Menu

Monthly Archive:: December 2013

వియోగ వేదనల – Brief Encounter: సలపరింతల గాయము, సాంత్వనల లేపనమూ!

జ్ఞాపకాల్నీ, మనల్నీ కలిపే దారం గజిబిజిగా ఉంది కాబట్టి కొంత నయంగానీ, కుళ్లుమోతు విధి విధించిన సంకెళ్లకి ఇలా మిగిలాం గానీ, అదే కురచైన సరళరేఖైనట్లైతేనా ఇంకెంత నరకం? తుది- మొదలు తెలిసిపోయి, రెండు కొసల చివర్లలో ఏమీలేనితనం ఎడతెగని ఖాళీలా- అవును ప్రియా! ఇప్పుడు, వీడ్కోలు చెప్పుకోవల్సిన పరిస్థితులు దాపురించిన ఈ గుబులు పొగుళ్ల గుంజాటనే ఈవలి కొస అయితే, మన కలయికకి మొదలెప్పుడు? నిజానికి మనది కలయికేనా అసలు? అదొక తత్తర బిత్తరల తమి,

Lucia – స్వప్నజీవితం

చిన్నప్పుడు కథలు చదివేవాళ్ళం. అందులో  ప్రతి కథకీ ఓ నీతి ఉండేది. అయితే రామాయణ భాగవతాల్లాంటి కావ్యాల్లోనూ..నవలల్లోనూ  ప్రతి చోటా నీతులు..జీవన సత్యాలూ , ప్రవచనాలూ అడుగడుగునా దర్శనమిస్తుంటాయి. సినిమా కూడా విజువల్ గా చెప్పేకథే కనక దానికీ ఓ సారాంశం ఉండాల్సిందే. దీన్నే సినిమా పరంగా మనం ఇతివృత్తం/ ఫిలాసఫీ లేదా /జీవితసత్యం అంటాం.  అయితే పూర్తి వినోదాత్మక చిత్రాలలో సారాంశం గొప్పగా ఉండకపోవచ్చు. వినోదం మరుగున ఆ బలహీనమైన/కొత్తది కానటువంటి  సారాంశాన్ని ప్రేక్షకులు పట్టించుకోరు. 

అడూర్ తో ముఖాముఖి-మూడవ భాగం

ప్ర: సమకాలీన భారతీయ కళ ఈ సంప్రదాయానికి దీటుగా ఎదిగిందా? అడూర్: అసలు మనం మనదైన, మన స్వంతమైన ఒక సంప్రదాయం అనేదాన్ని ఎరిగి ఉన్నామా అనేది ఒక ప్రశ్న. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇటీవలి కాలాన్ని దాటి చూస్తున్నామా? అసలు మన చుట్టూనే రోజూ జరిగే సంఘటనలనే ఒక తదేక దృష్టితో పట్టించుకుంటున్నామా? నా సినిమాల్లో కాకులు, కుక్కలు, బల్లులు ఇలాంటి వాటినన్నిటినీ అనేక రకాలుగా ఉపయోగించుకున్నాను. ఇవన్నీ ఎవరన్నా గమనించారో అర్ధం చేసుకున్నారో లేదో

బెర్గ్ మెన్ ’ వైల్డ్ స్ట్రా బెర్రీస్

సినిమా ఓ కళాత్మక ప్రక్రియ అన్నదానికి సరైన నిర్వచనాలు గా ప్రపంచ సినీ చరిత్ర లో ఎన్నదగిన అతి తక్కువ సినిమాల్లో స్వీడిష్ దర్శకుడు ఇంగ్మార్ బెర్గ్ మెన్ సినిమాలు ముఖ్యమైనవి. సినిమాల ద్వారా , ఆనాటి నుంచీ ఈ నాటి వరకూ సినిమా అభిమానులకీ ముఖ్యంగా విమర్శకులకూ, మేధావులకూ రకరకాలుగా అర్థం అవుతూ ఆరాధించబడుతూ వచ్చాడు బెర్గె మెన్. ఆయన కేవలం సినిమా దర్శకుడు మాత్రమే కాదు. ఆయనొక ఫిలాసఫర్. ఆయనొక కవి. ఆయనొక స్వాప్నికుడు.

The Cabinet of Dr Caligari – సమీక్ష

భావ వ్యక్తీకరణ వాదపు సినిమాలుగా పేర్కొనబడే సినిమాలు ఎన్నో వున్నా, తొలి Expressionist సినిమాగా ప్రాచుర్యం పొందిన ’The Cabinet of Caligari’  ద్వారా భావ వ్యక్తీకరణ వాదపు ఆలోచనలు సినిమా తెరపైకి ఎలా అనువదించబడ్డాయనే విషయాన్ని చర్చించడం ఈ వ్యాసం లక్ష్యం. ఈ వ్యాసంలో విషయాలని గ్రహించడానికి ఈ సినిమా చూసి ఉండడం అవసరం అనుకుంటున్నాను. ఈ వ్యాసం చదివే ముందు ఇక్కడ ఆన్ లైన్ లో ఉన్న ఈ సినిమా చూడవలసిందిగా మనవి. కథ:సినిమా