Menu

Monthly Archive:: December 2013

Zombie – జీవమున్న శవం

  పడమటి ఆఫ్రికాలో కొన్ని మంత్ర తంత్ర శక్తులూ నమ్మకాలకి సంభందించిన పదం జోంబీ ..దాని అర్థం ‘బ్రతికిన శవం’. శవానికి  తంత్ర విద్య ద్వారా ప్రాణంపోస్తే  జోంబీ అంటారు. అలా బతికించి దాన్ని ఒక బానిసగా వాడుకుంటారట.అయితే అవి మామూలు మనుషుల్లా ఉండక నడవలేక నడుస్తూ వింతగా ఉంటాయి.  మైకెల్ జాక్సన్ థ్రిల్లర్ లో స్మశానంలోంచి లేచొచ్చిన శవాలమీద చిత్రీకరించిన పాట ఎంత గొప్ప హిట్టో మనకి తెలిసిందే.   ఆ చరిత్ర అటుంచితే..  పాశ్చ్యాత్యులు 

Welcome

వృత్తానికి ఒక్క కేంద్రమే అయినట్లు అతని బ్రతుక్కి ఆమె ఒక్కటే లక్ష్యం. ఒన్…టూ…థ్రీ! మూడు లెక్క పెట్టగానే తల నీటిలోనుంచి కుడి వైపుకి పైకెత్తి ఊపిరి పీల్చుకోవాలి. వెంటనే తలను నీటిలో ముంచి ఊపిరి వదలాలి. ఒన్…టూ…థ్రీ! మూడు లెక్క పెట్టగానే తల నీటిలోనుంచి ఎడమ వైపుకి పైకెత్తి ఊపిరి పీల్చుకోవాలి. వెంటనే తలను నీటిలో ముంచి ఊపిరి వదలాలి. ఇలా చేస్తున్నంత సేపు, నీళ్లలో కాళ్ళాడిస్తూ, చేతులను కిందకి పైకి ఆడిస్తూ నీటిలో ముందుకు పోవాలి.

The Hobbit – Desolation of Smaug

1. సీ. మొదటి భాగము మెండు ముచ్చట కల్పించె, హాబిట్టు కథజూడ నబ్బురమ్ము కథకు నాయువుపట్లు కదలివచ్చిరి షైరు, గాండాల్ఫె వెనుదన్ను కారణమ్ము బిల్బోను జతచేర పిలువవచ్చిరి వారు, సాహసయాత్రకు సత్వరమ్ము తాతల రాజ్యము తమ ధనాగారము, కబళించె నొక్క రాకాశిబల్లి తే. అంతమొందించి దానిని స్వంతసొమ్ము, చేత చిక్కించుకొనవలె శీఘ్రతరము పరహితమ్ముండు పరదేశ పయనముండు, గాన మరుగుజ్జులన్ బిల్బొ కలసి సాగె 2. తే. పూర్వ రంగము కొద్దిగా పొందుపఱచి, బిల్బొ కథలోకి ఎటులొచ్చె పిసరుచెప్ప

అడూర్ తో ముఖాముఖి- ఐదవ భాగం

ప్ర: కళాశాలలో ఉండగా ఎటువంటి నాటికల్లో ఆసక్తి ఉండేది? అడూర్: ఎక్కువ సాంఘికాలే. తొప్పిల్ భాసి, ఎస్సెల్ పూరం ప్రభ్రుతుల నాటికలు వేసేవాళ్ళం. అప్పట్లో చాలా బహుమతులు కూడా సంపాయించాను. గాంధీగ్రాంలో చదువుతుండగా అనియార అని ఒక నాటిక చేశాను. అది ఆ రోజుల్లో నాటికల పోటీల్లో మొదటి బహుమతి గెల్చుకుంది. అదొక తమాషా ఇతివృత్తం. నాటిక వెయ్యడానికి సిద్ధపడుతున్న ఒక ఎమెచ్యూర్ ట్రూపు కథ .. నాటిక అంతా గ్రీన్ రూములో జరుగుతుంది. నాటికలో నాటిక

అడూర్ తో ముఖాముఖి-నాలుగవ భాగం

ప్ర: బహుశా ఇది ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పరిణామం కావచ్చు. ఒక సాంస్కృతిక బీజం నించి పుట్టిన మర్రి చెట్టు బలంగా వేళ్ళూనుకుని మిగతా చిన్న చిన్న సంస్కృతిక మొక్కల్ని బతకనీయకుండా చేస్తున్నది. అడూర్: అవును. ఇవ్వాళ్ళ మనం డబ్బు తెచ్చి పెట్టేవి మాత్రమే ముఖ్యమైనవని అనుకుంటూన్నాం. ఈ క్రమంలో మన ఉనికినే మనం మర్చిపోతున్నాం. అంతే కాకుండా .. ఈ చిన్న సంస్కృతులు తమని తాము తక్కువగా, కించపరుచుకుంటూ చూసుకునే పరిస్థితి తయారవుతున్నది. వలసవాద పిచ్చి