Menu

The Cabinet of Dr Caligari – సమీక్ష

భావ వ్యక్తీకరణ వాదపు సినిమాలుగా పేర్కొనబడే సినిమాలు ఎన్నో వున్నా, తొలి Expressionist సినిమాగా ప్రాచుర్యం పొందిన ’The Cabinet of Caligari’  ద్వారా భావ వ్యక్తీకరణ వాదపు ఆలోచనలు సినిమా తెరపైకి ఎలా అనువదించబడ్డాయనే విషయాన్ని చర్చించడం ఈ వ్యాసం లక్ష్యం. ఈ వ్యాసంలో విషయాలని గ్రహించడానికి ఈ సినిమా చూసి ఉండడం అవసరం అనుకుంటున్నాను. ఈ వ్యాసం చదివే ముందు ఇక్కడ ఆన్ లైన్ లో ఉన్న ఈ సినిమా చూడవలసిందిగా మనవి.

కథ:సినిమా మొదలయ్యే సరికి ఫ్రాన్సిస్ మరొక వృద్ధునితో కూర్చుని వుంటాడు. ఆ వృద్ధుడు ఈ పరిసరప్రాంతాల్లో ఆత్మలు సంచరిస్తున్నాయని చెప్తాడు. ఈ లోగా తెల్ల దుస్తులు ధరించిన ఒక యువతి అటుగా వెల్తుంది. ఫ్రాన్సిన్ ఆమెను చూపించి ఆమె తన కాబోయే భార్య అని, వాళ్ళిద్దరికీ అనుభవమైన ఒక సంఘటనను ఆ వృద్ధునికి చెప్పడంతో కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెల్తుంది.

జర్మనీ లోని ఒక పట్టణంలో ఒక జాతర జరుగుతుంటుంది. రక రకాల వింతలు విశేషాలు అక్కడ ప్రదర్శింపబడుతుంటాయి. ఆ జాతర లో తన ప్రదర్శన ఏర్పాటు చేసుకోవాలని అనుమతి కోరడానికి పురపాలక ఆధికారులను సంప్రదించడానికి వస్తాడు కలిగరి. ఆ అధికారి అనుమతి ఇవ్వకపోగా కలిగరి ని అవమానిస్తాడు. ఆ రాత్రి ఎట్టకేలకు జాతరలో తన ప్రదర్శన ఏర్పాటు చేస్తాడు. విచిత్రంగా ఆ రోజే ఆ పురపాలక అధికారి హత్యగావించబడతాడు.

కలిగరి ప్రదర్శనలో ఒక సోమ్నాంబలిస్ట్(నిద్రలో నడిచే వాడు) ని ప్రజలకు పరిచయం చేస్తాడు. ఆ ప్రదర్శన చూడడానికి ఫ్రాన్సిస్ మరియు అలెన్ బయల్దేరుతారు. ప్రదర్శనలో కలిగరి ప్రేక్షకుల్లో ఎవరైనా ముందుకు వస్తే సోమ్నాంబులిస్ట్ ద్వారా తమ భవిష్యత్తు తెలుసుకోవచ్చని ప్రకటిస్తాడు. అలెన్ ముందుకు వచ్చి తను ఇంకా ఎన్నాళ్ళు బతుకుతాడని అడుగుతాడు. అందుకు సమాధానంగా రేపు ఉదయంలోపల అలెన్ మరణిస్తాడని చెప్తాడు సోమ్నాంబలిస్ట్. అతని మాటలు తేలిగ్గా తీసుకుని అక్కడ్నుంచి బయల్దేరుతారు అలెన్ మరియు ఫ్రాన్సిస్.

జాతర నుంచి బయల్దేరిన వారిద్దరికీ దారిలో జేన్ అనే యువతి కలుస్తుంది. వారిద్దరూ ఆమెను ప్రేమిస్తుంటారు. ఆ రాత్రి ఫ్రాన్సిస్ ఇంట్లో వుండగా అలెన్ చనిపోయాడన్న వార్త అందుతుంది. ఈ హత్యల వెనుక కలిగరి ఉన్నాడేమో అన్న అనుమానం కలుగుతుంది ఫ్రాన్సిస్ కి. ఈ లోగా కలిగరి సోమ్నాంబులిస్ట్ సహాయంతో జేన్ ను బంధించే ప్రయత్నం చేస్తాడు. ఈ విషయం గ్రహించిన ఊరి ప్రజలు సోమ్నాంబులిస్ట్ ని వెంటాడుతారు. జేన్ ని వదిలేసి అతను తప్పించుకుంటాడు. ఇదే సమయంలో కలిగరి ని ఫాలో అవుతూ ఫ్రాన్సిస్ ఒక మెంటల్ హాస్పిటల్ చేరుకుంటాడు. అందులోకి కలిగరి వెళ్లడం చూసి అతని ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అక్కడా పేరుతో ఎవరూ లేరని చెప్తారు హాస్పిటల్ వారు.

ఫ్రాన్సిస్ కి ఆ హాస్పిటల్లో ముఖ్య వైద్యుణ్ణి కలిసే అవకాశం వస్తుంది. అతని ద్వారా కలిగరి గురించి తెలుసుకోవాలని అతని ఆఫీసులోకి అడుగుపెట్టిన ఫ్రాన్సిస్ షాక్ తింటాడు. అతనే కలిగరి. రహస్యంగా ఆ డాక్టర్ డైరీలు చదివి ఆ డాక్టరే కలిగరి అని నిర్ధారించుకున్నానని, ఇప్పుడు కలిగరి ఒక మెంటల్ హాస్పిటల్ లో ఇనుపగొలుసులతో బంధింపబడిఉన్నాడని ఫ్రాన్సిస్ చెప్పడంతో ఫ్లాష్ బ్యాక్ ముగుస్తుంది. అక్కడ్నుంచి ఫ్రాన్సిస్ మరియు ఆ వృద్ధుడు బయల్దేరుతారు.

వారిద్దరూ నడుచుకుంటూ చేరుకున్న ప్రదేశం చూడగానే వాళ్ళ చేరుకున్నది ఒక మెంటల్ హాస్పిటల్ అనీ, జేన్, సోమ్నాంబులిస్ట్ తో ఫ్రాన్సిస్ కూడా అక్కడ పేషెంటే అని ప్రేక్షకులకి ఇట్టే అర్థమయిపోతుంది. వారికి చికిత్స చేసే వైద్యుడు ఫ్లాష్ బ్యాక్ లో చూపించిన డాక్టర్ కలిగరి లాగానే వుండడం ప్రేక్షకులను మొదటి షాక్ కి గురిచేస్తుంది. ఆ తర్వాత ఫ్రాన్సిస్ ఆ డాక్టర్ పై తిరగబడతాడు. అతనలా ఎందుకు చేస్తున్నాడో కారణాలు తెలియచేస్తాడు కలిగరి. దాంతో కథ ముగుస్తుంది. ప్రేక్షకులు పూర్తిగా షాక్ తింటారు.

నా అభిప్రాయం:దాదాపు వందేళ్ళ క్రితం ఈ సినిమా వచ్చిందంటే నిజంగానే నమ్మలేకపోయాను. కథ, కథనంలో వైవిధ్యమే కాకుండా పూర్తిగా స్టూడియో లో సెట్లపై చిత్రీకరించిన ఈ సినిమా మొదటి ఫ్రేము నుంచి ఎంతో ఆకట్టుకుంటుంది.

భావవ్యక్తీకరణ వాదపు కళలలో ముఖ్య అంశమైన ’distorted reality’ ఈ సినిమా సెట్స్ లో బాగా కనిపిస్తుంది. ఈ సినిమాలో రోడ్లు, ఇళ్ళు, గోడలు, చివరికి నీడలు సైతం విచిత్రంగానే ఉంటాయి. ఇలా ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు ఉంది అనే ప్రశ్నకు సమాధానం చాలా సుళువు-51 నిమిషాల పాటు ఉన్న ఈ సినిమాలో 45 నిమిషాలు కేవలం ఇద్దరి మెంటల్ పేషెంట్స్ ఊహల్లో జరుగుతుంది. అంటే నిజానికి జరగదు, కేవలం ఊహా ప్రపంచంలో జరిగిన ఒక సృష్టి ఈ సినిమా ముఖ్య కథ. ఒక మెంటల్ పేషెంట్ మదిలో జరిగే ఒక ఊహాభరితమైన ప్రపంచాన్ని చిత్రించడానికి భావవ్యక్తీకరణ వాదపు ఆలోచనలు ఉపయోగించారు ఈ సినిమా సృష్టి కర్తలు.

ఈ సినిమా గురించి మరిన్ని విశేషాల కొరకు కొంతమంది ప్రముఖుల అభిప్రాయాలను పరిశీలిద్దాం.

ఇతరుల అభిప్రాయాలు:

’చలనచిత్ర సాంకేతిక శిల్పం’ అనే గ్రంథంలో N.వెంకటేశ్వరరావు గారు ఈ సినిమా గురించి ఇలా అంటారు.

1919 లో వచ్చిన The Cabinet of Dr Caligari చిత్రం మొట్టమొదటి ఫాంటసీ చిత్రం అని చెప్పుకోవచ్చు. మతి భ్రమించిన వ్యక్తి మెదడు ఏ విధంగా పని చేస్తుందో తెలియచేసిన సంచలనాత్మక కొత్త ప్రయోగం. ఫ్రాయిడ్ సైకాలజీ సిద్ధాంతాల ఆధారంగా కళా ప్రపంచంలోనూ ఆలోచనలు రేకెత్తించిన సినిమా.

డాక్టర్ కాలిగరి చిత్రాన్ని దర్శకులు వీని(Robert Weine) ఎంతో బీభత్సభయానకమైన కల్పిత గాథవలె నిర్మించారు. ఆరంభంలో ఏమీ చెప్పకుండానే, ఏమీ తెలియపర్చకనే మంత్ర ముగ్థవంటి ప్రతిమల పరిచయం ద్వారా పరిష్కార మార్గాలు లేని ప్రపంచంలో ప్రేక్షకుని పడవైచి, చిత్రం పూర్తయ్యే పర్యంతం క్షణక్షణం విజృంభిస్తున్న భయాందోళనలతో ప్రేక్షకుని పట్టి వుంచారు దర్శకులు. మతి భ్రమించిన వాని మెదడులో మాత్రమే అప్పటివరకూ సంభవించినదంతా జరిగిందని చిత్ర దృశ్యాంతంలో మాత్రమే దర్శకులు వీని ప్రేక్షకులకు బయట పెట్టారు.

’Cinema will save us’ అంటున్న గౌతమ్ వల్లూరి తన బ్లాగులో ఈ సినిమా గురించి రాస్తూ ఇలా అన్నారు:

Robert Weine tells us a tale of a deranged brilliant psychologist- Dr.Caligari and his somnambulist slave- Cesare. Set against a fantastic outback of Expressionist set design, ‘The Cabinet’ shines with darkness unlike any other film ever made. Bizarre and incredible trapezoidal doorways, ridiculously tall furniture and severely inclined streets are just a few noticeable elements of the world of Dr.Caligari. The unrealistic environment adds to the note that the entire film is being told by Francis who, at the end of the film is revealed to be deranged himself.

‘The Cabinet of Dr.Caligari’ is a 51-minute journey into a painting-in-progress, where the viewer is actually witnessing the various brush strokes as they paint a masterpiece. The film can only be perceived as beautifully grotesque.

The story is the work of a genius, even by present day standards.

Spiro Agnew in IMDB says

The set design here is amazing, not a single right angle can be found in any one of the sets. This may not only apply to the disjointed and distorted characters in the film, but also the state of Germany at the time. After all, the film was made in the dark ages in Germany between WWI and WWII. This point is validated by Siegfried Kracauer, with his notion of how the main character of Dr. Caligari can be easily interpreted to Hitler, and vice versa. Both controlled subjects with a form of “brainwashing”, both were upset with current forms of society and government, and both were masters of deception. In a period where Germans were looking for direction, and let’s face it, authority as well, Dr. Caligari embodied it fully.

phesto_d from here says

The fantastic stylized sets capture the subjective perceptions of the main character by shaping the scenery from his thoughts, an important cinematic innovation. One of the most memorable aspects of this famous decor is the number of acutely angled shapes and pointed objects sprinkled throughout; it has to be one of the most jagged set designs in film history. This characteristic subtly reminds one of the stabbings Cesare carries out at the bidding of Dr. Caligari. These sharp geometric figures also convey a pervading sense of danger and evil throughout the city which, in retrospect, can be seen as the paranoid worldview of the narrator. Interestingly, the two areas that are relatively devoid of these sharp lines are Jane’s house and inside the insane asylum where rounded designs prevail. These places where comfort and normality should preside are both threatened in the inner story. Of course, all of the events and settings within this framed narrative can be explained functionally by Francis’ psychosis, but the images should be seen in their own aesthetic terms as well. For instance, the crooked asymmetry of the windows and other objects in various scenes signifies the narrator’s skewed view of reality but are also visually striking and pleasantly different. Cesare’s carrying off of Jane over crooked buildings and their trek through a twisted forest are also memorable representations of a distorted vision of the world.

ముగింపు: మనోజ్ నైట్ శ్యామనలన్ ’సిక్స్త్ సెన్స్’, ఆల్ఫ్రెడ్ హిచ్‍కాక్ ’సైకో’ చిత్రాల తర్వాత వాటితో పోల్చగల ‘సర్ప్రైజ్ ఎండింగ్’ లేదా ‘anti-climax’ ఉన్న సినిమా మరొకటి వుండదేమో అనిపించింది. కానీ ’క్యాబినెట్ ఆఫ్ డా.కలిగరి’ సినిమా చూసాక వాటితో పోల్చగల మరో సినిమా ఉందనిపించడమే కాక దాదాపు వందేళ్ళ క్రితమే అలాంటి సినిమా రావడం, అది కూడా ఆ సినిమా బ్లాక్ అండ్ వైట్ మరియు మూకీ సినిమా కావడం ఇంకా ఆశ్చర్యం కలిగించింది.ఈ సినిమా భావవ్యక్తీకరణ వాదపు సినిమానా కాదా, ఇందులో అప్పటి జర్మనీ ప్రజల మానసిక పరిస్థుతులను ఎలా చిత్రించారు లాంటి విషయాల పట్టింపు లేకుండా కూడా కేవలం వినోదం కోసమైనా చూడదగ్గ సినిమా ఇది. కాకపోతే 90 సంత్సరాల క్రితం వచ్చిన సినిమా కాబట్టి ఇప్పటి సినిమాలతో పోల్చకుండా అప్పటి పరిస్థుతులు, సాంకేతిక పరిమితులు దృష్టిలో వుంచుకుని చూస్తే మేలని నా అభిప్రాయం.

14 Comments
    • su July 25, 2009 /
  1. శంకర్ September 6, 2008 /
  2. HalleY October 28, 2008 /
  3. ravi December 11, 2008 /
  4. ravi December 11, 2008 /
  5. ravi December 11, 2008 /
  6. su July 25, 2009 /
  7. Kiran kumari December 25, 2013 /