలక్కలు చెవులుకొరుక్కుంటుంటే ఈ పిల్లల చెవిలో పడతాయి. ఏం జరుగుంటుంది. ఎందుకు జోతిఅక్క వాళ్ళు కాలనీ విడిచివెళ్లారు ?? పేడ తినటం అంటే అసలర్థమేమిటీ..?సెలవులు ముగిసేలోగా విషయం  కనుక్కొనితీరాల్సిందే అని కంకణం కట్టుకుంటారు నలుగురూ.. వారి వారి స్వంతప్రయత్నాలు చేసి దెబ్బతిని..చివరికి ఇలాంటి విషయాలు తెలిసేది క్లాసులో ఉండే ”పరమశుంఠ” అయిన విషు గాడికే అని వాడిదగ్గరికి వెళతారు. వాడికి  క్లాసు పుస్తకాల్లో ఉన్న విషయాలు  తప్ప జీవితంలోని విషయాలు బేషుగ్గా తెలుసు. వాడు అప్పటికే ‘ సంపద’ అనే పిల్లని ఘాడంగా ప్రేమిస్తున్నాడు కూడానూ . :p

” జీవితానికి కావలసిన మూల విషయాలు అందరికీ సహజంగానే తెలుస్తాయి. వాటిసి సరిగ్గా వాడుకోవటంలోనే తడబడుతుంటాం.”

విషయం పెద్దది.. దానికిముందు మీరు తెలుసుకోవలసింది షానా ఉన్నది.. అని ‘ జ్ఞాన ‘ భోద చేసే పుస్తకాలని అందిస్తాడు విషు వాళ్లకి.  అది మొదలు పిల్లలు కుతూహలంగా వాళ్లవాళ్ళ పద్దతుల్లో పుస్తకపఠనం సాగిస్తుంటారు. ఆ కాలనీ పెద్దమనిషి వీళ్లని ఒక కంట కనిపెడుతూ ఉంటాడు. ఒకింత అనుమానం వచ్చి  ‘అవ్య’  తండ్రికి చెప్పినా అతను పట్టించుకోడు. పెద్దమనిషికి మాత్రం  ఏదో జరుగుతోందని అనుమానం.
ఈ  స్నేహితులకోసం వస్తుంటే.. ఆ కాలనీలో నేహ అనే అందగత్తె  విషు కళ్ల పడుతుంది. ఆ అమ్మయిగురించి కామెంట్ చేయ బోతుంటే..ఈ నలుగుతూ తిడతారు.  అక్కలాంటిది అమె గురించి చెడుగా ఆలోచించకూ అని ..అప్పుడు మన విషు.. ” లోకంలో ఉన్నది ఆడ మగా..అంతే… అందరి మనసుల్లో ‘అదే ‘విషయం ఉంటుంది. పైకి కనపడితే  అసబ్యం.. రహస్యంగా అయితే సబ్యత. అంతే తేడా !!  సరే సరే..ఇహ పుస్తకాలు చదివిందిచాలు ..ఇప్పుడు ప్రాక్టికల్ గా అంటే  దొంగచాటుగా  చూసి  తెలుసుకోవాలి మీరు అంటాడు.
అది తప్పుకాదా.. అన్న ప్రశ్న వస్తుంది..
చూసేకదా తెల్సుకోవలసింది..అయినా దీనికేమన్నా ట్యూషన్స్ ఉంటాయా ..;) జీవితంలో ఇలాంటి విషయాలు ఎవరికి వాళ్లే చూసీ ..చేసీ తెలుసుకోవాలి.. అంటాడు.

ఇహ ఆపనిలో పడతారు పిల్లలంతా……అదే ఈ సినిమా !!
మీరు మీజీవితంలో  పడ్డపాట్లని,  మీకెదురొచ్చిన సంఘటనలనీ ..అనుభవాలనీ  ( జ్ఞానోదయాలన్ని) గుర్తుకు తెస్తూ.. ఆద్యంతం  అసభ్యత లేకుండా హాస్యధోరణిలో ఉత్సాహంగా సాగిపోతుందీ సినిమా !!
యవ్వనారంభం..విషయాసక్తీ.. పిల్లలు వ్యక్తులుగా ఎదగటం..స్నేహితుల మధ్య అపార్థాలు..విడిపోవటం…క్షమాపణలూ..కలయికలూ.. పెద్దల కోపతాపాలూ, ఏడుపులూ.. వాళ్ళ విషయవిశదీకరణ శక్తి లేమి..అవహనా రాహిత్యం, ఎలా చెప్పాలో తెలియనితనం ..కలగలిసిన వివిధ భావోద్వేగాలు నిండుగా ఉన్న సినిమా ఇది.

నటీనటులంతా సహజంగా చక్కగా నటించటంతో పాటూ..అన్ని విభాగాల్లో ఆకట్టుకునే పనితనం కలిగిఉంది ఈ సినిమా. ఈ మధ్య వ్యర్థ  ద్వందార్థ సినిమాలు తీస్తున్న రితేష్ దేశ్ముక్ ఈ  అర్థవంత సినిమా నిర్మాతల్లొ ఒకరు కావటం విశేషం. 🙂

పిల్లలు కలుగుతారు.. ఎప్పుడు ఏ టీకా వేయించాలో వేయిస్తాము. ప్రతి సంవత్సరం గొప్పగా పుట్టినరోజు వేడుకలు జరుపుతాము. మంచి స్కూల్లో వేయాలని తపన పడతాము. పండక్కి మనకున్నా లేకున్నా కొత్తబట్టలు పిల్లలకి ఉండాలని అనుకుంటాము. కానీ యుక్తవయసులో వాళ్లకి కలిగే ప్రశ్నలనీ..ఆసక్తులనీ.. శారీరక ప్రోద్భలాలకి సంభందించిన సహజ విషయాలని  మాత్రం పట్టించుకోము. అడగజూస్తే కోప్పడతాం..తెలుసుకోచూస్తే తప్పు అని అడ్డుకుంటాం..చదువులో వెనకపడుతున్నాడని సైక్రియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువేళతాం..కానీ మనసులో జరుగుతున్నదేంటో గ్రహించం. చెడు అలవాట్లు అవుతున్నాయని వాపోతాం..దానికి మూలకారణం ఎంటో తెలుసుకోం. మతాలు చెప్పిన  సూత్రాలలో నీతి నియమ నిభందనల్లో  పడి సహజాల్నీ..సహజాతాలని అర్థం చేసుకోలేకపోతున్నాం.  అందాల్సినవి అందనపుడు ..అందుకోచూస్తే …అడ్డుకట్ట వేస్తే .. అక్రమదారుల్లో ప్రవహిస్తుంది  ప్రోద్భలం. అందుకే సక్రమంగా దారి చూపిస్తే అది పిల్లల జీవితానికీ..పెద్దల ఆనందానికీ..సమాజ శ్రేయస్సుకీ అన్నివిధాలుగా ఉపయుక్తం.

ప్రపంచం..సకల జీవులూ  సహజప్రవాహంలో పోతున్నవి. మనిషిమాత్రం  ఉన్నదీ లేనిదీ కల్పించుకొని.. లేనిపోనివి ఊహించుకొని ..తప్పు ఒప్పులని నిర్వచించుకొని   సహజజీవిత  ప్రవాహానికి అడ్డుకట్ట వేసుకోవటం వల్ల.. ఆ ప్రవాహాన్ని సరైన దారిని కల్గించుకోక పోవటం వల్లే ఈ వికృతులూ ..వికటించటాలూ.. విపరీతాలూ కల్గుతున్నాయ్ లోకంలో   !!

బాలక్ – పాలక్  >>>> టీనేజ్   పిల్లలూ…టీనేజీ పిల్లలున్న పెద్దలూ తప్పకచూడాల్సిన సినిమా ఇది.